హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 రెండవ దశను పరిగణనలోకి తీసుకుని బలహీనవర్గాలకు ఉనికిలో ఉన్న సౌకర్యాలను సమీక్షించవలసిందిగా రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
Posted On:
21 MAY 2021 12:44PM by PIB Hyderabad
షెడ్యూల్డు కులాలు/ షెడ్యూల్డ్ తెగలు, సీనియర్ సిటిజెన్లు, పిల్లలు, మహిళలు సహా సమాజంలోని బలహీన వర్గాలపై జరిగే నేరాలను, అత్యాచారాలను నిరోధించడమే కాక, మానవ అక్రమరవాణాను ఎదుర్కోవడానికి, నిరోధించడానికి వ్యవస్థాగత యంత్రాంగాలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది.
కోవిడ్ -19 మహమ్మారి రెండవ దశ ప్రభావాన్ని- ముఖ్యంగా బలహీనవర్గాలపై పడుతున్న ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బలహీనవర్గాలు, ముఖ్యంగా కోవిడ్ -19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కారణంగా అనాథలైన పిల్లలపై దృష్టి పెట్టవలసిందిగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నొక్కి చెప్పింది. ప్రభుత్వ సహాయ సౌకర్యాలను అందుకోవడానికి మార్గదర్శనం అవసరం అయిన బలహీనవర్గాలు, ముఖ్యంగా అనాథలు అయిన పిల్లలు, సహాయం, మద్దతు (వైద్యపరమైన, సంరక్షణ, భద్రత) అవసరమైన సీనియర్ సిటిజెన్లు, షెడ్యూల్డు కులాలు/ షెడ్యూల్డు తెగలకు సంబంధించి ప్రస్తుతం ఉనికిలో ఉన్న సౌకర్యాలను తక్షణమే సమీక్షించవలసిందిగా రాష్ట్రాలను/ కేంద్రపాలిత ప్రాంతాలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
పోలీసు సిబ్బందిని సంవేద్యీకరణం (సెన్సిటైజేషన్) చేయడం, సంబంధిత వివిధ లైన్ డిపార్ట్‌మెంట్లు/ ఏజెన్సీల సహకారంతో పోలీసు స్టేషన్లలో, జిల్లాలలో అక్రమ మానవ రవాణా (యాంటీ -హ్యూమన్ ట్రాఫికింగ్ )యూనిట్లలో మహిళా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయవలసిందిగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను/ కేంద్ర పాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేసింది.
ఈ కార్యకలాపంలో సౌలభ్యత కల్పించేందుకు పోలీసులు అంతర్ రాష్ట్ర సమాచారాన్ని పంచుకునేందుకు క్రైమ్ మల్టీ సెంటర్ ఏజెన్సీ (Cri-MAC); కనిపించకుండా పోయిన వ్యక్తులు, దొరికిన వ్యక్తుల గురించి పోలీసులకు తెలియచేసేందుకు ఆన్‌లైన్ నేషనల్ అలెర్ట్ సర్వీస్; క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టంస్ (సిసిటి ఎన్ఎస్); తప్పిపోయిన వ్యక్తులు, గుర్తించని మృతదేహాల ఫోటోలను సిసిటిఎన్ ఎస్‌లో పొందుపరిచిన జాతీయ ఇమేజ్ రిపోజిటరీ (భాండాగారం)లో వెతికేందుకు, పోల్చేందుకు పోలీసు సిబ్బందిని సాధికారం చేసే మెషీన్ లెర్నింగ్ మోడల్‌ను ఉపయోగించే యాంత్రికంగా ఫోటోలను పోల్చగల వెబ్ ఆధారిత అప్లికేషన్ యుఎన్ఐఎఫ్‌వై (యూనిఫై) సహా పలు పరికరాలను ఎన్‌సిఆర్‌బి రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తప్పిపోయిన వ్యక్తులను వెతికేందుకు అందుబాటులో ఉన్న సెంట్రల్ సిటిజెన్ సర్వీస్ గురించి మరింత చైతన్యాన్ని సృష్టించవలసిందిగా రాష్ట్రాలను/ కేంద్రపాలిత ప్రాంతాలను హోం మంత్రిత్వ శాఖ కోరింది. కోవిడ్-19 సందర్భంగా ట్రాన్స్‌జెండర్ల భద్రతల కోసం ఇటీవలే విడుదల చేసిన ప్రామాణిక నిర్వహణా విధానాలను గురించి కూడా ఎంహెచ్ ఎ ప్రస్తావించింది.
పౌరుల లబ్దికోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఈ సౌకర్యాలను ఉపయోగిస్తున్నాయి.
***
(Release ID: 1720674)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam