భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

“ప్రసారాన్ని అడ్డుకోండి, మహమ్మారిని అణిచివేయండి - ముసుగులు, దూరం, శానిటేషన్, వెంటిలేషన్ ద్వారా సార్స్ కోవ్-2 వైరస్ వ్యాప్తిని నివారించండి” సూచనలు చేసిన కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం

Posted On: 20 MAY 2021 9:00AM by PIB Hyderabad

ట్రాన్స్మిషన్ నిలువరించి, మహమ్మారిని అణచివేయడానికి కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్  అడ్వైజర్ కార్యాలయం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలో మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో సార్స్ కోవ్-2 వైరస్ ని వ్యాప్తిని నిరోధించడానికి మళ్ళీ ఒక సారి కనీస పద్ధతులను తప్పనిసరిగా పాటించాలనే అలవాట్లను గుర్తు తెచ్చుకోవాలి. పేలవంగా వెంటిలేషన్ చేయబడిన ఇళ్ళు, కార్యాలయాలు మొదలైన వాటిలో సోకిన గాలి, వైరల్ ప్రభావాన్ని బాగా తగ్గించగలం.  బాగా వెంటిలేషన్ చేయబడిన ప్రదేశాలు పోషించే ముఖ్యమైన పాత్రను అడ్వైసరీ ప్రస్తావించింది. వెంటిలేషన్ ఒక సోకిన వ్యక్తి నుండి మరొకరికి సంక్రమించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపింది. 

కిటికీలు మరియు తలుపులు తెరవడం ద్వారా మరియు ఎగ్జాస్ట్ వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా వాసనను గాలి నుండి తగ్గించవచ్చు, మెరుగైన దిశాత్మక వాయు ప్రవాహంతో ఖాళీలను వెంటిలేట్ చేయడం వలన గాలిలో పేరుకుపోయిన వైరల్ పల్చపడుతుంది.  ప్రసార ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వెంటిలేషన్ అనేది ఇంట్లో లేదా కార్యాలయంలో మనందరినీ రక్షించే సమాజ రక్షణ. కార్యాలయాలు, గృహాలు మరియు పెద్ద బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ గాలి విశాలంగా వీచేలా చూడాలి. ఈ ప్రదేశాలలో వెంటిలేషన్ మెరుగుపరచడానికి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర ప్రాధాన్యతతో తీసుకోవాలి, గుడిసెలు, గృహాలు, కార్యాలయాలు మరియు పెద్ద కేంద్రీకృత భవనాల కోసం సిఫార్సులు చేయడం జరిగింది. క్రాస్ వెంటిలేషన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ...  వ్యాధి వ్యాప్తిని తగ్గించగలుగుతాయి. 

సెంట్రల్ ఎయిర్ ఫిల్ట్రేషన్ మెరుగుపరిచే సెంట్రల్ ఎయిర్-మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్న భవనాలలో మెరుగైన అవుట్డోర్ ఎయిర్ డెలివరీ ముఖ్యం. కార్యాలయాలు, ఆడిటోరియంలు, షాపింగ్ మాల్స్ మొదలైనవాటిలో  పైకప్పు వెంటిలేటర్లను వాడటం మంచిది. ఫిట్టర్లను తరచుగా శుభ్రపరచడం మరియు మార్చడం చాలా మంచిది.

సోకిన వ్యక్తి ఉచ్ఛ్వాసము, మాట్లాడటం, పాడటం, నవ్వడం, దగ్గు లేదా తుమ్ము మొదలైనవాటిలో బిందువులు మరియు ఏరోసోల్స్ రూపంలో విడుదలయ్యే లాలాజలం మరియు నాసికా వైరస్ వ్యాప్తి ప్రాధమిక లక్షణం. లక్షణాలు కనిపించని సోకిన వ్యక్తి కూడా వైరస్ను వ్యాపిస్తాడు. లక్షణాలు లేని వ్యక్తులు వైరస్ వ్యాప్తి చెందించే అవకాశం ఉంది. ప్రజలు ముసుగు ధరించడం కొనసాగించాలి, డబుల్ మాస్క్‌లు లేదా ఎన్ 95 ముసుగు ధరించాలి.

సార్స్ కోవ్-2 వైరస్ ఒక వ్యక్తికి సోకుతుంది, అక్కడ అది మరెంతో మందికి వ్యాపించే ప్రమాదం ఉంది, ఆ వైరస్ సోకిన వ్యక్తి అక్కడ లేనప్పుడు అది మనుగడ సాగించదు, మరియు వైరస్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ప్రసారం చేయడాన్ని ఆపివేయడం వలన వ్యాధి సంక్రమణ రేటు ఒక స్థాయికి తగ్గుతుంది అక్కడ అది చివరికి చనిపోతుంది. 

వ్యక్తులు, సంఘాలు, స్థానిక సంస్థలు,  అధికారుల మద్దతు, సహకారంతో మాత్రమే దీనిని సాధించవచ్చు. ముసుగులు, వెంటిలేషన్, దూరం మరియు శానిటేషన్ ద్వారా వైరస్‌పై పోరాటం గెలవవచ్చు. 

Kindly click here for the Advisory

*****(Release ID: 1720351) Visitor Counter : 268