నీతి ఆయోగ్

ఎస్.డి.జి. ఇండియా ఇండెక్స్, డ్యాష్ బోర్డు ఆవిష్కరణ!


నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడి చేతుల మీదుగా నివేదిక విడుదల

Posted On: 03 JUN 2021 10:23AM by PIB Hyderabad

   2021వ సవంత్సరానికి సంబంధించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్.డి.జి.)-భారతదేశపు సూచి, డ్యాష్ బోర్డును నీతీ ఆయోగ్ ఈ రోజు ఆవిష్కరించింది. 2018లో తొలి నివేదిక ఆవిష్కరణనుంచి ఈ సూచీ ప్రతియేటా విడుదలవుతూనే ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సాధించిన ప్రగతిని ఈ సూచీ ర్యాంకుల రూపంలో ఈ సమగ్రంగా తెలియజేస్తూ వస్తోంది. ఇపుడు వరుసగా మూడవ సూచీ విడుదలైంది. దేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన ప్రగతిని పర్యవేక్షించేందుకు ఈ సూచీ ప్రధాన ఉపకరణంగా మారింది. అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పోటీతత్వం పెంచేందుకు కూడా ఇది దోహదపడుతోంది. 2021వ సంవత్సరపు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-భారతదేశ సూచీ, డ్యాష్ బోర్డు పేరిట ఈ నివేదికను నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ ఆవిష్కరించారు. నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల ప్రతినిధి డాక్టర్ వినోద్ పాల్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) అమితాబ్ కాంత్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నీతీ ఆయోగ్ సలహాదారు సంయుక్తా సమద్దర్ సమక్షంలో ఈ నివేదిక ఆవిష్కరణ జరిగింది. నీతీ ఆయోగ్ రూపకల్పనతో తయారైన ఈ సూచీ, వివిధ భాగస్వామ్య వర్గాలతో విస్తృత సంప్రదింపులతో రూపుదిద్దుకుంది.  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సలహా సంప్రదింపుల అనంతరం నివేదిక రూపొందింది.; అంతేకాక, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, కేంద్ర గణాంక వ్యవహారాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ, కీలకమైన పలు కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా సంప్రదించి ఈ నివేదికకు రూపకల్పన చేశారు. 

  సూచీ నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. “ఎస్.డి.జి. ఇండియా ఇండెక్స్, డ్యాష్ బోర్డు ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పర్యవేక్షించేందుకు తాము చేసిన కృషి విస్తృత స్థాయిలో గుర్తింపు పొందుతూనే ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కూడా అందుకుందని చెప్పారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సాధించిన ర్యాంకులను లెక్కించే సమాచారంతో కూడిన మిశ్రమ సూచీగా ఈ నివేదిక నిలిచింది. సుస్థిర అభివృద్ధిపై అంతర్జాతీయ స్థాయిలో జరిగే పర్యవేక్షణా కృషికి ఇది దోహదపడగలదని మేం విశ్వసిస్తూ ఉన్నాం.” అని ఆయన అన్నారు.

   2030వ సంవత్సరపు అజెండాను సాధించేందుకు మేం జరిపే ప్రయాణంలో ఇంకా మూడింట ఒక వంతు మిగిలి ఉండగానే, ఈ మూడవ సూచీ ఎన్నో ప్రత్యేకతలు సాధించిందని, సుస్థిర అభివృద్ధి ప్రాధాన్యత, భాగస్వామ్యంపై ఈ నినేదిక దృష్టిని కేంద్రీకరించిందని, నీతీ ఆయోగ్ సి.ఇ.ఒ. అమితాబ్ కాంత్ అన్నారు. “మేం పటిష్టపరిచిన భాగస్వామ్యాలను ఈ నివేదిక ప్రతిబింబిస్తోంది. పరస్పర సహాయ సహకారాలతో తీసుకునే చర్యలు ఎలాంటి మెరుగైన ఫలితాలను, ప్రభావాన్ని అందిస్తాయన్నది ఇది సూచిస్తోంది.” అని ఆయన అన్నారు. నీతీ ఆయోగ్ లో ఆరోగ్య వ్యవహారాల  సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ మాట్లాడుతూ,“కలసికట్టుగా పనిచేయడం ద్వారా మరింత పటిష్టమైన, సుస్థిరమైన భవితను నిర్మించుకోగలమని స్పష్టమైంది, ఈ ప్రక్రియలో ఎవరూ వెనుకబడటం అంటూ ఉండదు.” అన్నారు.

   నీతీ ఆయోగ్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సలహాదారు సంయుక్తా సమద్దర్ మాట్లాడుతూ, “2018లో తొలి సూచీ నివేదికను 13 లక్ష్యాలు, 62 సూచికలకు వర్తింపజేయగా, తాజాగా మూడవ సూచీని 16లక్ష్యాలు, 115 సూచికలకు వర్తింపజేయగలిగాం. 17వ లక్ష్యంపై నాణ్యతతో కూడిన సూచీని అంచనా వేయగలిగాం,” అన్నారు.

  దేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పర్యవేక్షణ లక్ష్యంగా రెండు నిర్దేశాలను నీతీ ఆయోగ్ నిర్ణయించింది. తద్వారా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పోటీ తత్వాన్ని, సహకార ఫెడరల్ తత్వాన్ని ప్రోత్సహిస్తోంది.  2030వ సంవత్సరపు అజెండా ప్రకారం సమగ్రమైన ప్రపంచ స్థాయి లక్ష్యాలను ఈ సూచీ ప్రతిబింబిస్తోంది. మరో వైపు జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటోంది. అభివృద్ధి లక్ష్యాల విస్తృతి ప్రాతిపదికగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రగతిని అంచనా వేసేందుకు సంసిద్ధమైన ఉపకరణంగా ఈ సూచీ ఉపయోగపడుతుంది. ఆరోగ్యం, విద్య, లైంగిక అంశాలు, ఆర్థిక ప్రగతి, సంస్థలు, వాతావరణ మార్పులు, పర్యావరణం తదితర అంశాలపై ప్రగతిని అంచనా వేసేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001MLG2.jpg

కుడినుంచి ఎడమకు వరుసగా : నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్, సి.ఇ.ఒ. అమితాబ్ కాంత్,; సుస్థిర అభివృద్ది లక్ష్యాలపై నీతీఆయోగ్ సలహాదారు సంయుక్తా సమద్దర్.

ఎస్.డి.జి. ఇండియా, ఇండెక్స్ డ్యాష్ బోర్డు 2020–21: మూడవ సూచీపై ఉపోద్ఘాతం

  2021వ సవంత్సరపు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-భారతదేశపు సూచీ (ఎస్.డి.జి. ఇండియా, ఇండెక్స్ డ్యాష్ బోర్డు 2020-21) అనేది భారతదేశంలో ఐక్యరాజ్య సమితి సహకారంతో రూపొందింది. 115 అంశాలవారీగా అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధిని ఇది లెక్కిస్తుంది. కేంద్ర గణాంక వ్యవహారాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇండికేటర్ ఫ్రేంవర్క్ (ఎన్.ఐ.ఎఫ్.)కు సంబంధించిన సూచీలపై ప్రగతిని లెక్కిస్తారు. ఈ 115 అంశాలను లెక్కించే ప్రక్రియలో కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు కూడా ఇమిడి ఉంటాయి.

  విస్తృత కవరేజీ విషయంలో ఎస్.డి.జి. ఇండియా ఇండెక్స్ 2020-21 నివేదిక ఇదివరకటి సూచీలకంటే చాలా పటిష్టమైనది. ఈ 115 సూచీలు 16 లక్ష్యాలకు వర్తిస్తాయి. 2018-19, 2019-20 సంవత్సరాల సూచీలతో పోల్చినపుడు ఈ తాజా నివేదిక ఎంతో మెరుగుదల సాధించినట్టే.

.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002V4Z4.jpg

  16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి లక్ష్యాలవారీగా స్కోర్లను ఎస్.డి.జి. ఇండియా సూచీ లెక్కిస్తుంది. ప్రతి రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన లెక్కలను కూడా అందిస్తుంది. లక్ష్యాల వారీ స్కోర్ల ప్రాతిపదికగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్కోర్లను తయారు చేస్తారు. 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించి సగటు పనితీరును లెక్కించేందుకు ఈ స్కోర్లు తయారు చేస్తారు. ఈ స్కోర్లు 0-100పాయింట్ల మధ్య ఉంటాయి. ఏదైనా రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం వంద స్కోరు సాధించిన పక్షంలో అది 2030 అజెండా లక్ష్యాన్ని పూర్తి చేసినట్టుగా భావించి ప్రాధాన్యం ఇస్తారు.

  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల భారతీయ సూచీ ప్రాతిపదిక స్కోర్లవారీగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఈ కింది విధంగా వర్గీకరిస్తారు.:

 

  • ఆశావహ రాష్ట్రం: 0–49
  • పనిచేసే రాష్ట్రం: 50–64
  • అగ్రశ్రేణి రాష్ట్రం: 65–99
  • సాధించిన రాష్ట్రం: 100

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003VG71.jpg

 

మొత్తమ్మీద ఫలితాలు

  దేశం మొత్తమ్మీద సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్కోరు 6 పాయింట్లు మెరుగుపడింది.—2019లో 60 పాయింట్లు ఉన్న స్కోరు 2020-21లో 66 పాయింట్లకు చేరింది. స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం అనే ఆరవ లక్ష్యం, అందుబాటు ధరల్లో స్వచ్ఛమైన ఇంధనం అనే 7వ లక్ష్యం సాధనలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచినందునే సుస్థిర అభివృద్ధిలో ఈ సానుకూల పరిమాణం సాధ్యమైంది.

లక్ష్యాలవారీగా భారత్.లో ఫలితాలు, 2019–20, 2020–21:

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004HSF4.jpg

ఎస్.డి.జి ఇండియా ఇండెక్స్ 20220-21 ప్రకారం ఐదు అగ్రశ్రేణి రాష్ట్రాలు, ఐదు అట్టడుగు రాష్ట్రాలు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005FTTM.jpg

 

2020-21వ సంవత్సరం సూచీ ప్రకారం వివిధ రాష్ట్రాల పనితీరు, ర్యాంకింగ్..(గతఏడాది స్కోరులో మార్పుతో సహా):

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006JTWS.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007XM1X.jpg

 

  2019 సంవత్సరపు స్కోరునుంచి మెరుగుదల విషయంలో 2020-21వ సవంత్సరపు సూచీ ప్రకారం  మిజోరాం, హర్యానా, ఉత్తరాఖండ్ అగ్రశ్రేణిలో లక్ష్యాలు సాధించాయి. మిజోరాం 12పాయింట్లు, హర్యానా 10 పాయింట్లు, ఉత్తరాంఖండ్ 8 పాయింట్లు ఎక్కువగా సాధించాయి.

 

స్కోర్ల వారీగా వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రాలు

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0082BPP.jpg

  2019లో అగ్రశ్రేణి రాష్ట్రాల కేటగిరీకి చెందిన పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాలు 65నుంచి 99 పాయింట్ల స్కోర్లు సాధించగా, 2020-21లో  మరో 12 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు ఇదే కేటగిరీలో చేరాయి. ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, మిజోరాం, పంజాబ్, హర్యానా, త్రిపుర, ఢిల్లీ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్ము కాశ్మీర్, లఢక్ వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు,.. 65నుంచి 99 పాయింట్లు సాధించి అగ్రశ్రేణి రాష్ట్రాలుగా ఎదిగాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009CVDV.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0105R60.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011PHAO.jpg

ఎస్.డి.జి. ఇండియా ఇండెక్స్ నివేదికలో ఒక భాగాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయించారు. అన్ని లక్ష్యాలకు సంబంధించి 115 సూచీలపై రాష్ట్రాల పనితీరును, ప్రగతిని అంచనా వేసేందుకు విధాన నిర్ణయ కర్తలకు, పరిశోధకులకు, సామాన్య ప్రజలకు వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఈ విభాగంలోని వివరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.

 

నివేదికనుంచి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నమూనా:

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image012R6JG.jpg

ఈ నమూనా తర్వాత వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ ప్రక్రియ ప్రగతిని వివరించే ఒక భాగం ఉంటుంది. సంస్థాగత నిర్మాణాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దార్శనిక పత్రాలు, రాష్ట్రం, జిల్లా సూచీల వ్యవస్థలు, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్న చర్యలపై సమాచారం ఈ విభాగంలో పొందుపరిచి ఉంటుంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image013Y892.jpg

ఎస్.డి.జి. ఇండియా ఇండెక్స్ 2020-21 నివేదిక డ్యాష్ బోర్డు వివరాలను నేరుగా వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. విధానం, పౌర సమాజం, వాణిజ్యం, విద్యాసంస్థలకు అనుగుణంగా ఇది ఉంటుంది. కేంద్రీకరించిన అంశంపై చర్చకు, విధాన రూపకల్పన, అమలు వంటి అంశాలకు ఉపకరణంగా ఉంటుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను కనుగొనడంలో ఎదురయ్యే అంతరాలను గుర్తించేందుకు ఈ సూచీ, డ్యాష్ బోర్డు దోహదపడుతుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిలో ఒక గణాంక వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని కూడా ఇది సూచిస్తుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ ప్రయాణంలో మైలురాయిగా పరిగణించదగిన అంశం మరొకటి ఉంది. అదేమిటంటే, , త్వరలో రూపొందనున్న ఈశాన్య జిల్లాల సూచీ రూపకల్పన కోసం ఈ సుస్థిర అభివృద్ధి సూచీని ప్రస్తుతం నీతీ ఆయోగ్ తయారు చేస్తోంది.

 

ఎస్.డి.జి. ఇండియా ఇండెక్స్ 2020-21 డ్యాష్ బోర్డు సూచీ:

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image014Q7QF.jpg

జాతీయ, ఉపజాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పర్యవేక్షణ, అమలు వ్యవహారాలను సమన్వయం చేసేందుకు నీతీ ఆయోగ్ కు తగిన అనుమతులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రగతిని ప్రమాణబద్ధంగా లెక్కించేందుకు, ప్రాధాన్యతా రంగాలను గుర్తించేందుకు విధాన ప్రాతిపదికన జరిగే కృషిని నీతీ ఆయోగ్ ప్రోత్సహిస్తుంది. ఇదే అంశాన్ని ఎస్.డి.జి. ఇండియా ఇండెక్స్ డ్యాష్ బోర్డు ప్రతిబింబిస్తుంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image015OU5B.jpg

ఎస్.డి.జి. ఇండియా ఇండెక్స్ నివేదిక పూర్తి పాఠం కోసం సంప్రదించాల్సిన వెబ్ లింక్: https://wgz.short.gy/SDGIndiaIndex

ఇంటరాక్టివ్ డ్యాష్ బోర్డుకోసం సంప్రదించాల్సిన లింక్: http://sdgindiaindex.niti.gov.in/

 

***



(Release ID: 1724148) Visitor Counter : 742