మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పాఠశాల మూసివేత సమయంలోనూ, ఆ తర్వాత, ఇంటి నుంచి జరిగే విద్యాభ్యాసంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మార్గదర్శకాలను విడుదల చేసిన - విద్యా మంత్రిత్వ శాఖ


సురక్షితమైన, సానుకూల విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన - మార్గదర్శకాలు

Posted On: 19 JUN 2021 2:10PM by PIB Hyderabad

పాఠశాల మూసివేత సమయంలోనూ, ఆ తర్వాత, ఇంటి నుంచి జరిగే విద్యాభ్యాసంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం,  కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, ఈరోజు, మార్గదర్శకాలను విడుదల చేసింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్‌ చేస్తూ, మహమ్మారి యొక్క ఈ ‘క్రొత్త సాధారణ’ పరిస్థితుల్లో, పిల్లల పెరుగుదల మరియు అభ్యాసానికి తల్లిదండ్రుల పాత్ర కీలకంగా పరిగణించి, పాఠశాల మూసివేత సమయంలో పిల్లలను ఆదుకోవడంలో పాల్గొనడం ‘ఎందుకు’, ‘ఏమిటి’, ‘ఎలా’ అనే సమాచారాన్ని తల్లిదండ్రుల అక్షరాస్యత స్థాయిల తో సంబంధం లేకుండా వారికి అందించడం, ఈ మార్గదర్శకాల లక్ష్యం. ఇల్లే మొదటి పాఠశాల, తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులు, అని పేర్కొన్నారు. 

తల్లిదండ్రులు సురక్షితమైన, వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరంతో పాటు,  సానుకూల అభ్యాస వాతావరణం, పిల్లల నుంచి వాస్తవిక అంచనాలను కలిగి ఉండడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఆరోగ్యంగా తినడం, అదే సమయంలో పిల్లలతో ఆనందంగా గడపడం అంశాలను,  గృహ ఆధారిత విద్యాభ్యాసం పై విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు, నొక్కి చెబుతున్నాయి.  ఈ మార్గదర్శకాలు తల్లిదండ్రులకు మాత్రమే కాదు, సంరక్షకులు, తల్లిదండ్రుల తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులు, సామాజంలోని సభ్యులు, విద్యార్థుల కంటే పెద్ద తోబుట్టువులతో పాటు, పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో నిమగ్నమైన వారందరి ఉపయోగం కోసం రూపొందించడం జరిగింది.  

గృహ ఆధారిత అభ్యాసంలో పిల్లలను సులభతరం చేయడానికి ఈ మార్గదర్శకాలు తల్లిదండ్రులు మరియు ఇతరులకు చాలా సులభమైన చిట్కాలను అందిస్తాయి.  ఈ సూచనలన్నీ, నూతన విద్యా విధానం-2020 ప్రకారం పాఠశాల విద్య యొక్క వివిధ దశలకు అనుగుణంగా ఉంటాయి.  వయసుకి తగిన విధంగా ఈ కార్యకలాపాలు 5 + 3 + 3 + 4 వ్యవస్థ ఆధారంగా వర్గీకరించబడ్డాయి. అంటే - ఫౌండేషన్ స్టేజ్ (వయస్సు 3-8 సంవత్సరాలు); ప్రిపరేటరీ స్టేజ్ (వయసు 8-11 సంవత్సరాలు);  మధ్య దశ (వయసు 11-14 సంవత్సరాలు); మరియు ద్వితీయ దశ: కౌమార దశ నుండి వయోజన వయస్సు వరకు (వయస్సు 14-18 సంవత్సరాలు).  ఈ కార్యకలాపాలు సరళమైనవిగా, సూచించదగినవిగా ఉంటాయి. వీటిని స్థానిక అవసరాలు, సందర్భాలకు అనుగుణంగా స్వీకరించవచ్చు, మార్చవచ్చు.  ఒత్తిడి లేదా బెదురుతో ఉండే పిల్లలకు చికిత్సగా అందించే కళాత్మకమైన విద్య ను ఈ మార్గదర్శకాలు అభినందిస్తున్నాయి.

పిల్లల విద్యాభ్యాసంలో అంతరాలను పర్యవేక్షించడం, పరిష్కరించడం ద్వారా పిల్లల అభ్యాసాన్ని మెరుగుపరచడంలో, ఈ మార్గదర్శకాలు ప్రాముఖ్యతనిస్తాయి.  పిల్లలు తమ అభ్యాసంలో సాధిస్తున్న పురోగతిని నమోదు చేయడంలో మరియు ప్రతిబింబించడంలో ఉపాధ్యాయులతో తల్లిదండ్రుల సహకారం, అటు ఉపాధ్యాయులకు, ఇటు, తల్లిదండ్రులకు, చాలా ముఖ్యమైనది.

ఇంటి వద్ద హోంవర్కు, ఇతర పాఠ్యాంశాల సంబంధిత కార్యకలాపాలు, నిర్ణయాలు, ప్రణాళికలను విద్యార్థులకు నేర్పించడంలో తల్లిదండ్రులకు సహాయం చేయడంతో పాటు పాఠశాల నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని కూడా, ఈ మార్గదర్శకాలు, పాఠశాలలకు సూచిస్తున్నాయి. అదేవిధంగా, వార్తాలేఖలు, ఈ-మెయిల్, మెమోలు మొదలైనవి పంపడం వంటి వనరులను తల్లిదండ్రులకు అందించవచ్చు.

ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు వనరులు అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిని తల్లిదండ్రులు అన్వేషించవచ్చు. ఈ విషయంలో మార్గదర్శకత్వం కోసం వారు ఉపాధ్యాయులను సంప్రదించవచ్చు.  ఎస్.ఎం.సి. లు / గ్రామ పంచాయతీ, పాఠశాల నిర్వాహకులు మొదలైన వారి నుంచి అవసరమైన సమాచారాన్ని అందించడానికి ఇతర ఏజెన్సీలు మరియు సంస్థలు ఉన్నాయి.

తక్కువ అక్షరాస్యత / అక్షరాస్యత లేని తల్లిదండ్రులను ఆదుకోవడానికి మార్గదర్శకాలలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చడం జరిగింది.  తక్కువ అక్షరాస్యత కలిగిన తల్లిదండ్రులకు సహాయాన్ని అందించడానికి, పాఠశాలలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద కార్యకర్తలు - సూచనాత్మక చర్యలు తీసుకోవచ్చు.

మార్గదర్శకాలు వీక్షించడానికి ఇక్కడ నొక్కండి

 

*****(Release ID: 1728697) Visitor Counter : 162