ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రోజువారీ కోవిడ్ కేసులు 1.32 లక్షలు; ఆరో రోజూ 2 లక్షలలోపే


చికిత్సలో ఉన్న కేసులు17,93,645; రెండో రోజూ 20 లక్షలలోపే

20వ రోజునా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోలుకున్నవారి శాతం 92.48% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ 6.57%; 9 రోజులుగా 10% లోపే

Posted On: 02 JUN 2021 11:28AM by PIB Hyderabad

రోజువారీ కోవిడ్ కేసులు తగ్గుతున్న ధోరణి కొనసాగిస్తూ గత 24 గంటలలో 1,32,788 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇలా రెండు లక్షలలోపు కేసులు రావటం వరుసగా ఇది ఆరో రోజు.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZP4Q.jpg

చికిత్సలో ఉన్న కేసులు క్రమేపీ తగ్గటం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య  17,93,645 గా నమోదైంది. గత 24 గంటలలో నికరంగా 1,01,875 తగ్గిన ఫలితమే ఈ సంఖ్య. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా 6.34% మాత్రమే

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WC1N.jpg

దేశంలో రోజువారీ కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం గత 20 రోజులుగా సాగుతోంది. గడిచిన 24 గంటలలో 2,31,456 మంది కోలుకున్నారు. ఇది అంతకుముందు రోజుకంటే 98,668 అధికం.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036R8V.jpg

ఇప్పటివరకు కోవిడ్ సోకినవారిలో మొత్తం 2,61,79,085 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 2,31,456 మంది కొలుకున్నారు. ఇది మొత్తం కోలుకున్నవారి శాతాన్ని 92.48% గా చూపుతూ పెరుగుతున్న దిశలో సాగుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046YH4.jpg

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం  20,19,773 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరిగాయి. దీంతో ఇప్పటిదాకా జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 35 కోట్లు దాటి   35,00,57,330 కు చేరింది. 

ఒకవైపు కోవిడ్ పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండగా, మరోవైపు వారపు పాజిటివిటీ తగ్గుతోంది. ప్రస్తుతం అది 8.21%  ఉండగా రోజువారీ పాజిటివిటీ 6.57%కు తగ్గింది. వరుసగా 9వ రోజుకూడా 10% లోపే నమోదైంది.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005DUPR.jpg

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 21.85 కోట్లు దాటింది.  ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం 30,91,543 శిబిరాల ద్వారా ఇప్పటిదాకా 21,85,46,667 టీకా డోసుల పంపిణీ జరిగింది.

అరోగ్య సిబ్బంది

మొదటి డోస్

98,99,574

రెండో డోస్

68,03,865

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,57,63,082

రెండో డోస్

85,56,719

18-44 వయోవర్గం

మొదటి డోస్

2,13,73,965

రెండో డోస్

39,443

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

6,72,19,095

రెండో డోస్

1,08,65,046

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,91,55,780

రెండో డోస్

1,88,70,098

మొత్తం

21,85,46,667

 

***


(Release ID: 1723758) Visitor Counter : 186