చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా శ్రీ అనూప్‌ చంద్ర పాండే నియామకం

Posted On: 09 JUN 2021 8:46AM by PIB Hyderabad

1984 బ్యాచ్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శ్రీ అనూప్‌ చంద్ర పాండేను భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. శ్రీ పాండే ఎప్పుడు కార్యాలయ బాధ్యతలు స్వీకరిస్తే, ఆ రోజు నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ఈ నియామకంపై కేంద్ర చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. 
 

*****


(Release ID: 1725561) Visitor Counter : 189