ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇండియాలో కోవిడ్ -19 వాక్సిన్ క‌వ‌రేజ్ 31 కోట్లు దాటింది.


గ‌త 24 గంట‌ల‌లో 61.19 ల‌క్ష‌ల వాక్సిన్ డోస్‌లు వేశారు.

ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 48,698 కోవిడ్ పాజిటివ్ కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

ఇండియాలో క్రియాశీల కేసుల సంఖ్య మ‌రింత గా త‌గ్గి 5.95,565 కు ఏరింది. వ‌రుస‌గా 86 వ రోజు 6 ల‌క్ష‌ల దిగువ‌లో ఉంది.

రోజువారీ రిక‌వ‌రీలు, కొత్త కేసుల క‌న్న వ‌రుస‌గా 44 వ‌రోజు ఎక్కువ‌గా ఉన్నాయి.

రిక‌వ‌రీ రేటు 96.72 శాతానికి పెరిగింది.

రోజువారి పాజిటివిటి రేటు 2.79 శాతంగా ఉంది. కోవిడ్ పాజిటివిటి రేటు వ‌రుస‌గా 19 రోజులుగా 5 శాతం దిగువ‌నే ఉంది.

Posted On: 26 JUN 2021 10:46AM by PIB Hyderabad

ఇండియా వాక్సినేష‌న్ క‌వ‌రేజ్ నిన్న‌టివ‌ర‌కు 31 కోట్లు దాటి చెప్పుకోద‌గిన మైలురాయిని అధిగ‌మించింది. మొత్తం 31,50,45,926 వాక్సిన్ డోస్‌లు 42,00,839 సెష‌న్‌ల‌లో వేశారు. ఈ రోజు ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు అందిన ప్రాథ‌మిక నివేదిక ప్ర‌కారం గ‌త 24 గంట‌ల‌లో 61,19,169 వాక్సిన్ డోస్‌లు వేశారు

--------------------------------------------------------------------------------------------
హెచ్‌.సి.డ‌బ్ల్యు లు                                                 1వ డోస్           1,01,83,459

                                                                                 2 వ డోస్           71,75,222

ఎఫ్‌.ఎల్‌.డ‌బ్ల్యులు                                                    1 వ డోస్         1,74,05,275
                                                                                   2వ డోస్             93,02,922

18-44 సంవ‌త్సారాల మ‌ధ్య వ‌య‌స్కులు              1 వ డోస్           7,91,80,154
                                                                                   2 వ‌డోస్               17,15,458

45-59 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్కులు                1 వ‌డోస్            8,59,69,905

                                                                                   2 వ డోస్‌             1,40,81,556


60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారు                             1 వ డోస్              6,70,95,979
                                                                                     2 వ డోస్             2,29,35,996

-------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం                                                                                                  31,50,45,926

---------------------------------------------------------------------------------------------------------------------


కోవిడ్ -19 సార్వ‌త్రిక వాక్సినేష‌న్ కొత్త‌ద‌శ కార్య‌క్ర‌మం 2021 జూన్ 21 నుంచి ప్రారంభ‌మైంది. కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని దేశ‌వ్యాప్తంగా వేగ‌వంతం చేసి దీనిని మ‌రింత విస్త‌రింప చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది.
ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 48,698 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

వ‌రుస‌గా 19 రోజులుగా ల‌క్ష కంటే త‌క్కువ కొత్త కేసులు న‌మోదౌతున్నాయ‌. కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిరంత‌ర కృషివ‌ల్ల కేసుల‌లో త‌గ్గుద‌ల సాధ్య‌మైంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018DBW.jpg
ఇండియాలో క్రియాశీల కేసుల సంఖ్య  నిరంత‌రం త‌గ్గుతూ వ‌స్తోంది. దేశ క్రియాశీల కేస్‌లోడ్ ఈరోజు 5,95,565 గా ఉంది. క్రియాశీల కేసులు 86 రోజుల త‌ర్వాత 6 ల‌క్ష‌ల దిగువ‌కు చేరాయి.


గ‌త 24 గంట‌ల‌లో కేసుల‌లో నిక‌ర త‌గ్గుద‌ల 17,303. క్రియాశీల కేసులు దేశ మొత్తం పాజిటివ్ కేసుల‌లో 1.97 శాతం మాత్ర‌మే.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VA9R.jpg          . 

కోవిడ్ -19 మ‌హ‌మ్మారినుంచి రోజూ ఎక్కువ‌మంది కోలుకుంటున్నారు. వ‌రుస‌గా 44 రోజులుగా కోవిడ్ కేసుల క‌న్న కోవిడ్ నుంచి కోలుకున్న వారి కేసులు ఎక్కువ‌గా ఉంటున్నాయి. గ‌త 24 గంట‌ల‌లో 64,818 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

 రోజువారి కొత్త కేసుల కంటే 16,000 మందికి పైగా (16,120) మంది గ‌త 24 గంట‌ల‌లో కోవిడ్ నుంచి కోలుకున్నారు.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VA9R.jpg

 కోవిడ్ మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ నుంచి 2,91,93,085 మంది కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల‌లో 64, 818 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రిక‌వ‌రీ రేటు 96.72 శాతానికి చేరింది. ఇది గ‌ణ‌నీయ‌మైన పురోగ‌తిని సూచిస్తోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00483NQ.jpg
దేశ‌వ్యాప్తంగా కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. దీనితో గ‌త 24 గంట‌ల‌లో 17,35,781 కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 39.78 కోట్లు (39,95,68,448) .

.ఒక వైపు దేశ‌వ్యాప్తంగా కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు పెరంచ‌డంతో, వార‌పు పాజిటివిటి రేటు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుండ‌డాన్ని గుర్తించారు. వార‌పు పాజిటివిటి రేటు ప్ర‌స్తుతం 2.97 శాతంగా ఉంది. రోజువారి పాజిటివిటి రేటు ఈరోజు2.79 శాతం. ఇది వ‌రుస‌గా 19 వ‌రోజు 5 శాతం క‌న్న దిగువ‌న ఉంది.



(Release ID: 1730548) Visitor Counter : 176