మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పిజిఐ) 2019-20 విడుదలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆమోదం

Posted On: 06 JUN 2021 12:20PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ 2019-20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పిజిఐ) 2019-20 విడుదలకు ఆమోదం తెలిపారు. పాఠశాల విద్యారంగంలో పరివర్తనను తెచ్చేందుకు ప్రభుత్వం 70 పారామితులతో పనితీరు గ్రేడింగ్ సూచికను ప్రవేశపెట్టింది. 

రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోసం 2017-18 సంవత్సరం ఆధారంగా పిజిఐ మొదటిసారి 2019-18లో ప్రచురించారు. పిజిఐ: 2019-20 సంవత్సరానికి రాష్ట్రాలు / యుటిలు ఈ సిరీస్‌లో మూడవ ప్రచురణ. పిజిఐ కసరత్తు రాష్ట్రాలు, యుటిలను బహుముఖ జోక్యాలను చేపట్టే దిశగా ప్రేరేపిస్తుంది, అది సరైన విద్య ఫలితాలను అందిస్తుంది. పిజిఐ రాష్ట్రాలు/యుటి లకు అంతరాలను గుర్తించడానికి సహాయపడుతుంది.  తదనుగుణంగా పాఠశాల విద్యా విధానం ప్రతి స్థాయిలో పటిష్టంగా ఉండేలా జోక్యం చేసుకోవడానికి ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తుంది.

పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్, నికోబార్ దీవులు, కేరళ 2019-20 సంవత్సరానికి అత్యధిక గ్రేడ్ (గ్రేడ్ ఎ ++) ను సాధించాయి.

అంతకుముందు సంవత్సరాలతో పోల్చితే చాలా రాష్ట్రాలు / యుటిలు పిజిఐ 2019-20లో తమ గ్రేడ్‌ను మెరుగుపర్చాయి. అండమాన్- నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు మొత్తం పిజిఐ స్కోర్‌ 10% పెరిగింది. అంటే 100 అంతకన్నా ఎక్కువ పాయింట్లు సాధించాయి. 

అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్ మరియు పంజాబ్ 10% (8 పాయింట్లు) లేదా అంతకంటే ఎక్కువ మెరుగుదల చూపించాయి. 

పదమూడు రాష్ట్రాలు మరియు యుటిలు పిజిఐ పరిథి వరకు చుస్తే 10% (15 పాయింట్లు) లేదా అంతకంటే ఎక్కువ మెరుగుదల చూపించాయి. అండమాన్-నికోబార్ దీవులు మరియు ఒడిశా 20% లేదా అంతకంటే ఎక్కువ అభివృద్ధిని చూపించాయి

పిజిఐ పరిథిలో ఈక్విటీలో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఒడిశా 10% కంటే ఎక్కువ మెరుగుదల చూపించాయి 

పాలన ప్రక్రియలో పంతొమ్మిది రాష్ట్రాలు, యుటిలు 10% (36 పాయింట్లు) లేదా అంతకంటే ఎక్కువ మెరుగుదల చూపించాయి: అండమాన్ & నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, రాజస్థాన్ మరియు పశ్చిమ బెంగాల్ కనీసం 20% (72 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ) మెరుగుదల చూపించాయి.

ఇంకా వివరాల కోసం ఈ లింక్ లో పొందవచ్చు. 

https://www.education.gov.in/hi/statistics-new?shs_term_node_tid_depth=391

*****(Release ID: 1724920) Visitor Counter : 194