రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

మ్యూకోర్‌మైకోసిస్‌ కేసుల పెరుగుదల దృష్ట్యా యాంఫోటెరిసిన్‌-బి ఔషధం తాజా కేటాయింపులు - శ్రీ సదానంద గౌడ

Posted On: 22 MAY 2021 11:47AM by PIB Hyderabad

వివిధ రాష్టాల్లో మ్యూకోర్‌మైకోసిస్‌ కేసుల పెరుగుదలపై సమగ్రంగా సమీక్షించిన తర్వాత; అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా 23,680 వయళ్ల యాంఫోటెరిసిన్‌-బి ఔషధాన్ని కేటాయించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ వెల్లడించారు.

    దేశవ్యాప్తంగా ఇప్పటివరకు గుర్తించిన దాదాపు 8,848 మంది రోగుల సంఖ్య ఆధారంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ కేటాయింపులు చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FA8Y.jpg

***(Release ID: 1720837) Visitor Counter : 205