ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజాసమాచారం


టీకా నిల్వల సమాచారానికి ఆరోగ్యమంత్రిత్వశాఖ వారి ఈవిన్ డేటా

ఈవిన్ డేటా దుర్వినియోగ నిరోధానికి కట్టుబడిన కేంద్రం
టీకాలపై పారదర్శకతకు అద్దం పట్టేలా కోవిన్ సమాచారం

Posted On: 10 JUN 2021 12:29PM by PIB Hyderabad

కోవిడ్ నియంత్రణలో భాగంగా జనవరి 16న దేశవ్యాప్తంగా చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని అమలు చేయటంలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న కృషికి కేంద్రప్రభుత్వం అండగా నిలిచింది. సకాలంలో తగినన్ని టీకా డోసులు అందుబాటులో ఉండేలా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది.  దీన్ని క్రమబద్ధం చేయటంలో రవాణా, నిల్వకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చింది.

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వారి ఈవిన్ లో టీకా డోసుల నిల్వ, వాటి ఉష్ణోగ్రత గురించి తెలియజేస్తూ రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మంత్రిత్వశాఖ రాసిన లేఖకు కొన్ని మీడియా సంస్థలు ప్రాచుర్యం కల్పించాయి.

టీకాల నిల్వల గురించి సమాచారాన్ని, విశ్లేషణాత్మక వివరాలను, నిల్వ ఉష్ణోగ్రతలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇతరులకు తెలియజేయవద్దని చెప్పటం వెనుక లక్ష్యం కేవలం ఆ సమాచారం దుర్వినియోగం కాకుండా చూడటమేనని మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. ఇతర సంస్థలు వాణిజ్యపరంగా దుర్వినియోగం చేసే ప్రమాదముందని హెచ్చరించింది.

సార్వత్రిక టీకాల కార్యక్రమంలో భాగంగా ఒక నిర్దిష్ట టీకా ఎంతమంది ఏయే ప్రాంతాల్లో వాడుతున్నారనే సమాచారం వాణిజ్యపరంగా వెలుపలి సంస్థలకు ఉపయోగపడవచ్చుననే అనుమానంతోనే ఈ విధంగా హెచ్చరించాల్సి వచ్చినట్టు మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. దీనివలన టీకా మంది నిల్వలు ప్రభావితం కావచ్చునని భావిస్తోంది.   టీకాల కార్యక్రమానికి సంబంధిమ్చిన పూర్తి సమాచారం కోసం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఈవిన్ డేతాను గత ఆరు నెలలుగా వాడుతున్న సంగతి తెలిసిందే.  నిల్వలు, నిల్వల సమాచారం మీద అలాంటి సున్నితమైన సమాచారాన్ని బైటికి ఇవ్వదలచుకుంటే మంత్రిత్వశాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరుతోంది.

కోవిడ్ టీకాల నిల్వ, వినియోగం, మిగులు తదితర అంశాలను కోవిన్ వేదికమీద కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు మీడియాకు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచుతూనే ఉంది. వారం వారం మీడియా సమావేశాలలోను , పత్రికాప్రకటనల ద్వారా వెల్లడిస్తూనే ఉంది. అయితే, సున్నితమైన సమాచారాన్ని బైటికి వెల్లడించవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అన్ని రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.

పారదర్శకతకు పెద్దపీట వేయటంలో భాగంగా భారత ప్రభుత్వం ఐటి ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి  లబ్ధిదారుని స్థాయిలో కూడా సమాచారం అందేలా కోవిన్ పోర్టల్ ను రూపుదిద్దిన విషయం తెలిసిందే.

****

 

(Release ID: 1725895) Visitor Counter : 191