ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సోకిన పిల్లలకు తగిన సంరక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎటువంటి కొరత ఉండబోదు: నీతి ఆయోగ్ సభ్యుడు


వ్యాధి సోకిన 2 శాతం నుండి 3 శాతం పిల్లలకు ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం పడవచ్చు: డాక్టర్ వి.కె. పాల్

కోవిడ్ ఉన్న పిల్లల విషయంలో త్వరలోనే మార్గదర్శకాలు

Posted On: 01 JUN 2021 6:09PM by PIB Hyderabad

పిల్లలలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లను సమీక్షించడానికి, దేశం సంసిద్ధతను బలోపేతం చేయడానికి, మహమ్మారిని ఎదుర్కోడానికి ఒక జాతీయ నిపుణుల బృందం ఏర్పడింది. 4 - 5 నెలల ముందు అందుబాటులో లేని సంకేతాలను గ్రూప్ పరిశీలించింది. ఇది అందుబాటులో ఉన్న డేటా, క్లినికల్ ప్రొఫైల్, అనుభవం, వ్యాధి డైనమిక్స్, వైరస్ స్వభావం, మహమ్మారిని కూడా పరిగణించింది. మార్గదర్శకాలతో ముందుకు వచ్చింది, ఇది త్వరలో బహిరంగంగా విడుదల అవుతుంది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె.పాల్ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ రోజు జరిగిన కోవిడ్-19 పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో వెల్లడించారు. "మేము ఈ ప్రాంతంలో శాస్త్రీయ పరిణామాలను క్రమపద్ధతిలో సమీక్షిస్తున్నప్పటికీ, పరిస్థితిని నవీకరించడానికి గ్రూప్ ఏర్పడింది." అని అయన తెలిపారు. 

పీడియాట్రిక్ కోవిడ్-19 మన దృష్టిని ఆకర్షిస్తోందని పేర్కొన్న ఆయన, వ్యాధి బారిన పడే పిల్లలకు అవసరమైన సంరక్షణ మరియు మౌలిక సదుపాయాలలో ఎటువంటి లోపం ఉండదని తెలియజేశారు. "పిల్లలలో కోవిడ్-19 తరచుగా లక్షణం లేనిది, చాలా అరుదుగా ఆసుపత్రిలో చేరడం అవసరం. అయినప్పటికీ, ఎపిడెమియోలాజికల్ డైనమిక్స్ లేదా వైరల్ ప్రవర్తనలో మార్పులు పరిస్థితిని మార్చగలవు మరియు సంక్రమణ ప్రాబల్యాన్ని పెంచుతాయి. పీడియాట్రిక్ కేర్ మౌలిక సదుపాయాలపై ఇంతవరకు ఎటువంటి భారం పడలేదు. అయినప్పటికీ, 2% - 3% మంది పిల్లలు వ్యాధి బారిన పడే అవకాశం ఉంది

రెండు రూపాల్లో పీడియాట్రిక్ కోవిడ్-19

పిల్లల్లో కోవిడ్ రెండు రకాలుగా సోకుతుందని పాల్ అన్నారు.

  1. ఒక రూపంలో, ఇన్ఫెక్షన్, దగ్గు, జ్వరం, న్యుమోనియా వంటి లక్షణాలు సంభవించవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. 
  2. రెండవ సందర్భంలో, కోవిడ్ వచ్చిన 2-6 వారాల తరువాత, ఇది ఎక్కువగా లక్షణం లేనిది కావచ్చు, పిల్లలలో కొద్ది భాగం జ్వరం, శరీర దద్దుర్లు, మరియు కళ్ళు లేదా కండ్లకలక వాపు, శ్వాస సమస్యలు, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలను చూపించవచ్చు. న్యుమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే విధంగా ఇది పరిమితం కాకపోవచ్చు. ఇది శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపిస్తుంది. దీనిని మల్టీ-సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటారు. ఇది పోస్ట్-కోవిడ్ లక్షణం. ఈ సమయంలో, శరీరంలో వైరస్ కనుగొనబడదు,  ఆర్టి-పిసిఆర్ పరీక్ష కూడా నెగటివ్ వస్తుంది. కానీ యాంటీబాడీ పరీక్షలో పిల్లలకి కోవిడ్  సోకినట్లు తెలుస్తుంది. 

కొంతమంది పిల్లలలో కనిపించే ఈ ప్రత్యేకమైన వ్యాధికి చికిత్స చేయడానికి మార్గదర్శకాలు రూపొందుతున్నాయి. ఇది అత్యవసర స్థితిగానే పరిగణిస్తున్నారు. చికిత్స కష్టం కానప్పటికీ, అది సకాలంలో అందాలి అని డాక్టర్ పాల్ తెలిపారు. 

 

* * *


(Release ID: 1723601) Visitor Counter : 537