సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 'యోగా ఓ భారతీయ వారసత్వం' అనే థీమ్‌తో భారతదేశంలోని 75 వారసత్వ ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి


ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన భవిష్యత్తు కోసం యోగా చేపట్టాలని శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ యువతను కోరారు.

Posted On: 21 JUN 2021 1:04PM by PIB Hyderabad

ఏడవ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి (ఐ/సి) శ్రీ ప్రహ్లాద్‌ సింగ్ పటేల్ సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖల అధికారులతో పాటు యోగా నిపుణులు మరియు యోగా అభిమానులతో కలిసి యోగా చేశారు. 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి 'యోగా, యాన్ ఇండియన్ హెరిటేజ్' డ్రైవ్‌కు అధ్యక్షత వహించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య జ్ఞాపకార్థం మంత్రిత్వ శాఖ యొక్క అన్ని సంస్థల చురుకైన భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం 75 సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను నిర్వహించింది. ప్రస్తుత మహమ్మారి పరిస్థితి నేపథ్యంలో ప్రతి ప్రదేశంలో యోగాలో పాల్గొనే వారి సంఖ్య 20 కి పరిమితం చేయబడింది. యోగా ప్రదర్శనకు ముందు, కేంద్ర మంత్రి మరియు కార్యక్రమానికి హాజరైన వారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రసంగం యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూశారు.

 



ఎర్రకోటలో యోగా వేడుకల తరువాత శ్రీప్రహ్లాద్ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ యోగా మన గొప్ప వారసత్వమని తెలిపారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఘనత ఫలితంగా ఈ వెల్నెస్ మంత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఫలితంగా నేడు ప్రపంచం అంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అలాగేప్రజలు దీనిని వారి జీవితాలలో భాగంగా చేసుకున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం జ్ఞాపకార్థం అమృత్‌మహోత్సవ్‌లో భాగంగా ఐడివై 2021 జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. దీని ప్రకారం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 75 వారసత్వ ప్రదేశాలలో యోగా కార్యక్రమాలను నిర్వహించింది. ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన భవిష్యత్తును ఆస్వాదించడానికి యువత తమ జీవితంలో యోగాను చేపట్టాలని ఆయన కోరారు.



అనేక భాషలలో సాధారణ యోగా ప్రోటోకాల్ ఆధారంగా యోగా శిక్షణకు సంబంధించిన అనేక వీడియోలను ప్రపంచానికి అందించేందుకు ఈ రోజు మైయోగా యాప్‌ను రూపొందించినట్టు ప్రధాని ప్రకటించారని శ్రీ పటేల్ అన్నారు. మైయోగా యాప్ ఈ ప్రపంచంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవించడానికి ఖచ్చితంగా సహాయపడుతుందని ఆయన అన్నారు.

 

 



ఆచార్య ప్రతిష్ఠ మార్గదర్శకత్వంలో ఎర్ర కోట వద్ద యోగా  ప్రదర్శన జరిగింది. ఈ యోగా డ్రైవ్‌కు కార్యదర్శి (సంస్కృతి) జిఒఐ శ్రీ రాఘవేంద్రసింగ్, కార్యదర్శి (పర్యాటక) జిఓఐ, శ్రీ అరవింద్ సింగ్, మంత్రిత్వ శాఖ ఇతర సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.

 



సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఎల్లోరా గుహలు (ఔరంగాబాద్), నలంద (బీహార్), సబర్మతి ఆశ్రమం (గుజరాత్), హంపి (కర్ణాటక), లడఖ్ శాంతి స్థూపం (లేహ్), సాంచి స్థూపం (విధిషా), షీష్ మహల్ (పాటియాలా) రాజీవ్ లోచన్ ఆలయం (ఛత్తీస్‌గడ్), బొమ్డిలా (అరుణాచల్ ప్రదేశ్) వంటి వారసత్వ ప్రదేశాలలో యోగా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది.
 

 


షీష్ మహల్, పాటియాలా


వరంగల్ కోట, వరంగల్


ఎల్లోరా గుహలు, ఎల్లోరా, ఔరంగాబాద్


గంగైకొండ,చోలపురం


బొమ్డిలా (అరుణాచల్ ప్రదేశ్)


రాజీవ్ లోచన్ ఆలయం, ఛత్తీస్‌గడ్‌


హంపి సర్కిల్
 
*******



(Release ID: 1729091) Visitor Counter : 149