ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
04 JUN 2021 9:35AM by PIB Hyderabad
ఇండియాలో కోవిడ్ క్రియాశీల కేసులు మరింతగా తగ్గుముఖం పట్టడం కొనసాగుతోంది. క్రియా శీల కేసుల సంఖ్య 16,35,993 కు చేరింది. వరుసగా 8వ రోజు 2 లక్షల దిగువలోనే క్రియాశీల కేసులు ఉన్నాయి.
యాక్టవ్ కేసుల గత 24 గంటలలో 77, 420 తగ్గాయి.
ఇండియా గత 24 గంటలలో 1.32 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ కొత్తకేసులు తగ్గుముఖం పట్టడం కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.65 కోట్లమంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 2,07,071 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజువారి కొత్త కేసుల కన్న రోజువారీ కోలుకున్న వారి సంఖ్య వరుసగా 22 వ రోజుకూడా ఎక్కువగానే ఉంది.
జాతీయ స్థాయిలో రికవరీ రేటు మరింత పెరిగి 93.08 శాతానికి చేరింది.
వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 7.27 శాతంగా ఉంది.
రోజువారీ పాజిటివిటి రేటు 6.38 శాతం వద్ద ఉంది.వరుసగా 11 వ రోజు పాజిటివ్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉంది.
కోవిడ్ పరీక్షా సామర్ధ్యం గణనీయంగా పెంచడం జరిగింది. మొత్తం 35.7 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.
జాతీయ వాక్సినేషన్ కార్యక్రమం కింద 22.41 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
***
(Release ID: 1724303)
Visitor Counter : 160