మంత్రిమండలి

ఖనిజ వనరుల రంగం లో సహకారం అనే అంశం లో భారతదేశానికి, అర్జెంటీనా గణతంత్రానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 02 JUN 2021 12:53PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా గణతంత్రాని కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ప్రొడక్టివ్ డివె
లప్ మెంటు తాలూకు మైనింగ్ పాలిసి సెక్రటేరియట్ కు మధ్య సంతకాలు జరుగవలసి ఉన్న అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి (ఎమ్ఒయు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఖనిజ వనరుల రంగం లో సహకారానికి ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఎమ్ఒయు మార్గాన్ని సుగమం చేస్తుంది.

లిథియమ్ గనుల తవ్వకం, వాటి తాలూకు లబ్ధి ని పొందడం సహా ఖనిజ వనరుల అన్వేషణ ను, అభివృద్ధి ని, ఖనిజ నిక్షేపాల వెలికితీత ను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన సహకారం; మౌలిక లోహాలు, క్రిటికల్ మినరల్స్, వ్యూహాత్మక ఖనిజాల రంగం లో ఒక సంయుక్త సంస్థ ను ఏర్పాటు చేసేందుకు అవకాశాల ను పరిశీలించడం; సాంకేతికపరమైనటువంటి, విజ్ఞ‌ాన శాస్త్రపరమైనటువంటి సమాచారాన్ని ఒక పక్షాని కి మరొక పక్షం అందించుకోవడం తో పాటు ఆలోచనల ను, జ్ఞ‌ానాన్ని పరస్పరం ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం; శిక్షణ, సామర్థ్యాల పెంపుదల వంటివన్నీ ఈ ఎమ్ఒయు ఉద్దేశాల లో భాగం గా ఉన్నాయి.  గనుల తవ్వకం సంబంధి కార్యకలాపాల లో పెట్టుబడి ని, అభివృద్ధి ని ప్రోత్సహించడం అనేది నూతన ఆవిష్కరణ ల లక్షాన్ని సాధించడం లో తోడ్పాటును అందించగలుగుతుంది.    
 


 

***



(Release ID: 1723744) Visitor Counter : 113