ఆర్థిక మంత్రిత్వ శాఖ

మహమ్మారి నేపథ్యంలో కొన్ని గడువులు పొడిగించిన ప్రభుత్వం

Posted On: 20 MAY 2021 6:22PM by PIB Hyderabad

   కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల తీవ్రత నేపథ్యంలో వివిధ భాగస్వాముల నుంచి పలు విజ్ఞాప‌న‌లు అందిన దృష్ట్యా ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించడంలో తన కట్టుబాటుకు అనుగుణంగా కొన్ని అంశాలకు సంబంధించిన గడువులను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చట్టం-1961కి (ఇకపై ’చట్టం’గా వ్యవహరించబడుతుంది) సంబంధించి కింది అంశాలను తాజా గడువుల పరిధిలోకి తెచ్చింది.

 1. ఆదాయపు పన్ను నిబంధనలు-1962 (ఇకపై ‘నిబంధనలు’)సహా వివిధ అనుబంధ ప్రకటనల ప్ర్రకారం ‘114ఇ’ నిబంధన కింద 2020-21 ఆర్థిక సంవత్సరం ‘ఆర్థిక లావాదేవీల నివేదిక’ (ఎస్ఎఫ్‌టీ)ను 2021 మే 31న లేదా ఆలోగా సమర్పించాల్సి ఉండగా, ఇప్పుడు 2021 జూన్ 30న లేదా ఆలోగా అందజేయవచ్చు.
 2. కేలండర్ సంవత్సరం 2020కిగాను నిబంధన ‘114జి’ కింద ‘నివేదించదగిన ఖాతా నివేదిక’ను 2021 మే 31న లేదా ఆలోగా సమర్పించాల్సి ఉండగా, ఇప్పుడు 2021 జూన్ 30న లేదా ఆలోగా అందజేయవచ్చు.
 3. నిబంధన ‘31ఎ’ కింద 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను ‘పన్ను కోత (డిడక్షన్) నివేదిక’ను 2021 మే 31న లేదా ఆలోగా సమర్పించాల్సి ఉండగా, ఇప్పుడు 2021 జూన్ 30న లేదా ఆలోగా అందజేయవచ్చు.
 4. ‘మూలంలోనే పన్ను కోత’పై ‘నిబంధన 31’ కింద ఉద్యోగులకు 2021 జూన్ 15నాటికి ‘ఫామ్ నం.16 ధ్రువీకరణ పత్రం’ జారీ చేయాల్సి ఉండగా, ఇప్పుడు 2021 జూలై 15న లేదా ఆలోగా అందజేయవచ్చు.
 5. ‘నిబంధన 30, 37సిఎ’ ప్రకారం 2021 మే నెల ‘టీడీఎస్/టీసీఎస్’ సంబంధిత ‘ఖాతా సర్దుబాటు నివేదిక’ను ‘ఫామ్ నం.24జి’ రూపంలో 2021 జూన్ 15న లేదా ఆలోగా సమర్పించాల్సి ఉండగా, ఇప్పుడు 2021 జూన్ 30న లేదా ఆలోగా అందజేయవచ్చు.
 6. ‘నిబంధన 33’ కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆమోదిత సూపర్ యాన్యుయేషన్ నిధికి ధర్మకర్తల వాటా చెల్లింపుల నుంచి ‘పన్ను కోత నివేదిక’ను 2021 మే 31న లేదా ఆలోగా పంపాల్సి ఉండగా, ఇప్పుడు 2021 జూన్ 30న లేదా ఆలోగా అందజేయవచ్చు.
 7. ‘నిబంధన 12సిబి’ కింద ‘పెట్టుబడి నిధి’  యాజమాన్యం మునుపటి 2020-21 సంవత్సరానికిగాను ‘ఫామ్ నం.64డి’ రూపంలో యూనిట్ దారులకు చెల్లించిన లేదా ఖాతాలకు జమచేసిన ఆదాయంపై నివేదికను 2021 జూన్ 15న లేదా ఆలోగా అందజేయాల్సి ఉండగా, ఇప్పుడు 2021 జూన్ 30న లేదా ఆలోగా సమర్పించవచ్చు.
 8. ‘నిబంధన 12సిబి’ కింద ‘పెట్టుబడి నిధి’ యాజమాన్యం మునుపటి 2020-21 సంవత్సరానికిగాను ‘ఫామ్ నం.64సి’ రూపంలో యూనిట్ దారులకు చెల్లించిన లేదా ఖాతాలకు జమచేసిన ఆదాయంపై నివేదికను 2021 జూన్ 30న లేదా ఆలోగా అందజేయాల్సి ఉండగా, ఇప్పుడు 2021 జూలై 15న లేదా ఆలోగా సమర్పించవచ్చు.
 9. ‘చట్ట నిబంధన 139లోని ఉప నిబంధన (1)’ కింద 2021-22 అంచనా సంత్సరానికిగాను 2021 జూలై 31న లేదా ఆలోగా ఆదాయపు పన్ను రిటర్ను సమర్పించాల్సి ఉండగా, 2021 సెప్టెంబరు 30దాకా గడువు పొడిగించబడింది.
 10. ‘చట్టంలోని ఏ నిబంధన’ కిందనైనా మునుపటి 2020-21 సంవత్సరానికిగాను ‘ఆడిట్ నివేదిక’ను 2021 సెప్టెంబరు 30న లేదా ఆలోగా సమర్పించాల్సి ఉండగా, 2021 అక్టోబరు 31దాకా గడువు పొడిగించబడింది.
 11. ‘చట్టంలోగల నిబంధన 92ఇ’ కింద అంతర్జాతీయ లేదా నిర్దేఇత దేశీయ లావాదేవీల్లో భాగస్వాములైన వ్యక్తులు అకౌంటెంట్ ద్వారా మునుపటి 2021-21 సంవత్సరానికిగాను 2021 అక్టోబరు 31న లేదా ఆలోగా నివేదిక సమర్పించాల్సి ఉండగా, ఆ గడువు 2021 నవంబరు 30దాకా పొడిగించబడింది.
 12. ‘చట్ట నిబంధన 139లోని ఉప నిబంధన (1)’ కింద 2021-22 అంచనా సంత్సరానికిగాను 2021 అక్టోబరు 31న లేదా ఆలోగా ఆదాయపు పన్ను రిటర్ను సమర్పించాల్సి ఉండగా, 2021 నవంబరు 30దాకా గడువు పొడిగించబడింది.
 13. ‘చట్ట నిబంధన 139లోని ఉప నిబంధన (1)’ కింద 2021-22 అంచనా సంత్సరానికిగాను 2021 నవంబరు 30న లేదా ఆలోగా ఆదాయపు పన్ను రిటర్ను సమర్పించాల్సి ఉండగా, 2021 డిసెంబరు 31దాకా గడువు పొడిగించబడింది.
 14. ‘చట్ట నిబంధన 139లోని ఉప నిబంధన (4)/(5)’ల కింద 2021-22 అంచనా సంత్సరానికిగాను ఆలస్యంగా/సవరించిన ఆదాయపు పన్ను రిటర్నును  2021 డిసెంబరు 31న లేదా ఆలోగా సమర్పించాల్సి ఉండగా, 2022 జనవరి 31దాకా గడువు పొడిగించబడింది.

   పైన పైర్కొన్న అంశాల్లో నిబంధనలు (ix), (xii), (xiii)లలో గడువు తేదీల పొడిగింపు  ‘చట్టంలోని 234ఎలోని సెక్షన్ 1’కింద ఇచ్చిన వివరణకు వర్తించవని స్పష్టం చేయబడుతోంది. ఆ మేరకు మొత్తం ఆదాయంపై ఉప నిబంధన (1) కిందగల నిబంధనలు (i) నుంచి (vi) కింద నిర్దేశించిన పన్ను మొత్తంలో తగ్గింపు రూ.1 లక్షకు మించినపుడు ఈ పొడిగింపులు వర్తించవు. అంతేకాకుండా ‘చట్టంలోని 207లోగల ఉప నిబంధన (2)లో పేర్కొన్న మేరకు భారతవాసులైన పన్ను చెల్లింపుదారులు ‘చట్టంలోని నిబంధన 140ఎ’ కింద గడువు (పొడిగింపు లేకుండా)లోగా పన్ను చెల్లించి ఉంటే అది ముందస్తు చెల్లించిన పన్నుగా పరిగణించబడుతుంది.

   ఈ మేరకు 20.05.2021నాడు F.No.225/49/2021/ITA-II కింద ‘సీబీడీటీ’ సర్క్యులర్ నం.9/2021 జారీచేయబడినది. ఇది www.incometaxindia.gov.in.లో లభ్యమవుతుంది.

 

***(Release ID: 1720421) Visitor Counter : 205