ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చికిత్సలో ఉన్న కేసులు 23,43,152 కు తగ్గుదల; గత 24 గంటల్లో తగ్గినవి 76,755


1.86 లక్షల కేసులతో గత 44 రోజుల్లోనే అతి తక్కువ కొత్త కేసులు

వరుసగా 12 రోజులుగా 3 లక్షలలోపు కేసులు

వరుసగా 15వరోజు కూడా కొత్తకేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోలుకున్నవారి శాతం 90.34% కు పెరుగుదల

రోజువారీ పాజిటివిటీ 9.00%; నాలుగు రోజులుగా 10% లోపే

Posted On: 28 MAY 2021 10:43AM by PIB Hyderabad

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 23,43,152 కు తగ్గింది, మే 10 న నమోదైన అత్యంత గరిష్ఠం నుంచి తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటలలో నికరంగా 76,755 కేసుల తగ్గుదల కనిపించింది. మొత్తం దేశంలోని పాజిటివ్ కేసులలో ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి వాటా 8.50% మాత్రమే. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001DTEV.jpg

రోజువారీ కొత్త కేసులు తగ్గుతున్న క్రమంలోనే వరుసగా 12 రోజులుగా కొత్త కేసులు 3 లక్షలలోపే ఉంటున్నాయి.  గత 24 గంటలలో 1,86,364 కొత్త కేసులు వచ్చాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002OUZG.jpg

దేశంలో రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ, 15 రోజులుగా కొత్తకేసులకంటే ఎక్కువగా ఉంటున్నాయి. గత 24 గంటలలో 2,59,459 మంది కోలుకున్నారు. ఈ సంఖ్య అంతకుముందు 24 గంటలకంటే  73,095 ఎక్కువ.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003B4PH.jpg

కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా కరోనాబారిన పడి కోలుకున్నవారి సంఖ్య  2,48,93,410  కాగా గత 24 గంటలలో 2,59,459 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి శాతం 90.34% అయింది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZN2Q.jpg

గత 24 గంటలలో మొత్తం 20,70,508 కోవిడ్ పరీక్షలు జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షల మొత్తం 33.9 కోట్లు దాటాయి.  

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005654I.jpg

ఒకవైపు దేశవ్యాప్తంగా పరీక్షల సంఖ్య పెంచగా, వారపు పాజిటివిటీ తగ్గుముఖం పట్టటం కనిపిస్తోంది. ప్రస్తుతం వారపు పాజిటివిటీ రేటు 10.42%  ఉండగా రోజువారీ పాజిటివిటీ శాతం నేడు 9.00% కు చేరింది. గత నాలుగు రోజులుగా ఇది 10% లోపే ఉంటూ వస్తోంది 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005654I.jpg

దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 20.57 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. తక్కువ సమయంలో 20 కోట్ల మైలురాయి దాటటంలో అమెరికా తరువాత భారత్ ది రెండో స్థానం.

 

ఈరోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 29,38,367 శిబిరాల ద్వారా మొత్తం 20,57,20,660 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో:

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

98,28,401

రెండో డోస్

67,48,360

కొవిడ్ యోధులు

మొదటి డోస్

1,53,49,658

రెండో డోస్

84,25,730

18-44 వయోవర్గం

మొదటి డోస్

1,52,65,022

45-60 వయోవర్గం

మొదటి డోస్

6,36,22,329

రెండో డోస్

1,02,22,521

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,77,84,682

రెండో డోస్

1,84,73,957

మొత్తం

20,57,20,660

 

****(Release ID: 1722375) Visitor Counter : 174