ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గత 24 గంటల్లో 1.34 లక్షల కొత్త కోవిడ్ కేసులు
వరుసగా ఏడో రోజు కూడా 2 లక్షలలోపు కేసులు
చికిత్సలో 17,13,413 కేసులు ఉండగా 3 రోజులుగా 20 లక్షలలోపే
21వ రోజుకూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోలుకున్నవారి శాతం 92.79% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 6.21%; 10 రోజులుగా 10% లోపే
22 కోట్ల డోసులు దాటిన మొత్తం టీకాలు
Posted On:
03 JUN 2021 10:40AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 1,34,154 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వరుసగా ఏడు రోజులుగా కొత్త
కేసులు 2 లక్షలలోపే నమోదవుతునట్టయింది. ఇది కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో చేస్తున్న కృషి ఫలితం
దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 17,13,413 మంది కోవిడ్ చికిత్సలో ఉన్నారు.
గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారు 80,232 మంది తగ్గారు. వీరి సంఖ్య మొత్తం పాజిటివ్ కేసులలో 6.02%.
రోజువారీ కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్య 21వ రోజులుగా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. గత 24 గంటలలో
2,11,499 కోలుకున్నారు. గత 24 గంటలలో 77,345 మంది ఎక్కువగా కోలుకున్నారు.
సంక్షోభం మొదలైనప్పటినుంచీ ఇప్పటిదాకా కోలుకున్నవారు 2,63,90,584మంది కాగా గత 24 గంటలలో
2,11,499 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం పెరుగుతూ 92.79% అయింది.
గత 24 గంటలలో 21,59,873 పరీక్షలు జరపటంతో మొత్తం పరీక్షలు 35 కోట్లు దాటి 35,37,82,648 కు చేరాయి.
ఒకవైపు దేశవ్యాప్తంగా పరీక్షలు పెరుగుతూ ఉండగా పాజిటివిటీ తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం7.66% కాగా,
రోజువారీ పాజిటివిటీ ఈరోజు 6.21% గా నమొదైంది. గత 10 రోజులుగా ఇది 10% లోపే ఉంటోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల మొత్తం 22.10 కోట్లు దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు అందిన
సమాచారం ప్రకారం 31,24,981 శిబిరాల ద్వారా 22,10,43,693 టీకా డోసుల పంపిణీ జరిగింది. వాటి వివరాలు:
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
99,12,522
|
రెండో డోస్
|
68,15,468
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,58,49,178
|
రెండో డోస్
|
85,84,162
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
2,26,12,866
|
రెండో డోస్
|
59,283
|
45 - 60 వయోవర్గం
|
మొదటి డోస్
|
6,78,84,028
|
రెండో డోస్
|
1,09,73,523
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,94,06,566
|
రెండో డోస్
|
1,89,46,097
|
మొత్తం
|
22,10,43,693
|
****
(Release ID: 1724045)
Visitor Counter : 207