ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

బ్లాక్ ఫంగస్ పై వస్తున్న వివిధ నివేదికల నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం


ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణ, నియంత్రణ కోసం ఆసుపత్రులలో సంక్రమణ నివారణ, నియంత్రణ-శానిటేషన్, పరిశుభ్రత విషయంలో పటిష్టమైన విధానాలు అనుసరించాలి

Posted On: 21 MAY 2021 6:24PM by PIB Hyderabad

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, యుటిలు బ్లాక్ ఫంగస్ అనే ముకోర్మైకోసిస్ తో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదించాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరగడం, ముకోర్మైకోసిస్ ఆందోళన కలిగించేలా పెరుగుతున్న ద్వితీయ శ్రేణిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల గురించి గమనించి, సంక్రమణ నివారణ, నియంత్రణ కోసం వారి సంసిద్ధతను,  ఆసుపత్రులలో పరిశుభ్రత మరియు పారిశుధ్యం సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు / యుటిలకు సూచించింది.

కోవిడ్  ఆస్పత్రులు, ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో పటిష్టమైన సంక్రమణ నివారణ, నియంత్రణ పద్ధతులు ఉండేలా చర్యలను, విధానాలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, యుటిల ప్రధాన కార్యదర్శులు మరియు నిర్వాహకులకు రాసిన లేఖలో కోరారు. 

హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీని సంస్థ అధిపతి లేదా నిర్వాహకుడిని చైర్‌పర్సన్‌గా నియమించాలి 

సంక్రమణ నివారణ, నియంత్రణ నోడల్ అధికారిని నియమించాలి - ప్రధానంగా మైక్రోబయాలజిస్ట్ లేదా సీనియర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సు.

ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో సంక్రమణ, నియంత్రణ కోసం జాతీయ మార్గదర్శకాలలో ఇచ్చిన మార్గదర్శకత్వం ప్రకారం, ఆసుపత్రి / ఆరోగ్య సదుపాయాలలో సంక్రమణ నివారణ నియంత్రణ (ఐపిసి) కార్యక్రమాన్ని సిద్ధం చేసి అమలు చేయాలి. (https://www.mohfw.gov.in/pdf/National%20Guidelines%20for%20IPC%20in%20HCF%20-%20final(1).pdf). 

వైరస్ ప్రసారం అయ్యే అవకాశం ఉన్న అన్ని మార్గాలపైన దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

పరిసరాలను, ప్రాంగణాలను మరింత వెంటిలేషన్ తో కూడుకున్నవిగా చూడాలని సూచనలు చేస్తున్నారు. 

ఆస్పత్రుల పరిశుభ్రత, డిస్ఇన్ఫెక్షన్, వాతావరణం పట్ల శ్రద్ధ పెంచాలి 

వ్యర్థాల నిర్వహణ విషయంలో మార్గదర్శకాలను పాటించాలి (https://cpcb.nic.in/uploads/Projects/Bio-Medical-Waste/BMW-GUIDELINES-COVID_1.pdf

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. 

 

 

****



(Release ID: 1720771) Visitor Counter : 213