ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2021 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా, పొగాకుకు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞకు నాయకత్వం వహించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
పొగాకును వదిలించుకునేందుకు కట్టుబడి ఉన్నాను..అన్నది 2021 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం థీమ్
ఈ సిగరెట్ల బెడదకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర కృషివల్ల పొగాకు వాడకం 2009-10లో 34.6 శాతం ఉండగా 201617 నాటికి 28.6 శాతానికి తగ్గింది. అంటే ఆరు శాతం పాయింట్ల తగ్గుదల కనిపించింది.
ప్రస్తుతం 16 భాషలలో క్విట్ లైన్ ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయి.
ప్రజలు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని పొగాకు వాడకం విడనాడాలన నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను: డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
31 MAY 2021 3:03PM by PIB Hyderabad
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు. డిజిటల్ రూపంలో జరిగిని ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే కూడా పాల్గొన్నారు.
సరైన సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు డాక్టర్ హర్షవర్ధన్ తమమ సంతృప్తిని వ్యక్తంచేశారరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ప్రతి సంవత్సరం భారత దేశంలో1.3 మిలియన్ల మరణాలు పొగాకు వాడినందువల్ల సంభవిస్తున్నాయని , అంటే రోజుకు 3,500 మంది చనిపోతున్నట్టు లెక్క అని ఆయన అన్నారు. దీనివల్ల సామాజిక ఆర్ధికంగా భారం పడుతుందని ఇది తప్పించలేనిదేమీ కాదని ఆయన అన్నారు. మరణాలు , దీనివల్ల వచ్చే వ్యాధులే కాకుండా పొగాకు దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అన్నారు. పొగతాగేవారిలో కోవిడ్ -19 కారణంగా తీవ్రవ్యాధిలక్షణాలతో మరణం సంభవించే రిస్క్ 40 నుంచి 50 శాతం ఎక్కువ ఉంటుందని ఆయన చెప్పారు. ఇండియాలో పొగాకు వాడడం వల్లే వచ్చే వ్యాధులవల్ల పడే ఆర్ధిక భారం, మరణాల పై అధ్యయన నివేదికను వెలువరించింది. దీని ప్రకారం పడే ఆర్దిక భారం 1.77 లక్షల కోట్లు . అంటే దేశ జిడిపిలో ఇది 1 శాతం.
ప్రభుత్వం తీసుకుంటున్న చట్టబద్ధమైన పాలనాపరమైన చర్యలవల్ల పొగాకువినియోగించే ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పొగాకు నియంత్రణ చట్టం 1975 ప్రకారం , సిగరెట్ పాకెట్లు, కార్టన్లపై ఆరోగ్య సంబంధ హెచ్చరికను తప్పనిసరిగా ప్రచురించాలని చెబుతోందిని తెలిపారు.
పొగాకుకు వ్యతిరేకంగా తన కెరీర్‌లో తాను సాగించిన సుదీర్ఘ పోరాటం గురించి కేంద్ర ఆరోగ్యమంత్రి వివరించారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా ఢిల్లీ ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్, నాన్ స్మోకర్స్ హెల్త్ ప్రొటక్షన్ యాక్ట్‌ను తీసుకువచ్చే అవకాశం తనకు కలిగిందని ఆయన తెలిపారు. దీనిని 1997 లో ఢిల్లీ శాసనసభలో ఆమోదింపచేశామననారు. ఈ చట్టమే 2002లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరరకు బహిరంగ ప్రదేశాలలో పొగతాగడాన్ని నిషేధిస్తూ కేంద్రం చట్టం తేవడానికి నమూనాగా ఉపయోగపడిందని ఆయన చెప్పారు.
ఆ తర్వాత 2003లో సమగ్ర పొగాకు నియంత్రణ చట్టం వచ్చిందని ( సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల వ్యాపార ప్రకటనల నిషేధం, దాని వాణిజ్యం, వ్యాపారం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టం - సిఒటిపిఎ -2003 వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల బహిరంగ ప్రదేశాలలో పొగతాగకుండా చేయగలిగారని, పొగాకు ప్రకటనలు, ప్రోత్సామమంపై ఇది తగిన నియంత్రణలు తెచ్చిందని ఆయన తెలిపారు. డాక్టర్ హర్ష వర్ధన్ ఈ దిశగా సాగించిన కృషికి గుర్తింపుగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఆయనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌జనరరల్ కమెండేషన్ మెడల్, సర్టిఫికేట్ 1998 మేలో లభించింది. దీనిని వారికి బ్రెజిల్ లోని రియో డి జెనీరియో లో జరిగిన ఒక కార్యక్రమంలో పొగాకు రహిత సమాజానికి కృషి చేస్తున్నందుకు ఇచ్చారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర కృషి కారణంగా పొగాకు వాడకం 2009-10లో 34.6 శాతం ఉండగా ఇది 2016-17లో 6 పర్సెంటేజ్ పాయింట్లు తగ్గి 28.6 శాతానికి చేరడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
పొగాకు వినియోగాన్ని అదుపుచేసేందుకు ప్రభుత్వం రాజకీయంగా గట్టిగా కట్టుబడి ఉందని అంటూ ఆయన, తాను కేంద్ర ఆరోగ్య మంత్రిగా చేరిన వెంటనే ఈ సిగరెట్ల బెడదను ఎదుర్కోవాలని నిర్ణయించానని, దీనితో ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిఇక్ సిగరెట్స్ బిల్ 2019 ఆలోచన చేశామన్నారు. ఇది ఈ సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, వ్యాపార ప్రకటనలను నిషేధిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీజీ తన అద్భుత నాయకత్వంలో ఈ బిల్లును ఆమోదింపచేశారని అన్నారు. ప్రభుత్వ నిరంతర కృషి వలల్ దేశాన్ని ఈ సిగరెట్ల బెడదనుంచి రక్షించడానికి వీలు కలిగిందని అన్నారు. లేకుంటే ఇది టీనేజ్ పిల్లలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించి ఉండేదని ఆయన అన్నారు.
టుబాకో క్విట్‌లైన్ సర్వీసెస్‌కు కాల్స్ పెరుగుతుండడాన్ని డాక్టర్ హర్ష వర్ధన్, మనకు టోల్ ఫ్రీ క్విట్ లైన్ సర్వీసులు 1800-112-356 ఉన్నాయని , దీనని 2016 లో ప్రారంభించామని చెప్పారు. దీనిని 2018లో మరింత విస్తరింప చేశామన్నారు. క్విట్ లైన్ సర్వీసులు ప్రస్తుతం 16 భాషలలో ఇతర స్థానిక మాండలికాఆలలోఓ 4 కేంద్రాలనుంచి పనిచేస్తున్నాయన్నారు. క్విట్‌లైన్ సర్వీసును విస్తరించకముందు నెలకు 20,500 కాల్స్ వస్తుండగా దాని విస్తరణ అనంతరం నెలకు 2.50 లక్షల కాల్స్ వస్తున్నాయని అన్నారు. పొగతాగడం, పొగాకు ఉత్పత్తుల వాడకం మానేయాల్సిందిగా ప్రజలకు డాక్టర్ హర్షవర్ధన్ మరోసారి పిలుపునిచ్చారు.
2017 జాతీయ ఆరోగ్య విధానం కింద ముఖ్యంగా పొగాకు నియంత్రణ విషయంలో పెట్టుకున్న లక్ష్యాల గురించి డాక్టర్ హర్షవర్ధన్ ప్రముఖంగా ప్రస్తావించారు. 2025 నాటికి పొగాకు వాడకాన్ని 30 శాతం తగ్గించాలని
లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారరు. సాంక్రమికేతర వ్యాధుల నియంత్రణ లక్ష్యాలు, సుస్థిరా భివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ లక్ష్యాలను రూపొందించుకున్నట్టు ఆయన తెలిపారరు. పాఠశాలకు వెళ్లే విద్యార్ధులైన 13-15 సంవత్సరాల మధ్యవయస్కులకు సంబంధించి గ్లోబల్ యూత్ టుబాకో సర్వే నాలుగవ రౌండ్ అధ్యయన ఫలితాలు త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు.
భాగస్వామ్య సంస్థలు, మంత్రిత్వశాఖ అధికారులు, క్షేత్రస్థాయ కార్యకర్తలు, ప్రత్యేకించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇప్టటివరకకకూ పొగాకు వాడకాన్ని గణనీయంగా తగ్గించగలిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ , పొగాకు నియంత్రణలో తన సేవలు, మంత్రిత్వశాఖ సేవలు గుర్తించి, 2021 సంవత్సరానికి డైరక్టర్ జనరల్ ప్రత్యేక గుర్తింపు అవార్డును ప్రకటించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) తన ఆరు ప్రాంతాలలో (ఎఎఫ్ఆర్ ఒ, ఎ.ఎం.ఆర్.ఒ, ఇయుఆర్ ఒ, డబ్ల్యుపిఆర్ ఒ, ఇఎంఆర్ ఒ, ఎస్ఇఎఆర్) పొగాకు నియంత్రణకు కృషిచేసిన వ్యక్తులు, సంస్థలను గుర్తిస్తుంది.
కేంద్ర ఆరోగ్య అదనపు కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజ, ఆరోగ్య అదనపు కార్యదర్శి శ్రీ వికాశ్ శీల్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1723333)
Visitor Counter : 250