ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ జ‌గ‌న్నాథ్ రావు జోశీ గారి కి ఆయ‌న101వ జ‌యంతి నాడు శ్ర‌ద్ధాంజ‌లి అర్పించిన ప్ర‌ధాన మంత్రి 

Posted On: 23 JUN 2021 4:44PM by PIB Hyderabad

భారతీయ జ‌న సంఘ్ లోను, భార‌తీయ జ‌న‌తా పార్టీ లోను సీనియ‌ర్ నేత శ్రీ జ‌గ‌న్నాథ్ రావు జోశీ గారి 101వ జ‌యంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న కు శ్ర‌ద్ధాంజ‌లి అర్పించారు.   

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో : 

‘‘శ్రీ జ‌గ‌న్నాథ్ రావు జోశీ గారి 101వ జ‌యంతి నాడు ఆయ‌న కు శ్ర‌ద్ధాంజ‌లి అర్పిస్తున్నాను.  జ‌గ‌న్నాథ్ రావు గారు ఒక ప్రసిద్ధ నిర్వాహ‌కుడు, అంతేకాదు ప్ర‌జల మధ్య ఆయ‌న అలుపెరుగ‌క కృషి చేశారు.  జ‌న సంఘ్ ను, బిజెపి ని ప‌టిష్ట ప‌ర‌చ‌డం లో ఆయ‌న ది ఎంతో పెద్ద పాత్ర.  ఆయన ఒక ఉత్కృష్ట పండితుడు, మేధావి కూడాను’’ అని పేర్కొన్నారు.

 

***
 

 

DS


(Release ID: 1729802) Visitor Counter : 192