మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఉన్నత విద్యపై జరిగిన అఖిల భారత సర్వే 2019-20 నివేదికకు ఆమోదం తెలిపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి


ఉన్నత విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అద్దంపట్టిన నివేదిక

2015-16 నుంచి 2019-20వరకు 11.4% పైగా పెరిగిన విద్యార్థుల సంఖ్య

ఉన్నతవిద్యలో 2015-16 నుంచి 2019-20 వరకు 18.2% పెరిగిన మహిళల సంఖ్య

2019-20లో 27.1% వరకు పెరిగిన స్థూల నమోదు నిష్పత్తి

Posted On: 10 JUN 2021 2:14PM by PIB Hyderabad

 ఉన్నతవిద్యపై  జరిగిన అఖిల భారత సర్వే నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ రోజు ఆమోదించారు. దేశంలో ఉన్నత విద్యారంగానికి సంబంధించిన అన్ని వివరాలను నివేదికలో పొందుపరిచారు. దేశంలో 

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య 2015-16 నుంచి  2019-20వరకు ఉన్న అయిదు సంవత్సరాల కాలంలో 11.4% పెరిగిందని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మహిళల సంఖ్యలో 18.2% వృద్ధి కనిపించిందని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం బాలికల విద్య, మహిళా సాధికారత, సామాజికంగా వెనుకబడిన తరగతుల సాధికారతను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల ఉన్నత విద్యలో మహిళలు, ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల సంఖ్య పెరిగిందని అన్నారు. సర్వేలో ఇవే అంశాలు వెల్లడి అయ్యాయని మంత్రి వివరించారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం ఉన్నత విద్యారంగం అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు లక్ష్యాల మేరకు అమలు జరుగుతున్నాయని  సర్వే వెల్లడించిందని విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే అన్నారు. దేశంలో ఉన్నతవిద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ నివేదిక తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

దేశంలో ఉన్నతవిద్యపై సర్వేను నిర్వహించడం ఇది పదవసారని ఉన్నతవిద్యా శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే తెలిపారు. విద్యామంత్రిత్వశాఖ ప్రతి ఏడాది నిర్వహిస్తున్నదని చెప్పారు. నూతన విద్యా విధానం 2020 ప్రకారం నాణ్యమైన సమగ్ర విద్యను లింగ వివక్ష లేకుండా అందుబాటులోకి తీసుకుని రావాలన్న  లక్ష్యంతో  విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి, మరిన్ని విద్యాసంస్థలను నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు -

ఉన్నత విద్యా నివేదికపై అఖిల భారత సర్వే 2019-20లో    ముఖ్య అంశాలు :

1.   ఉన్నత విద్యలో మొత్తం నమోదు 3.85 కోట్లుగా ఉంది. 2018-19లో 3.74 కోట్లగా ఉన్న నమోదు సంఖ్య 11.36 లక్షల  (3.04%) వృద్ధిని నమోదు చేసి 2019-20లో 3.85 కోట్లకి చేరింది. ఈ సంఖ్య 2014-15లో3.42గా ఉంది. 

 

2.  స్థూల నమోదు నిష్పత్తి  (జిఇఆర్), ఉన్నత విద్యలో చేరిన అర్హత గల వయస్సు గల విద్యార్థుల శాతం  2019-20లో 27.1%, 2018-19లో 26.3% మరియు 2014-2015లో 24.3%.గా  ఉంది.  

3.  ఉన్నత విద్యలో  2017-18లో  1.00గా ఉన్న లింగ సమానత్వ నిష్పత్తి  (జిపిఐ)   2019-20లో  1.01 గా ఉంది, ఇది పురుషులతో పోలిస్తే అర్హతగల వయస్సు గల మహిళలకి  ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందని వెల్లడిస్తోంది. 

4.   2019-20లో ఉన్నత విద్యలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 26 గా ఉంది. 

5.  2019-20నాటికి దేశంలో 1,043 (2%) విశ్వవిద్యాలయాలు, 42,343 (77%)కళాశాలలు,స్వతంత్ర సంస్థలు: 11,779 (21%) పనిచేస్తున్నాయి.

6.దేశంలో 38 కోట్ల మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కార్యక్రమాలలో చేరారు . వీరిలో హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్  టెక్నాలజీ, మెడికల్ సైన్స్, ఐటి  కంప్యూటర్ వంటి ఆరు ప్రధాన విభాగాలలో దాదాపు 85% మంది విద్యార్థులు (2.85 కోట్లు) చేరారు  .

7.   2019-20లో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థుల సంఖ్య 2.0-15 లక్షలు. ఇది  2014-15లో 1.17 లక్షలుగా ఉంది .

8.  మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 15,03,156, ఇందులో 57.5% పురుషులు, 42.5% స్త్రీలు ఉన్నారు.

నివేదిక చూడటానికి  క్లిక్ చేయండి:

***



(Release ID: 1726032) Visitor Counter : 197