ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 24,95,591 కు తగ్గుదల తగ్గుతున్న ధోరణికి నిదర్శనంగా కొత్త కేసులు 2.08 లక్షలు
గత 24 గంటల్లో 91,191 తగ్గిన చికిత్సలో ఉన్న కేసులు
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారు 2,43,50,816 మంది
గత 24 గంటల్లొ కోలుకున్నవారు దాదాపు 3 లక్షలు
13వ రోజు కూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 89.66% కు చేరిక
ఒక్క రోజులో అత్యధికంగా జరిపిన 22.17 లక్షల కోవిడ్ పరీక్షలు
వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 11.45%
రోజువారీ పాజిటివిటీ ప్రస్తుతం 9.42%; రెండో రోజూ10% కంటే తక్కువ
20 కోట్ల మైలురాయి దాటిన దేశవ్యాప్త కోవిడ్ టీకా డోసుల పంపిణీ
Posted On:
26 MAY 2021 11:05AM by PIB Hyderabad
దేశంలో వరుసగా పది రోజులుగా కోవిడ్ కొత్త కేసులు 3 లక్షల లోపే ఉంటున్నాయి. గత 24 గంటల్లో 2,08,921 కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం 24,95,591 కు చేరింది, మే 10 నుంచి ఈ ధోరణి ఉంది. గత 24 గంటలలో ఈ సంఖ్య నికరంగా 91,191 తగ్గగా మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నది 9.19%
వరుసగా 13వరోజు కూడా దేశవ్యాప్తంగా వస్తున్న కొత్త కరోనా కేసులకంటే కొలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గత 24 గంటలలో. 2,95,955 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో కొత్త కేసులకంటే వీరు 87,034 అధికం.
ఇప్పటిదాకా కోలుకున్నవారు మొత్తం 2,43,50,816 మంది కాగా, గత 24 గంటల్లో కోలుకున్నది 2,95,955 మంది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం పెరుగుతూ 89.66% కు చేరింది.
మరోవైపు ఒకే రోజు 22,17,320 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపటం గత 24 గంటల్లో సాధించిన సరికొత్త రికార్డు. దీంతో ఇప్పటిదాకా 33,48,11,496 పరీక్షలు జరిపినట్టయింది. వారపు పాజిటివిటీ 11.45% కు చేరగా రోజువారీ పాజిటివిటీ 9.42% గా నమోదైంది. ఇది వరుసగా 2 రోజులుగా 10% లోపే ఉంటూ వస్తోంది.
మూడో దశ టీకాల కార్యక్రమం కూడా బాగా పుంజుకోవటంతో భారత్ లొ ఇచ్చిన మొత్తం టీకా డోసుల సంఖ్య 20 కోట్లు దాటి మరో మైలురాయిని చేరినట్టయింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటి దాకా 28,70,378 శిబిరాల ద్వారా 20,06,62,456 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 97,96,058 మొదటి డోసులు, 67,29,213 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,51,71,950 మొదటి డోసులు, 83,84,001 రెండో డోసులు, 18-44 వయీవర్గం వారు తీసుకున్న 1,29,57,009 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 6,20,88,772 మొదటి డోసులు, 1,00,30,729 రెండో డోసులు. 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,71,35,804 మొదటి డోసులు, 1,83,68,920 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
97,96,058
|
రెండవ డోస్
|
67,29,213
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,51,71,950
|
రెండవ డోస్
|
83,84,001
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
1,29,57,009
|
45-60 వయోవర్గం
|
మొదటి డోస్
|
6,20,88,772
|
రెండవ డోస్
|
1,00,30,729
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,71,35,804
|
రెండవ డోస్
|
1,83,68,920
|
మొత్తం
|
20,06,62,456
|
***
(Release ID: 1721854)
Visitor Counter : 252