ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
30 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్ ల కోసం బయోలాజికల్-ఇ కంపెనీతో ముందస్తు ఏర్పాటును ఖరారు చేసుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
Posted On:
03 JUN 2021 8:00AM by PIB Hyderabad
హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇతో 30 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్ ల సరఫరాకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తుది రూపం ఇచ్చింది. 2021 ఆగస్టు-డిసెంబర్ నెలల మధ్య కాలంలో ఈ వ్యాక్సిన్ డోస్ లను బయోలాజికల్-ఇ తయారుచేసి నిల్వ చేస్తుంది. ఇందుకోసం బయోలాజికల్-ఇ సంస్థకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూ.1500 అడ్వాన్స్ గా చెల్లించింది.
బయోలాజికల్-ఇ తయారుచేయనున్న కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి దశ, రెండో దశ క్లినికల్ పరీక్షలు సత్ఫలితాలనివ్వడంతో ఇప్పుడు మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. బయోలాజికల్-ఇకి చెందిన ఆర్ బిడి ప్రోటీన్ సబ్ యూనిట్ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. రాబోయే కొద్ది నెలల కాలంలో ఇది అందుబాటులోకి రానుంది.
బయోలాజికల్-ఇ కోవిడ్-19 వ్యాక్సిన్ (నెగ్ వాక్) ప్రతిపాదనను జాతీయ స్థాయి వ్యాక్సిన్ పర్యవేక్షణ నిపుణుల బృందం పరిశీలించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరీక్షించి సంతృప్తి చెందిన తర్వాతనే వినియోగ అనుమతి మంజూరు చేసింది.
దేశీయ వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) మద్దతు, ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగానే బయోలాజికల్-ఇతో ఈ ఏర్పాటు చేసుకుంది.
బయోలాజికల్-ఇ కోవిడ్ వ్యాక్సిన్ కు ప్రీ క్లినికల్ దశ నుంచి మూడో దశ ట్రయల్స్ వరకు భారత ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు అందిస్తోంది. ఇందుకోసం బయోటెక్నాలజీ శాఖ రూ.100 కోట్లు ఆర్థిక సహాయం చేయడంతో పాటు జంతువులపై వ్యాక్సిన్ ప్రభావాన్ని పరీక్షించేందుకు పరిశోధనా కార్యకలాపాలు నిర్వహించే ఫరీదాబాద్ లోని ట్రాన్స్ లేషనల్ హెల్త్ సైన్స్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ (టిహెచ్ఎస్ టిఐ) ద్వారా భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది.
భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ ప్యాకేజి 3.0లో కింద దేశీయంగా కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ప్రకటించిన మిషన్ కోవిడ్ సురక్ష - భారత కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఈ చర్యలు చేపట్టింది.
పౌరులందరికీ సురక్షితం, సమర్థవంతం, భరించగల ధరల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఐదారు కోవిడ్-19 వ్యాక్సిన్లకు మద్దతు అందిస్తోంది. వాటిలో కొన్ని లైసెన్సులు మంజూరు చేసి ప్రజారోగ్య వ్యవస్థలో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలను వేగవంతం చేయడంతో పాటు దేశంలో వ్యాక్సిన్ల పూర్తి స్థాయి నిరంతర అభివృద్ధికి, భవిష్యత్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు అనుకూల వాతావరణం కల్పించింది.
***
(Release ID: 1723991)
Visitor Counter : 298