ప్రధాన మంత్రి కార్యాలయం

యోగ ప్ర‌పంచం లో మూల‌ మూల‌ కు చేరుకొనేట‌ట్లుగా మ‌నం ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉండాలి:  ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 21 JUN 2021 8:11AM by PIB Hyderabad

 

యోగ ప్ర‌పంచం లోని మూల‌ మూల‌ కు చేరుకొనేట‌ట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అని యోగ ఆచార్యులకు, యోగ ప్ర‌చార‌కుల‌ కు, యోగ తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు.  ఆయన ‘7వ అంత‌ర్జాతీయ యోగ దినం’ సంద‌ర్భం లో ప్ర‌సంగిస్తూ, ఈ సందేశాన్ని ఇచ్చారు.

గీత లో చెప్పిన మాట‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ యోగ లో ప్ర‌తి ఒక్క‌రి కోసం స‌మాధానం ఉందని, ఈ కార‌ణం గా యోగ తాలూకు సామూహిక యాత్ర ను మ‌నం అందరమూ కొన‌సాగిస్తూ ఉండ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.  కష్టాల నుంచి ముక్తే యోగ అని, మరి అది ప్ర‌తి ఒక్క‌రికీ స‌హాయ‌ప‌డుతుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

యోగ కు పెరుగుతున్న లోకప్రియ‌త్వం, యోగ అంటే ప్ర‌జ‌ల లో పెల్లుబుకుతున్న ఆస‌క్తి ని గురించి ప్ర‌ధాన మంత్రి చెప్తూ, యోగ తన పునాది ని, మూలాన్ని ఉన్నది ఉన్నట్లు గా పరిరక్షించుకొంటూ ప్ర‌తి ఒక్క వ్య‌క్తి కి చేరువ కావడం ముఖ్య‌ం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  యోగ ను అందరి చెంత‌ కు తీసుకు పోయే కర్తవ్యం లో యోగ ఆచార్యుల తో పాటు మ‌నలో ప్ర‌తి ఒక్క‌ వ్యక్తి కూడా వారి వంతు గా తోడ్పాటు ను అందించాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.



 

***


(Release ID: 1728960) Visitor Counter : 192