ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

2021-22 సంవత్సరానికి గాను ఫాస్ఫాటిక్ & పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువుల పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్‌) రేట్లకు క్యాబినెట్ ఆమోదం

Posted On: 16 JUN 2021 3:36PM by PIB Hyderabad

కేంద్ర ఎరువుల శాఖ 2021-22 సంవత్సరానికి గాను (ప్రస్తుత సీజన్ వరకు) ప్ర‌తిపాదించిన‌ ఫాస్ఫాటిక్ & పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువుల పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్‌) రేట్ల ప్ర‌తిపాద‌న‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన స‌మావేశ‌మైన‌ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్ తేదీ నుండి ఎన్‌బీఎస్ కోసం ఆమోదించబడిన రేట్లు ఈ క్రింది విధంగా అమ‌లవుతాయి:

కిలో ఒక్కింటికి స‌బ్సిడీ రేట్లు (రూ.ల‌లో)

 

ఎన్ (న‌త్ర‌జ‌ని) 

 

పీ (భాస్వ‌రం)

 

కే (పొటాష్‌)

 

ఎస్ (గ్రంధ‌క‌ము)

 

18.789

 

45.323

 

10.116

 

2.374

 

 

ఎరువుల తయారీదారులు / దిగుమతిదారుల ద్వారా సబ్సిడీ ధరలకు యూరియా, 22 గ్రేడ్ల పీ అండ్ కే ఎరువులు (డీఏపీతో సహా) అన్ని ఎరువుల్ని భారత ప్రభుత్వము అందుబాటులో ఉంచుతోంది. పీ అండ్ కే ఎరువులపై సబ్సిడీ ధ‌ర‌ను 01.04.2010 నుంచి ఎన్‌బీఎస్‌ పథకం ప‌ర్య‌వేక్షిస్తోంది.  రైతు స్నేహపూర్వక విధానానికి అనుగుణంగా, రైతులకు అందుబాటు ధరలకు పీ అండ్ కే ఎరువుల లభ్యత ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్‌బీఎస్ రేట్ల ప్రకారంగా ఎరువుల కంపెనీలకు స‌బ్సిడీని విడుదల చేస్తారు. తద్వారా ఆయా కంపెనీలు ఎరువులను రైతులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చూస్తారు. గత కొన్ని నెలలుగా డీఏపీ మరియు ఇతర పీ అండ్ కే ఎరువుల ముడి పదార్థాల ధ‌ర‌లు అంతర్జాతీయంగా బాగా పెరిగాయి. ఈ ధ‌ర‌లు వేగంగా పెరిగిన‌ప్ప‌టికీ భారతదేశంలో డీఏపీ ధరలను మొదట్లో కంపెనీలు పెంచలేదు, అయితే కొన్ని కంపెనీలు ప్ర‌స్తుత‌ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డీఏపీ ధరల‌ను పెంచాయి. రైతుల ఆందోళనలపై  పూర్తిగా అవ‌గాహ‌న‌తో ఉన్న ప్ర‌భుత్వం, పీ & కే ఎరువుల (డీఏపీతో సహా) ధరల పెరుగుదల ప్రభావాల నుండి వ్యవసాయ సమాజాన్ని రక్షించడానికి  వీలుగా పరిస్థితిని పరిష్కరించడానికి ఇప్పటికే ప‌లు చర్యల‌ను చేప‌ట్టింది. దీని ప్రకారం, మొదటి దశగా రైతులకు మార్కెట్లో ఈ ఎరువులు తగినంతగా లభించేలా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఎరువుల సంస్థలను ఆదేశించింది. దేశంలో ఎరువుల లభ్యతను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. డీఏపీ ధరల విష‌యంలో ప్ర‌భుత్వం త‌గిన జాగ్ర‌త్త‌లు చేప‌ట్టింది. అన్ని ఎరువుల కంపెనీలను తమ పాత డీఏపీ నిల్వ‌ల‌ను పాత ధరలకు మాత్రమే విక్ర‌యించాల‌ని కోరింది.
ఖ‌జానాపై రూ.14,775 కోట్ల మేర భారం..
కోవిడ్‌-19 వైర‌స్  మహమ్మారి యొక్క రెండవ విడ‌త వ్యాప్తిలో ఆకస్మికంగా కేసుల పెరుగుదల కారణంగా దేశం మరియు పౌరులు (రైతులతో సహా) అసాధారణ‌మైన కాలాన్ని వెల్ల‌దీస్తున్న విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ముందుగానే గ్ర‌హించి త‌గిన చ‌ర్య‌లు చేపడుతోంది. కోవిడ్‌-19 వైర‌స్‌ మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను పరిగణనలోకి తీసుకుని భార‌త ప్ర‌భుత్వము ఇప్పటికే వివిధ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ క‌ష్ట స‌మ‌యాన‌ భారతదేశంలో డీఏపీ ధరల సంక్షోబః రైతులకు అసాధారణమైన పరిస్థితిగా, తీర‌ని బాధగా పరిగణించింది. రైతులకు ప్రత్యేక ప్యాకేజీగా ఎన్‌బీఎస్‌ పథకం కింద సబ్సిడీ రేట్లను భార‌త ప్ర‌భుత్వం పెంచింది. దీంతో డీఏపీ యొక్క గ‌రిష్ట చిల్లర ధ‌ర‌ను (ఇతర పీ అండ్ కే ఎరువులతో సహా) ఖరీఫ్ సీజన్ వరకు గత సంవత్సరం స్థాయిలో ఉంచవచ్చు. రైతుల కష్టాలను తగ్గించడానికి కోవిడ్‌-19 ప్యాకేజీలో భాగంగా ఈ వ‌న్‌టైమ్ ప‌రిణామంగా ఈ చ‌ర్య తీసుకోవ‌డం జ‌రిగింది. కొన్ని నెలల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుతాయని అంచ‌నా.. అప్పు భార‌త ప్ర‌భుత్వం పరిస్థితిని తదనుగుణంగా సమీక్షించి ఆ సమయంలో సబ్సిడీ రేట్ల గురించి తాజా నిర్ణ‌యాన్ని తీసుకుంటుంది. ఈ చ‌ర్య వ‌ల్ల అంచనా వేసిన అదనపు సబ్సిడీ భారం సుమారు రూ.14,775 కోట్లు.
                                                                                                                                           

******


(Release ID: 1727689) Visitor Counter : 296