ఆయుష్

ఐడివై-2021 స్మారకంగా భారత తపాలా శాఖ 800 స్థానాల్లో ప్రత్యేక క్యాన్సిలేషన్ తపాలా బిళ్ళను జారీ చేయడానికి ఏర్పాట్లు; ఇప్పటివరకు అతిపెద్ద ఫిలాటెలిక్ స్మారక చిహ్నాలలో ఒకటి

Posted On: 19 JUN 2021 2:46PM by PIB Hyderabad

అంతర్జాతీయ యోగ దినోత్సవం (ఐవైడి)ని  పురస్కరించుకుని, ఆ స్ఫూర్తిని ప్రతిబింబించేలా జూన్ 21 వ తేదీన తపాలా శాఖ ప్రత్యేక క్యాన్సలేషన్ స్టాంపును తీసుకురావాలని సంకల్పించింది. ఒక ప్రత్యేక చిత్రంతో ఉన్న ఈ తపాలా బిళ్ళను దేశవ్యాప్తంగా 810 హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి తీసుకురన్నారు. ఒకే సారి ఇన్ని ప్రాంతాల్లో స్మారక తపాలా బిళ్ళను తేవడం ఇప్పటివరకు జరిపిన అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటి.  

డెలివరీ, నాన్-డెలివరీ హెడ్ పోస్టాఫిసులన్నిటిలో 21వ తేదీన బుక్ చేసే మెయిల్స్ లో ఈ స్మారక తపాలా బిళ్ళను వాడతారు. సిరా మార్కు లేదా ముద్రను యోగ దినోత్సవాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం 21 జూన్ 2021 అని ఆంగ్లం, హిందీ భాషల్లో ఆ ప్రత్యేక తపాలా పై ముద్రించి ఉంటుంది. తిరిగి ఆ బిళ్ళను మరో సారి వినియోగించుకునే వీలు లేకుండా క్యాన్సిలేషన్ స్టాంపుపై ప్రత్యేక ముద్ర వేస్తారు. .

 కొన్ని సంవత్సరాలు క్రితం వరకు తపాలా బిళ్ళల సేకరణ అనేది ఒక అభిరుచులా ఉండేది, అయితే ఆ ఆసక్తి క్రమేణా తగ్గుతూ వస్తోంది. ఈ అలవాటు లేదా అభిరుచిని పునరుద్ధరించడానికి తపాలా శాఖ ఫిలాటెలిస్టులకు ఒక పథకాన్ని అమలు చేస్తోంది. కొన్ని ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులలో విభిన్న తపాలా బిళ్ళను సేకరించే వారి కోసం ఫిలాటలిక్ బ్యూరో లను ఏర్పాటు చేశారు. వాటిలో రూ.200 డిపాజిట్ చేసి స్టాంపులు, ప్రత్యేక కవర్లను పొందవచ్చు. వీటితో పాటు స్మారక తపాలా బిళ్ళలు ఈ బ్యూరోలలొ ఫిలాటలిక్ డిపాజిట్ స్కీం కింద లభిస్తాయి. అయితే అటువంటి స్టాంపులను కొంత పరిమితంగానే ముద్రిస్తారు. 

ఫిలాటలిక్ స్మారక చిహ్నాలలో యోగ, ఐడివై లు గత కొన్ని సంవత్సరాలుగా బాగా ప్రాచుర్యం పొందాయి. 2015 లో, పోస్టల్ విభాగం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రెండు స్టాంపులు, ఒక చిన్న షీట్‌ను ముద్రించింది. 2 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2016 లో ప్రధాని నరేంద్ర మోడీ సూర్య నమస్కారంలో స్మారక తపాలా బిళ్ళలను విడుదల చేశారు. 2017 లో, యుఎన్ పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ (యుఎన్‌పిఎ) న్యూయార్క్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 యోగా ఆసనాలను చూపించే స్టాంపుల సమితిని విడుదల చేసింది. 

ఐడివైని గత ఆరు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ (తరచుగా సృజనాత్మక) మార్గాల్లో జరుపుకుంటారు. భారతదేశంలో, గతంలోని చాలా అందమైన చిత్రాలు యోగా దినోత్సవ వేడుకలను చిత్రీకరించాయి. ఇందులో హిమాలయాల మంచు పరిధులలో యోగా ప్రాక్టీస్ చేస్తున్న భారత సైన్యం సిబ్బంది, నావికాదళ అధికారులు మరియు డికమిషన్ చేయబడిన ఐఎన్ఎస్ విరాట్ పై యోగా చేస్తున్న క్యాడెట్లు, ఐడివై మెసేజింగ్ తో ఇసుక శిల్పాలను సృష్టించడం, భారత నావికాదళ జలాంతర్గామి ఐఎన్ఎస్ 'సింధురత్న' పై యోగా చేస్తున్న భారత నావికాదళ అధికారులు ఉన్నారు.

 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యుఎన్‌జిఎ) జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై)గా 2014 డిసెంబర్ 11 న ఆమోదించిన తీర్మానంలో  ప్రకటించింది. 2015 నుండి, ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. క్రమేణా పాల్గొన్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. 

ఈ సంవత్సరం కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెంది ఉన్న పరిస్థితుల్లో చాల కార్యక్రమాలు వర్చ్యువల్ గానే జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రధానంగా  “యోగాతో ఉండండి, ఇంట్లో ఉండండి” అనే ఇతివృత్తంతో ప్రచారం చేపట్టారు. లాక్డౌన్ నుండి దేశం జాగ్రత్తగా బయటకు వస్తున్నందున, 800 కంటే ఎక్కువ చోట్ల సేకరణలతో కూడిన ఈ భారీ తపాలా స్మారక కార్యక్రమం అపారమైన ఫిలాటెలిక్ అవకాశాలను మరో సారి అందుబాటులోకి తెస్తోంది.

 

***



(Release ID: 1728742) Visitor Counter : 168