ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ (పిఎంజికెపి) కోవిడ్ -19 పై పోరాడుతున్న ఆరోగ్య కార్యర్తల బీమా పథకానికి సంబంధించి ఇన్సూరెన్సు క్లెయిమ్‌ల పరిష్కారానికి, ఈ ప్రక్రియను గాడిలో పెట్టడానికి కొత్త విధానం
క్లెయిమ్‌లను జిల్లా కలెక్టర్ ధృవీకరించాలి. ఇన్సూరెన్సు కంపెనీ దానిని ఆమోదించి 48 గంటలలోగా పరిష్కరించాలి.
ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల సంక్షేమం కేంద్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతలోని అంశం
Posted On:
01 JUN 2021 3:30PM by PIB Hyderabad
కోవిడ్ -19 పై పోరాటంలో భారత ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వ మొత్తం విధానంలో భాగంగా కేంద్రం మద్దతునిస్తున్నది. ఈ కృషిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ (పిఎంఇకెపి) ఇన్సూరెన్స్ పథకాన్ని కోవిడ్ -19 పై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు 24-04-2021 నుంచి ఏడాది కాలానికి వర్తింప చేశారు.
ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల భద్రత కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతాంశాలలో ఒకటిగా ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్సు పాలసీని ఏడాదిపాటు పునరుద్ధరించింది, దీనివల్ల ఆరోగ్య కార్యకర్తలపై ఆధారపడినవారికి భద్రతను కొనసాగించడానికి వీలు కలుగుతుంది. ఈ ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ -19 పేషెంట్ల ఆరోగ్య సంరక్షణకోసం నియమింపబడినవారు.
కోవిడ్ -19 పై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు , ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ (పిఎంజికెపి) ఇన్సూరెన్సు పథకాన్ని 30.03.2020 నుంచి ప్రారంభించారు. తొలుత దీనిని 90 రోజులకు వర్తింప చేశారు. దీనికింద సమగ్ర వ్యక్తిగత ప్రమాద భీమా కవర్ 50 లక్షల రూపాయలవరకు ఆరోగ్య సంరక్షణ అందిస్తున్న వారందరికీ వర్తింపచేశారు. ఇందులో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, కోవిడ్ -19 పేషెంట్ల సంరక్షణ కోసం ప్రభుత్వం నియమించిన ప్రైవేటు హెల్త్ వర్కర్లు, కోవిడ్ -19 పేషెంట్ల డైరక్ట్ కాంటాక్ట్‌లోకి వచ్చిన వారు.దాని ప్రభావానికి గురయ్యే రిస్క్ కలిగిన వారు ఉన్నారు.
ఈ పథకాన్ని న్యూ ఇండియా అస్సూరెన్సు కంపెనీ (ఎన్ ఐఎసిఎల్) ద్వారా అమలు చేయబడుతోంది. ఇప్పటివరకు ఈ ఇన్సూరెన్సు పాలసీని రెండు సార్లు పొడిగించారు.
ఇన్సూరెన్సు క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడంలో జాప్యం జరుగుతున్న విషయాన్ని రాష్ట్రాలు , ఇతర స్టేక్ హోల్డర్లు ప్రస్తావిస్తూ వచ్చాయి. ఈ జాప్యాలను తగ్గించడానికి , ఇన్సూరెన్సు క్లెయిమ్‌ల ను మరింత సులభతరం చేయడం, వీటిని ఒక పద్ధతిలో పెట్టడానికి క్లెయిమ్‌ల పరిష్కారానికి కొత్త వ్వవస్థను ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్ స్థాయిలో తగిన జాగ్రత్తతో క్లెయిమ్‌లను ఆమోదింప చేయడానికి నిర్ణయించడం జరిగింది. క్లెయిమ్‌ల పరిష్కారానికి సంబంధించి ప్రతి కేసు ఈ పథకం ఎస్.ఒ.పి ప్రకారం క్లెయిమ్ ఉందో లేదో గమనించి జిల్లా కలెక్టర్ సర్టిఫై చేస్తారు. కలెక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా ఇన్సూరెన్సు కంపెనీ క్లయిమ్‌లను 48 గంటలలో పరిష్కరిస్తుంది. దీనికితోడు, ఏకరూపత, సత్వరం క్లెయిమ్‌ల పరిష్కారానికి వీలుగా జిల్లా కలెక్టర్ తగిన జాగ్రత్తలు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఆస్పత్రులు, ఎఐఐఎంఎస్, రైల్వేలు తదితరాలకు సంబంధించిన క్లెయిమ్‌లు కూడా సర్టిఫై చేస్తారు.
ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సత్వరం అమలులోకి వచ్చే ఈ వ్యవస్థ గురించి సమాచారం అందజేసింది.
****
(Release ID: 1723548)
Visitor Counter : 468
Read this release in:
Marathi
,
Odia
,
Kannada
,
Urdu
,
Punjabi
,
English
,
Hindi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Malayalam