ప్రధాన మంత్రి కార్యాలయం
జూన్ 4న సిఎస్ఐఆర్ సొసైటీ సమావేశాని కి అధ్యక్షత వహించనున్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 JUN 2021 9:13PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 జూన్ 4న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భం లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొననున్నారు.
ఈ సొసైటీ విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మంత్రిత్వ శాఖ పరిధి లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ లో ఒక భాగం గా ఉంది. దీని కార్యకలాపాల ను భారతదేశం అంతటా విస్తరించి ఉన్నటువంటి 37 ప్రయోగశాల లు, 39 అవుట్ రీచ్ సెంటర్ ల ద్వారా నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఏటా సమావేశమయ్యే ఈ సొసైటీ లో ప్రముఖ శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్త లు, సైంటిఫిక్ మినిస్ట్రీ తాలూకు సీనియర్ అధికారులు భాగం పంచుకొంటున్నారు.
***
(रिलीज़ आईडी: 1724275)
आगंतुक पटल : 173
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam