ప్రధాన మంత్రి కార్యాలయం

ప‌శ్చిమ బంగాల్ లోని ముర్శిదాబాద్ లోను, క‌ల్యాణి లోను 250 ప‌డ‌క‌లతో ఉండే రెండు తాత్కాలిక కోవిడ్ ఆసుప‌త్రుల ను పిఎమ్ కేర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జ‌రుగుతుంది.

Posted On: 16 JUN 2021 2:14PM by PIB Hyderabad

ప‌శ్చిమ బంగాల్ లోని ముర్శిదాబాద్ లో, క‌ల్యాణి లో 250 ప‌డ‌క‌ల తో ఉండే రెండు తాత్కాలిక కోవిడ్ ఆసుప‌త్రుల ను డిఆర్‌డిఒ ద్వారా ఏర్పాటు చేయ‌డం కోసం 41.62 కోట్ల రూపాయ‌ల‌ ను కేటాయించాల‌ని ప్రైమ్ మినిస్ట‌ర్స్ సిటిజన్ అసిస్టెన్స్ ఎండ్ రిలీఫ్ ఇన్ ఇమ‌ర్జ‌ెన్సి సిట్యువేశ‌న్స్ (పిఎమ్ కేర్స్) ఫండ్ ట్ర‌స్టు నిర్ణ‌యించింది.  దీనికోసం భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌ తో పాటు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా  మౌలిక స‌దుపాయాల సంబంధిత మ‌ద్ధ‌తు ను కొంత వరకు స‌మ‌కూర్చ‌డం జరుగుతుంది.
 
కోవిడ్ స్థితి ని ప్ర‌భావ‌వంత‌మైన విధం గా నిర్వ‌హించ‌డానికి ప‌శ్చిమ బంగాల్ లో ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాల ను ఈ ప్ర‌తిపాద‌న పెంచ‌నుంది.

ప్రైమ్ మినిస్ట‌ర్స్ సిటిజ‌న్ అసిస్టెన్స్ ఎండ్ రిలీఫ్ ఇన్ ఇమ‌ర్జ‌ెన్సి సిట్యువేశ‌న్స్  (పిఎమ్ కేర్స్) ఫండ్ ట్ర‌స్టు ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ను అభివృద్ధి ప‌ర‌చ‌డం లో త‌న వంతు తోడ్పాటు ప్రయాసల లో భాగం గా బిహార్‌, దిల్లీ, జ‌మ్ము, శ్రీన‌గ‌ర్ ల‌లో సైతం కోవిడ్ ఆసుప‌త్రుల‌ ఏర్పాటు లో సాయాన్ని అందించింది.



 

***
 



(Release ID: 1727589) Visitor Counter : 205