వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

పీఎంజికేఏవై కార్యకలాపాలు దేశవ్యాప్తంగా వేగవంతం


31 రాష్ట్రాలు / యుటిలు పీఎంజికేఏవై కింద మే 2021 కోసం 100 శాతం ఉచిత ఆహార ధాన్యాలను వినియోగించుకున్నాయి

ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, పుదుచ్చేరి, తెలంగాణ 2021 మే-జూన్ కోసం పూర్తి కేటాయింపును వినియోగించుకున్నాయి

పీఎంజికేఏవై కింద మొత్తం 36 రాష్ట్రాలు / యుటిలకు 48 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎమ్‌టి) ఉచిత ఆహార ధాన్యాలను భారత ఆహార సంస్థ సరఫరా చేస్తుంది

మే 2021 లో, ఎఫ్‌సిఐ మొత్తం 1062 రేక్‌లను లోడ్ చేసింది, అంటే రోజుకు సగటున 44 రేక్‌లు

ఎఫ్‌సిఐ 2020 మార్చి నుంచి వివిధ ప్రభుత్వ పథకాల కింద మొత్తం 1062 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలను విడుదల చేసింది

Posted On: 25 MAY 2021 6:22PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజికేఏవై) కింద లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు ఉచితంగా పంపిణీ చేసే పథకం, ప్రస్తుత కోవిడ్ మహమ్మారి కాలంలో లబ్ధిదారులకు పెద్ద ఉపశమనం కలిగించింది.

2021 మే 24 వరకు, మొత్తం 36 రాష్ట్రాలు / యుటిలకు ఎఫ్‌సిఐ 48 ఎల్‌ఎమ్‌టి ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. 5 రాష్ట్రాలు / యుటిలు అంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, పుదుచ్చేరి, తెలంగాణ 2021 మే-జూన్ కోసం పూర్తి కేటాయింపులను వినియోగించుకున్నాయి. 26 రాష్ట్రాలు / యుటిలు అంటే అండమాన్ & నికోబార్ దీవులు, అస్సాం, చండీగఢ్, ఛత్తీస్‌గడ్, డామన్ డయు, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడఖ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, బెంగాల్ 2021 కేటాయింపును 100 శాతం వినియోగించుకున్నాయి.

దేశంలో ఆహార ధాన్యాలు సజావుగా సరఫరా అయ్యేలా, ఎఫ్‌సిఐ ముందుగానే లాజిస్టిక్‌లను ప్లాన్ చేసింది. కేటాయించిన స్టాక్లను ఎత్తివేసినప్పుడు, అదే రోజూ తిరిగి వాటిని నింపివేస్తారు. తద్వారా అన్ని రాష్ట్రాలు / యుటిలలో తగినంత ఆహార ధాన్యాలు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటాయి. మే 2021 లో, ఎఫ్‌సిఐ ఇప్పటికే 1062 రేక్‌లను లోడ్ చేసింది, అంటే రోజుకు సగటున 44 రేక్‌లు లోడ్ చేసినట్టు. ప్రస్తుతం, సెంట్రల్ పూల్ కింద 295 ఎల్‌ఎమ్‌టి గోధుమలు మరియు 597 ఎల్‌ఎమ్‌టి బియ్యం (మొత్తం 892 ఎల్‌ఎమ్‌టి) ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి.

కోవిడ్ మహమ్మారి కాలంలో, 2020 మార్చి 25 నుండి, వివిధ ప్రభుత్వ పథకాల కింద ఎఫ్‌సిఐ మొత్తం 1062 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలను విడుదల చేసింది. 

పేదలను ఆదుకోవడం కోసం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ( పీఎంజికేఏవై) కింద, కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తోంది. రెండు నెలల వ్యవధి (మే-జూన్ 2021)లో ఒక్కో వ్యక్తికి నెలకు సుమారు 5 కిలోలు అందేలా చర్యలు చేపట్టింది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో 79.39 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ కేటాయింపు సాధారణ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కేటాయింపుతో పాటు, ఈ పథకం కింద 79.39 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు జారీ చేయాల్సి ఉంటుంది.

 

*****


(Release ID: 1721829) Visitor Counter : 189