ప్రధాన మంత్రి కార్యాలయం

కేంద్ర మాజీమంత్రి శ్రీ చ‌మ‌న్‌లాల్ గుప్తా మృతికి ప్ర‌ధానమంత్రి సంతాపం

Posted On: 18 MAY 2021 1:32PM by PIB Hyderabad

   కేంద్ర మాజీమంత్రి శ్రీ చ‌మ‌న్‌లాల్ గుప్తా క‌న్నుమూత‌పై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌కటించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌ద్వారా సందేశ‌మిస్తూ- ‘‘అనేక సామాజిక సంక్షేమ సేవా కార్య‌క్ర‌మాల్లో శ్రీ చ‌మ‌న్‌లాల్ గుప్తాగారి కృషి చిర‌స్మ‌ర‌ణీయం. ఆయ‌న‌ అంకిత‌భావంగ‌ల చ‌ట్ట‌స‌భ స‌భ్యులు మాత్ర‌మే కాకుండా జ‌మ్ముక‌శ్మీర్‌లో బీజేపీని బ‌లోపేతం చేయ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఆయ‌న మృతి వార్త న‌న్నెంతో విచారానికి గురిచేసింది. ఈ విషాద స‌మ‌యంలో ఆయ‌న కుటుంబానికి, మ‌ద్ద‌తుదారుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను... ఓం శాంతి’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(Release ID: 1719645)