యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
టోక్యో ఒలింపిక్స్‌కు మంత్రివర్గ ప్రతినిధుల బృందం పంపడం లేదు
లాజిస్టిక్ మద్దతు కోసం టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలో ఒలింపిక్ మిషన్ సెల్ ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
11 JUN 2021 2:59PM by PIB Hyderabad
టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొననున్న భారత జట్లు, క్రీడాకారుల ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వం
నిరంతరాయంగా సమీక్షించనుంది. అథ్లెట్ల పని తీరును గరిష్ఠపరచడానికి కోచ్‌లు, వైద్యులు, ఫిజియోథెరపిస్టులు వంటి అదనపు సహాయక సిబ్బందిని నియమించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏదైనా ప్రోటోకాల్ అవసరం ఉంటేనే అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది తప్ప వేరే వ్యక్తులను టోక్యోకు పంపే విషయం సమీక్షించబడుతుంది. ఈ ఏర్పట్లలో భాగంగా టోక్యో ఒలింపిక్స్‌కు మంత్రిత్వ శాఖ ప్రతినిధులను పంపకూడదని నిర్ణయించారు. లాజిస్టిక్ మద్దతును అందించడానికి గాను టోక్యోలోని భారత రాయబార కార్యాలయంలో ఒక ప్రత్యేక ఒలింపిక్ మిషన్ సెల్ ఏర్పాటు చేయబడుతోంది. దీని ద్వారా సాధ్యమయ్యే అన్ని రకాల సహాయం సజావుగా అందించబడుతుంది.
*******
(రిలీజ్ ఐడి: 1726263)
సందర్శకుల సూచీ సంఖ్య : : 178