ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
26 రోజుల తరువాత 3 లక్షల లోపుకు పడిపోయిన రోజువారీ కోవిడ్ కేసులు
గత 24 గంటల్లో 15.37 లక్షల పరీక్షలతో వారపు పాజిటివిటీ శాతం 18.17%కు తగ్గుదల
Posted On:
17 MAY 2021 12:08PM by PIB Hyderabad
గత 26 రోజులలో మొదటి సారిగా రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 3 లక్షల దిగువకు పడిపోవటం ఆశాజనక పరిణామం. గత 24 గంటల్లో 2,81,386 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.ఈ నెల 9 వ తేదీ నూమ్చి కొత్త కెసులు తగ్గిముఖం పట్టటాన్ని ఈ దిగువ చిత్రపటం చూపుతుంది..
వారపు పాజిటివిటీ శాతం తగ్గటాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు 18.17% నమోదైనట్టు క్రింది చిత్రపటం చూపుతోంది. గత 24 గంటలలో జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 15,73,515 కాగా, ఇప్పటిదాకా దేశమంతటా జరిపిన మొత్తం పరీక్షలు 31,64,23,658
రాష్ట్రాలవారీగా అత్యధిక స్థాయిలో పాజిటివ్ కెసులు నమోదవుతున్న జిల్లాల వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి. కర్నాటకలో అత్యధికంగా 27 జిల్లాల్లో 20% పైగా పాజిటివిటీతో కేసులు ఎక్కువగా వస్తుండగా మధ్య ప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో 38 జిల్లాల్లో 10% మించి పాజిటివిటీ నమోదవుతోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారినుంచి కోలుకున్నవారి సంఖ్య 2,11,74,076కు చేరింది. అందువలన జాతీయ స్థాయి కోలుకున్నవారి శాతం 84.81% అయింది. గత 24 గంటలలో 3,78,741 మంది కోలుకున్నారు. అదే సమయంలో కొత్త కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం గత 7 రోజుల్లో 6 సార్లు కాగా వరుసగా నాలుగురోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది.
కొత్తగా కోలుకున్నవారిలో 71.35% మంది పది రాష్ట్రాలకు చెందినవారు.
మరోవైపు దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గి 35,16,997 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 14.09%. గత 24 గంటలలో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య నికరంగా 1,01,461 కేసుల తగ్గుదల నమొదు చేసుకుంది. ఇందులో పది రాష్ట్రాల వాటా 75.04% ఉంది.
దేశవ్యాప్తంగా మూడో విడత టీకాల కార్యక్రమం కూదా మొదలవటంతో ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కోవిడ్ డోసులు దాదాపు 18.30 కోట్లకు చేరాయి.
ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం మొత్తం 18,29,26,460 డోసులను 26,68,895 శిబిరాల ద్వారా పంపిణీచేశారు. అందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 96,45,695 మొదటి డోసులు, 66,43,661 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,44,44,096 మొదటి డోసులు, 81,96,053 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారికిచ్చిన 52,64,073 మొదటి డోసులు, 45-60 వయోవర్గానికిచ్చిన 5,72,78,554 మొదటి డోసులు, 91,07,311 రెండో డోసులు, 60 పైబడ్డవారికిచ్చిన 5,45,15,352 మొదటి డోసులు, 1,78,01,891 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
96,45,695
|
రెండో డోస్
|
66,43,661
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,44,44,096
|
రెండో డోస్
|
81,96,053
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
52,64,073
|
45 -60వయోవర్గం
|
మొదటి డోస్
|
5,72,78,554
|
రెండో డోస్
|
91,07,311
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,45,15,352
|
రెండో డోస్
|
1,78,31,665
|
|
మొత్తం
|
18,29,26,460
|
దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసులలో పది రాష్టాలవాటా 66.73% ఉంది.
18-44 వయోవర్గానికి చెందిన 4,35,138 మంది లబ్ధిదారులు గత 24 గంటలలో మొదటి డోస్ అందుకున్నారు. దీంతో 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ వయోవర్గంలో టీకాలు తీసుకున్నవారి మొత్తం సంఖ్య 52,64,073 కు చేరింది. ఆ సమాచారం ఈ క్రింది పట్టికలో ఉంది.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొత్తం
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
1,181
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
3,443
|
3
|
అస్సాం
|
2,29,233
|
4
|
బీహార్
|
7,36,144
|
5
|
చండీగఢ్
|
2,078
|
6
|
చత్తీస్ గఢ్
|
1,028
|
7
|
దాద్రా, నాగర్ హవేలి
|
4,291
|
8
|
డామన్, డయ్యూ
|
4,703
|
9
|
ఢిల్లీ
|
6,39,929
|
10
|
గోవా
|
7,929
|
11
|
గుజరాత్
|
5,12,290
|
12
|
హర్యానా
|
4,55,205
|
13
|
హిమాచల్ ప్రదేశ్
|
14
|
14
|
జమ్మూకశ్మీర్
|
31,204
|
15
|
జార్ఖండ్
|
1,09,245
|
16
|
కర్నాటక
|
1,14,539
|
17
|
కేరళ
|
2,398
|
18
|
లద్దాఖ్
|
570
|
19
|
మధ్యప్రదేశ్
|
1,81,735
|
20
|
మహారాష్ట్ర
|
6,52,119
|
21
|
మేఘాలయ
|
5,712
|
22
|
నాగాలాండ్
|
4
|
23
|
ఒడిశా
|
1,40,558
|
24
|
పుదుచ్చేరి
|
3
|
25
|
పంజాబ్
|
6,959
|
26
|
రాజస్థాన్
|
8,16,241
|
27
|
సిక్కిం
|
350
|
28
|
తమిళనాడు
|
32,645
|
29
|
తెలంగాణ
|
500
|
30
|
త్రిపుర
|
2
|
31
|
ఉత్తరప్రదేశ్
|
4,15,179
|
32
|
ఉత్తరాఖండ్
|
1,22,916
|
33
|
పశ్చిమ బెంగాల్
|
33,726
|
మొత్తం
|
52,64,073
|
గత 24 గంటలలో దాదాపు 7 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాలు మొదలైన 121వ రోజైన మే 16 నాడు 6,91,211 టీకాలు 6,068 శిబిరాల ద్వారా ఇవ్వగా అందులో 6,14,286 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 76,925 మంది రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: మే 16, 2021 (121వ రోజు)
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
3,270
|
రెండవ డోస్
|
2,395
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
18,168
|
రెండవ డోస్
|
9,077
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
4,35,138
|
45 -60 వయోవర్గం
|
మొదటి డోస్
|
1,13,616
|
రెండవ డోస్
|
37,979
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
44,094
|
రెండవ డోస్
|
27,474
|
మొత్తం
|
మొదటి డోస్
|
6,14,286
|
రెండవ డోస్
|
76,925
|
తాజాగా నిర్థారణ అయిన కరోనా కేసుల్లో 75.95% పది రాష్ట్రాలకు చెందినవే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 34,389 కేసులు, ఆ తరువాత స్థానంలో ఉన్న తమిళనాడులో 33,181 కేసులు నమోదయ్యాయి.
జాతీయ స్థాయిలో మరణాల శాతం 1.10% గా నమోదంది. గత 24 గంటలలో 4,106 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాల వాటా 75.38% ఉండగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 974 మంది, కర్నాటకలో 403 మంది కోవిడ్ తో చనిపోయారు .
విదేశీ సాయానికి తోడుగా సహాయ సామగ్రిని అత్యంత వేగంగా రాష్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా దాకా మొత్తం 11,058 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 13,496 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 7,365 వెంటిలేటర్లు; దాదాపు 5.3 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ పంపిణీ కొనసాగుతోంది.
****
(Release ID: 1719320)
Visitor Counter : 227
Read this release in:
Hindi
,
Marathi
,
Gujarati
,
Tamil
,
Malayalam
,
Urdu
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Punjabi