రైల్వే మంత్రిత్వ శాఖ

యుద్ధ ప్రాతిపదికన ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న - 200 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు


775 ట్యాంకర్లలో దాదాపు 12,630 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ లు


784 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్‌.ఎం.ఓ. తో నింపిన 45 ట్యాంకర్లతో దేశంలోని వివిధ ప్రాంతాలకు నడుస్తున్న - 10 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు



ఇప్పుడు ప్రతిరోజూ 800 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్‌.ఎమ్‌.ఓ.ను దేశంలో వివిధ ప్రాంతాలకు పంపిణీ చేస్తున్న - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు


ఇంతవరకు, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి 13 రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా ద్వారా ఉపశమనం కల్పించిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు







ఇప్పటి వరకు, మహారాష్ట్రలో 521 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్; ఉత్తరప్రదేశ్ లో దాదాపు 3189 మెట్రిక్ టన్నులు; మధ్యప్రదేశ్ లో 521 మెట్రిక్ టన్నులు; హర్యానా లో 1549 మెట్రిక్ టన్నులు; తెలంగాణలో 772 మెట్రిక్ టన్నులు; రాజస్థాన్ లో 98 మెట్రిక్ టన్నులు; కర్ణాటక లో 641 మెట్రిక్ టన్నులు; ఉత్తరాఖండ్‌ లో 320 మెట్రిక్ఎ టన్నులు; తమిళనాడు

Posted On: 20 MAY 2021 2:13PM by PIB Hyderabad

అన్ని అడ్డంకులను అధిగమించి, కొత్త పరిష్కారాలను కనుగొనే దిశగా, భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) ను పంపిణీ చేయడం ద్వారా, ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.  భారత రైల్వే, ఇప్పటివరకు, 775 కి పైగా ట్యాంకర్ల లో 12,630 మెట్రిక్ టన్నులకు పైగా,  ఎల్‌.ఎం.ఓ.ను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.

200 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించిన విషయాన్ని గమనించవచ్చు.

ఈ సమాచారాన్ని విడుదల చేసే సమయానికి, 45 ట్యాంకర్ల లో  784 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఎల్.ఎం.ఓ. తో నింపిన, 10 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు తమ గమ్యం దిశగా నడుస్తున్నాయి.

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ లు ప్రతీ రోజూ దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఎల్‌.ఎం.ఓ.ను దేశవ్యాప్తంగా రవాణా చేస్తున్నాయి.

సాధ్యమైనంత తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువగా ఎల్‌.ఎం.ఓ.ను వివిధ రాష్ట్రాల కు రవాణా చేయడానికి భారత రైల్వే కృషి చేస్తోంది.

ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, ఇంతవరకు, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి 13 రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా ద్వారా ఉపశమనం కల్పించాయి.

ఈ సమాచారాన్ని విడుదల చేసే సమయం వరకు, మహారాష్ట్రలో 521 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్; ఉత్తరప్రదేశ్ లో దాదాపు 3189 మెట్రిక్ టన్నులు;  మధ్యప్రదేశ్ లో 521 మెట్రిక్ టన్నులు; హర్యానా లో 1549 మెట్రిక్ టన్నులు; తెలంగాణలో 772 మెట్రిక్ టన్నులు; రాజస్థాన్ లో 98 మెట్రిక్ టన్నులు; కర్ణాటక లో 641 మెట్రిక్ టన్నులు;  ఉత్తరాఖండ్‌ లో 320 మెట్రిక్ఎ టన్నులు; తమిళనాడు లో 584 మెట్రిక్ టన్నులు; ఆంధ్రప్రదేశ్‌ లో 292 మెట్రిక్ టన్నులు; పంజాబ్ లో 111 మెట్రిక్ టన్నులు; కేరళ లో 118 మెట్రిక్ టన్నులు; ఢిల్లీ లో 3915 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ దింపుకోవడం జరిగింది.

పశ్చిమంలో హపా, ముంద్రా; తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటా నగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుండి భారత రైల్వే,  ఆక్సిజన్ సేకరించి, సంక్లిష్ట కార్యాచరణ మార్గ ప్రణాళికల ద్వారా, దేశంలోని వివిధ మార్గాల గుండా ప్రయాణించి, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ వంటి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తోంది.

ఆక్సిజన్ ఉపశమనం సాధ్యమైనంత వేగంగా చేరుకునేలా చూడటానికి, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సరకు రవాణా రైళ్ళను నడపడంలో రైల్వే కొత్త ప్రమాణాలతో పాటు, అపూర్వమైన బెంచ్‌-మార్క్‌ లను సృష్టిస్తోంది.  ఈ క్లిష్టమైన సరుకు రవాణా రైళ్ళ సగటు వేగం చాలా సందర్భాలలో 55 కన్నా ఎక్కువగా ఉంటోంది.  ఆక్సిజన్ సరఫరా, వేగంగా సాధ్యమయ్యే అతి తక్కువ సమయ వ్యవధి లో చేరుకోవాలనే లక్ష్యంతో, అధిక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ కారిడార్‌లో, అత్యవసర భావనతో, వివిధ మండలాల కార్యాచరణ బృందాలు చాలా సవాలు పరిస్థితులలో 24 గంటలూ పనిచేస్తున్నాయి.  వివిధ ప్రాంతాల్లో సిబ్బంది మారడం కోసం సాంకేతికంగా రైళ్ళు నిలిపి ఉంచే సమయాన్ని ఒక నిమిషానికి తగ్గించారు.

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఎక్కడా ఆగకుండా, వేగంగా గమ్యం చేరుకోడానికి వీలుగా, అధిక అప్రమత్తతను, పాటిస్తూ, ఎక్కడికక్కడ రైలు మార్గాల్లో అవరోధాలు లేకుండా చూస్తున్నారు. 

ఇవన్నీ ఇతర సరకు రవాణా కార్యకలాపాల నిర్వహణ వేగం ఏమాత్రం తగ్గని రీతిలో కొనసాగుతున్నాయి.

కొత్తగా ఆక్సిజన్‌ ఎక్స్ ప్రెస్ రైళ్ళను నడపడం,  ఎప్పటికప్పుడు గణాంకాలతో తాజా సమాచారాన్ని సమకూర్చడం, ఒక క్రియాశీలమైన ప్రక్రియగా జరుగుతోంది.  మరింతగా లోడ్ చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు అర్ధరాత్రి తరువాత ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.

రైల్వేలు ఆక్సిజన్ సరఫరా స్థానాలతో వేర్వేరు మార్గాలను గుర్తించి, ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల అవసరాలకు సిద్ధంగా ఉన్నాయి.  కాగా, ఎల్‌.ఎం.ఓ. ను సరఫరా చేయడానికి, రాష్ట్రాలు, భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తున్నాయి. 

 

*****



(Release ID: 1720410) Visitor Counter : 156