ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రాన్ ల మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ

Posted On: 26 MAY 2021 8:37PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మేక్రాన్ తో ఈ రోజు  (26 మే, 2021) న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

కోవిడ్ కు వ్యతిరేకం గా భారతదేశం చేపడుతున్న కార్యాచరణ విషయం లో ఫ్రాన్స్ అందించిన సహాయానికి గాను అధ్యక్షుడు శ్రీ మేక్రాన్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు.  పరస్పర హితం ముడిపడ్డ ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ అంశాల ను గురించి కూడా ఇద్దరు నేత లు మాట్లాడుకొన్నారు.   ఇటీవల ముగిసిన భారతదేశం- యూరోపియన్ యూనియన్ నాయకత్వ సమావేశం తాలూకు సకారాత్మక ఫలితాల పై వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.  భారతదేశం- ఇయు కనెక్టివిటి పార్ట్ నర్ శిప్ తో పాటు, సంతులితమైనటువంటి, సమగ్రమైనటువంటి స్వేచ్ఛాయుత వ్యాపారం, పెట్టుబడి కి సంబంధించిన ఒప్పందాల పైన కూడా సంభాషణల ను పున:ప్రారంభ ప్రకటనల ను స్వాగతించదగ్గ చర్యలు గా ఇరువురు నేత లు పేర్కొంటూ, ఈ విషయం లో వారి అంగీకారాన్ని వ్యక్తపరిచారు.

భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం గడచిన కొన్ని సంవత్సరాల లో గాఢతరం గా, శక్తిశాలి గా రూపుదాల్చిందనే అంశం పై ఇద్దరు నేత లు సంతోషాన్ని వ్యక్తం చేశారు.  కోవిడ్- అనంతర యుగం లో రెండు దేశాలూ కలసి పనిచేయడాన్ని కొనసాగిస్తూ ఉండాలి అంటూ వారు సమ్మతి ని వ్యక్తం చేశారు.

పరిస్థితులు మెరుగుపడిన తరువాత వీలైనంత త్వరగా భారతదేశాన్ని సందర్శించడం కోసం విచ్చేయవలసింది గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షుడు శ్రీ మేక్రాన్ కు మరొక్క సారి ఆహ్వానం పలికారు.



 

***


(Release ID: 1722087) Visitor Counter : 171