ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రెండో రోజు కూడా లక్ష లోపు కొత్త కోవిడ్ కేసులు


57 రోజుల తరువాత 13 లక్షల లోపుకు తగ్గిన చికిత్సలో ఉన్న కేసులు
గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 72,287 తగ్గుదల
27వ రోజు కూడా కొత్తకేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ

కోలుకున్నవారి శాతాం 94.55% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 4.66%కు తగ్గుదల, 16 రోజులుగా 10% లోపే
గత 24 గంటల్లో 27.7 లక్షలమందికి పైగా టీకాలు

Posted On: 09 JUN 2021 11:52AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 92,596 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా లక్షలోపు కేసులు నమోదవుతూ ఉన్నాయి. కేంద్రంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో పనిచేయటం వలన ఇది సాధ్యమైంది.

చికిత్సలో ఉన్నకేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు 12,31,415 కు చేరారు. వరుసగా తొమ్మిదో రోజు కూడా 20 లక్షలలోపే ఉంటోంది. గత 24 గంటలలో నికరంగా 72,287 కేసులు తగ్గాయి. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 4.23% మాత్రమే.

దేశంలో రోజువారీ కోలుకుంటున్నవారు కొత్తకేసులకంటే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ధోరణి వరుసగా 27వ రోజు కూడా కొనసాగుతోంది. గత 24 గంటలలో 1,62,664 మంది కోలుకున్నారు.  అంతకుముందు రోజు కంటే 70,068  మంది అదనంగా కోలుకున్నారు. 

కరోనా మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 2,75,04,126 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో కోలుకున్నవారు  1,62,664 గా నమోదయ్యారు. దీంతో కోలుకున్నవారి శాతం పెరుగుతూ  94.55% కు చేరినట్టయింది.  

 

దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 19,85,967 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. దీంతో మొత్తం పరీక్షలు  37 కోట్లు దాటి  37,01,93,563 కు చేరాయి.

ఒకవైపు పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండగా  వారపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది.  ప్రస్తుతం వారపు పాజిటివిటీ  5.66%  ఉండగా రోజువారీ పాజిటివిటీ  4.66% కు తగ్గింది, గత 16 రోజులుగా ఇది 10% లోపే ఉంటోంది.   

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 23.90 కోట్లు దాటగా గత 24 గంటలలో ఇచ్చిన టీకాలు 27,76,096 గా నమోదయ్యాయి. ఇప్పటిదాకా 33,44,533 శిబిరాల ద్వారా 23,90,58,360 డోసుల పంపిణీ జరిగినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం చెబుతోంది.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

99,96,113

రెండో డోస్

68,94,206

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,63,86,094

రెండో డోస్

87,28,340

18-44 వయోవర్గం

మొదటి డోస్

3,18,51,951

రెండో డోస్

3,18,313

45- 60 వయోవర్గం

మొదటి డోస్

7,26,04,407

రెండో డోస్

1,15,39,053

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,12,98,568

రెండో డోస్

1,94,41,315

మొత్తం

23,90,58,360

 

****



(Release ID: 1725628) Visitor Counter : 204