రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రతి కొవిడ్–19ఎసెన్షియల్ డ్రగ్ సరఫరాను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం


అన్ని కొవిడ్–19మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి

Posted On: 19 MAY 2021 1:44PM by PIB Hyderabad
ప్రతి కొవిడ్–19 అత్యవసర ఔషధం సరఫరాను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవియా ఈ రోజు హామీ ఇచ్చారు. కొవిడ్–19 చికిత్సలో ఉపయోగించే అన్ని ఔషధాల ఉత్పత్తిని పెంచడం వల్ల , దిగుమతులను పెంచడం వల్ల అంతటా అందుబాటులో ఉన్నాయి. సప్లై చైన్ మేనేజ్‌మెంట్, డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్, అందుబాటు ధరలు...ఈ   మూడంచెల వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా ఈ ఔషధాల లభ్యతను పర్యవేక్షిస్తున్నారు.
 
ప్రోటోకాల్ డ్రగ్స్:
 
రెమ్‌డెసివిర్
 
ఎనోక్సపారిన్
 
మిథైల్ ప్రెడ్నిసోలోన్
 
డెక్సామెథసోన్
 
టోసిలిజుమాబ్
 
ఐవర్‌మెక్టిన్
 
 
నాన్-ప్రోటోకాల్ డ్రగ్స్:
 
ఫవిపిరవిర్
 
యాంఫోటెరిసిన్
 
అపిక్సాబన్
 
సిడిస్కో , ఎన్‌పిపిఎలు తయారీదారులతో సమన్వయం చేసుకుని ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి.  ప్రస్తుత స్టాక్, ప్రస్తుత సామర్థ్యాలు, మే నెల కోసం అంచనా వేసిన ఉత్పత్తి గురించి డేటాను తీసుకుంటున్నాయి.
 
రెమ్‌డెసివిర్:
 
రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్య 20 నుండి 60 కి పెరిగింది, ఫలితంగా కేవలం 25 రోజుల్లో ఉత్పత్తి 3 రెట్లు ఎక్కువయింది.
 
ఏప్రిల్ లో ఉత్పత్తి నెలకు 10 లక్షల వయల్స్ కాగా, మేలో ఉత్పత్తిని పది రెట్లు పెంచారు. ఫలితంగా నెలకు కోటి డోసులు అందుబాటులో వస్తాయి.
 
టోసిలిజుమాబ్ ఇంజెక్షన్:
 
సాధారణ కాలంలో చేస్తున్నదాని కంటే 20 రెట్లు ఎక్కువ దిగుమతి చేసుకోవడం  దేశమంతటా ఇది అందుబాటులోకి వచ్చింది.
 
డెక్సామెథాసోన్ 0.5 మిల్లీగ్రామ్ మాత్రలు
 
ఒక నెలలో ఉత్పత్తి 6-8 రెట్లు పెరిగింది
 
 డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ ఉత్పత్తి దాదాపు 2 రెట్లు పెరిగింది.
 
ఎనోక్సపారిన్ ఇంజెక్షన్ ఉత్పత్తి కేవలం ఒక నెలలో 4 రెట్లు పెరిగింది.
 
 మిథైల్ ప్రెడ్నిసోలోన్ ఇంజెక్షన్:
 
ఒక నెల వ్యవధిలో ఉత్పత్తి దాదాపు 3 రెట్లు పెరిగింది.
 
ఐవర్‌మెక్టిన్ 12 మిల్లీగ్రామ్ మాత్రల ఉత్పత్తి ఏప్రిల్‌లో నెలకు150 లక్షల నుండి 2021 మేలో నెలకు 770 లక్షలకు పెరిగింది. ఒకే నెలలో నెలలో ఉత్పత్తి 5 రెట్లు పెరిగింది.
 
ఫవిర్‌పిరవిర్:
 
నాన్-ప్రోటోకాల్ ఔషధం అయినప్పటికీ, ఇది వైరస్ భారాన్ని తగ్గించడానికి ఉపయోగించబడుతుంది.
 
నెల రోజుల్లో ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది
 
ఏప్రిల్‌లో 326.5 లక్షల ట్యాబెట్లు తయారు కాగా మే నుంచి 1644 లక్షలు ఉత్పత్తి అయ్యాయి.
 
యాంఫోటెరెసిన్ బి ఇంజెక్షన్:
 
ఉత్పత్తి నెలలో మూడురెట్లు పెరిగింది.
 
3.80 లక్షల వయల్స్ ఉత్పత్తిలో ఉన్నాయి ,
 
3 లక్షల వయల్స్ దిగుమతి అవుతున్నాయి
 
దేశంలో మొత్తం 6.80 లక్షల వయల్స్ అందుబాటులో ఉంటాయి.
 
***

(Release ID: 1720180) Visitor Counter : 233