రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

భారతదేశంలో "రెమ్‌డెసివిర్" లభ్యతను పెంచడానికి వేగవంతమైన చర్యలు తీసుకున్న - కేంద్ర ప్రభుత్వం


"రెమ్‌డెసివిర్" లభ్యత, ఉత్పత్తి, సరఫరాపై కొనసాగుతున్న - నిరంతర పర్యవేక్షణ

నెలకు 38 లక్షల వైల్స్ నుండి నెలకు దాదాపు 119 లక్షల వైల్స్కు పెరిగిన - "రెమ్‌డెసివిర్" ఉత్పత్తి సామర్థ్యం

"రెమ్‌డెసివిర్" ఉత్పత్తి చేసే కేంద్రాల సంఖ్యలో - గణనీయమైన పెరుగుదల

Posted On: 17 MAY 2021 2:58PM by PIB Hyderabad

 

కోవిడ్ -19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటంతో, కోవిడ్ -19 చికిత్స కోసం ఉపయోగించే ఔషధాల లభ్యత, ఉత్పత్తి, సరఫరాపై పర్యవేక్షణను ఫార్మాస్యూటికల్స్ విభాగం, 2021 ఏప్రిల్ ప్రారంభంలో తీవ్రతరం చేసింది. "రెమ్‌డెసివిర్" ఉత్పత్తి చేసే హక్కు కలిగి ఉన్న అమెరికాకు చెందిన గిలీడ్ లైఫ్ సైన్సెస్ సంస్థ, 7 భారతీయ ఔషధ సంస్థలకు (సిప్లా, డాక్టర్ రెడ్డి ల్యాబ్., హెటెరో, జూబిలెంట్ ఫార్మా, మైలాన్, సింజీన్, జైడస్ కాడిలా) స్వచ్చంద లైసెన్సు మంజూరు చేయడంతో, ఈ సంస్థలు, భారతదేశంలో ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి.

దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, "రెమ్‌డెసివిర్" ఉత్పత్తి చేయడానికి లైసెన్స్ కలిగిన ఏడు తయారీ సంస్థలను త్వరగా తమ ఉత్పత్తిని వేగవంతం చేయాలని కోరడం జరిగింది.   కేంద్ర ప్రభుత్వం మరియు తయారీ సంస్థల సంయుక్త ప్రయత్నాలతో, లైసెన్స్ పొందిన తయారీదారుల ఉత్పత్తి సామర్థ్యం అపూర్వంగా నెలకు 38 లక్షల వైల్స్ నుండి నెలకు దాదాపు 119 లక్షల వైల్స్ కు పెరిగింది.  38 ప్రాంతాల్లో అదనంగా ఉత్పత్తి చేయడానికి, అత్యంత వేగంగా ఆమోదం మంజూరు చేయడంతో, ప్రస్తుతం, దేశంలో, "రెమ్‌డెసివిర్" తయారు చేయడానికి ఆమోదం పొందిన కేంద్రాల సంఖ్య 22 నుండి 60 కి పెరిగింది.  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయంతో, భారతదేశంలో "రెమ్‌డెసివిర్" తయారు చేసే సంస్థలకు, విదేశాల నుండి అవసరమైన ముడి పదార్థాలు, పరికరాలను సరఫరా కు తగిన సదుపాయం కల్పిస్తున్నారు.

దిగుమతుల ద్వారా మరియు దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఔషధ లభ్యతను పెంచడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.  2021 ఏప్రిల్, 11వ తేదీ నుండి "రెమ్‌డిసివర్" ఎగుమతులను నిషేధించారు.  రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్, రెమ్‌డెసివిర్ ఎ.పి.ఐ; బీటా సైక్లోడెక్స్ట్రిన్ (ఎస్‌.బి.ఈ.ఈ.బి.సి.డి) ల పై1 2021 ఏప్రిల్, 20వ తేదీ నుండి, కస్టమ్స్ సుంకాన్ని, మినహాయించారు.

దేశంలో అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో, దేశంలోని వివిధ ప్రాంతాలలో "రెమ్‌డెసివిర్" సరఫరా సమానంగా ఉండే విధంగా నిర్ధారించడానికి, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ మూడవ వారం నుండి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయింపులు చేస్తోంది.  అధిక డిమాండ్ ఉన్న 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు, 2021 ఏప్రిల్, 30వ తేదీ వరకు, మధ్యంతర కేటాయింపుగా 11 లక్షల వైల్స్ ను 2021 ఏప్రిల్, 21వ తేదీన కేటాయించడం జరిగింది.  మరిన్ని సరఫరాలు అందుబాటులోకి రావడంతో, ఈ కేటాయింపులను 16 లక్షల వైల్స్ కు పెంచి, ఏప్రిల్, 24వ తేదీన, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించడం జరిగింది.  తదనంతరం జారీ చేసిన వరుస కేటాయింపుల తర్వాత, మే 16వ తేదీన చేసిన తాజా కేటాయింపులతో, 2021 మే, 23వ తేదీ వరకు అవసరాల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం 76 లక్షల వైల్స్ ను కేటాయించడం జరిగింది. 

కేటాయింపు వివరాలు 

 

క్రమ సంఖ్య 

కేటాయింపులు జరిపిన తేదీ 

పరిగణ లోకి తీసుకున్న 

కాల వ్యవధి 

రాష్ట్రాలకు / కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించిన మొత్తం వైల్స్ 

1

21 ఏప్రిల్, 2021

21 ఏప్రిల్ నుండి  30 ఏప్రిల్ వరకు

11.00 లక్షలు 

2

24 ఏప్రిల్, 2021

21 ఏప్రిల్ నుండి 

30 ఏప్రిల్ వరకు

16.00 లక్షలు

3

29 ఏప్రిల్, 2021

21 ఏప్రిల్ నుండి 

2 మే వరకు 

17.80 లక్షలు

4

1 మే, 2021

21 ఏప్రిల్ నుండి 

మే వరకు

33.80 లక్షలు

5

 మే, 2021

21 ఏప్రిల్ నుండి 

16 మే వరకు

53.00 లక్షలు

6

16  మే, 2021

21 ఏప్రిల్ నుండి 

23 మే వరకు

76.00 లక్షలు


ఎయిమ్స్ / ఐ.సి.ఎం.ఆర్. కోవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ మరియు ఎం.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. యొక్క జాయింట్ మానిటరింగ్ గ్రూప్, సంయుక్తంగా జారీ చేసిన “వయోజన కోవిడ్ -19 రోగుల నిర్వహణ కోసం నేషనల్ క్లినికల్ గైడెన్స్” లో సూచించిన విధంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులను కలుపుకొని తమ న్యాయ పరిధిలో సరైన పంపిణీని పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరడం జరిగింది.   కంపెనీల అనుసంధాన అధికారుల తో సన్నిహిత సమన్వయంతో రూపొందించుకున్న సరఫరా ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కేటాయింపుల నుండి కొనుగోలు చేయాలనుకుంటున్న పరిమాణానికి వెంటనే మార్కెటింగ్ సంస్థలతో తగిన కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించడం జరిగింది.  తమ తమ రాష్ట్రాల్లో ప్రైవేటు పంపిణీ మార్గంతో సమన్వయం కోసం కూడా ఆయా రాష్ట్రాలు తగిన ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.  అవసరమైన రోగులకు ఈ ఔషధాన్ని జారీ చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనీ, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా, విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించడం జరిగింది. 

మొత్తం ఏడు భారతీయ తయారీ సంస్థలు ప్రభుత్వ కొనుగోలు ఉత్తర్వులకు అనుగుణంగా, మరియు రాష్ట్రాల్లో వారి ప్రయివేటు పంపిణీ మార్గాల ద్వారా కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాయి.   ఈ కంపెనీలు,  2021 ఏప్రిల్, 21వ తేదీ నుండి మే, 15వ తేదీ వరకు,  మొత్తం 54.15 లక్షల "రెమ్డెసివిర్" వైల్స్ ను, దేశవ్యాప్తంగా సరఫరా చేశాయి.  వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు జరుగుతున్న "రెమ్‌డెసివిర్"  సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. సరఫరా విషయమై, ఏదైనా ఫిర్యాదు వచ్చిన వెంటనే, సంబంధిత తయారీదారులతో ఆ విషయమై, చర్చించడం జరుగుతుంది.  ఫార్మాస్యూటికల్స్ విభాగం, జాతీయ ఫార్మాస్యూటికల్స్ ధరల నిర్ణయ సాధికార సంస్థ (ఎన్‌.పి.పి.ఎ) ద్వారా, అన్ని రాష్ట్రాలతో వారి నోడల్ అధికారుల ద్వారా, అదేవిధంగా  తయారీ సంస్థలతో వారి అనుసంధాన కార్యాలయాల ద్వారా నిరంతరం సంప్రదిస్తోంది. 

ఇంతవరకు పేర్కొన్న కేటాయింపులతో పాటు, 16.05.2021 తేదీ నాటికి, ఇతర దేశాలు / సంస్థల నుండి విరాళంగా స్వీకరించిన మొత్తం 5.26 లక్షల "రెమ్‌డెసివిర్" వైల్స్ తో పాటు వాణిజ్యపరంగా దిగుమతి చేసుకున్న 40,000 వైల్స్ కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించడం జరిగింది. 

 

*****


(Release ID: 1719434) Visitor Counter : 230