ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయంగా లభించిన సహాయాన్ని భారత ప్రభుత్వం వేగంగా స్వీకరించి, వెంటనే కేటాయించడంతో, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, కోవిడ్ నిర్వహణ కోసం కొనసాగిస్తున్న అత్యాధునిక వైద్య సంరక్షణ మరింత బలోపేతం అయ్యింది.


రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం, ఇంతవరకు, 9,284 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు; 7,033 ఆక్సిజన్ సిలిండర్లు; 19 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు; 5,933 వెంటిలేటర్లు / బి-పి.ఏ.పి. లతో పాటు దాదాపు 3.44 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు పంపిణీ / రవాణా చేయడం జరిగింది.

Posted On: 12 MAY 2021 2:53PM by PIB Hyderabad

కోవిడ్ నిర్వహణ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశానికి మద్దతుగా, అంతర్జాతీయ విరాళాలు, కోవిడ్-19 ఉపశమన వైద్య సామాగ్రి, పరికరాల ద్వారా, 2021 ఏప్రిల్, 20వ తేదీ నుంచి భారతదేశం పట్ల సద్భావన స్ఫూర్తితో, అంతర్జాతీయ సమాజం, సహాయం చేస్తోంది. 

దేశంలో అసాధారణంగా పెరుగుతున్న కోవిడ్ వ్యాప్తి ని అరికట్టడానికి  భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను పెంపొందించడానికి, వివిధ దేశాలు / సంస్థల నుండి లభిస్తున్న అంతర్జాతీయ సహాయాన్ని వేగంగా అందించడానికి, భారతదేశంలోని వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు "మొత్తం ప్రభుత్వం" అనే విధానం క్రింద క్రమబద్ధీకరించబడిన, సమగ్ర యంత్రాంగం ద్వారా సజావుగా సహకరిస్తున్నాయి. 

2021 ఏప్రిల్,  27వ తేదీ నుంచి 2021 మే, 11వ తేదీ వరకు రోడ్డు మరియు విమాన మార్గాల ద్వారా, మొత్తం మీద, 9,284 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు; 7,033 ఆక్సిజన్ సిలిండర్లు; 19 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు; 5,933 వెంటిలేటర్లు / బి-పి.ఏ.పి. లతో పాటు దాదాపు 3.44 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు  పంపిణీ / రవాణా చేయడం జరిగింది.

యు.కె; ఈజిప్ట్; కువైట్; దక్షిణ కొరియా దేశాల నుంచి 2021 మే, 11వ తేదీన అందుకున్న ప్రధాన వస్తువులు:

*      ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్లు: 30 + 50 = 80

*      ఆక్సిజన్ సిలిండర్లు: 300 + 1,290 = 1,590

*      వెంటిలేటర్లు / బి-పిఏ.పి. / సి-పి.ఏ.పి. : 20

దేశంలోని వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయ సామాగ్రిని వెంటనే సమర్థవంతంగా కేటాయించి, సక్రమంగా రవాణా చేసే విధంగా మొత్తం ప్రక్రియను క్రమం తప్పకుండా సమగ్రంగా పర్యవేక్షించడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.  విదేశాల నుండి కోవిడ్ సహాయం కోసం గ్రాంట్లు, సహాయ సామగ్రి, విరాళాల రూపంలో అందుతున్న సహాయాన్ని స్వీకరించి, కేటాయింపులను సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమన్వయ కేంద్రం 2021 ఏప్రిల్, 26వ తేదీ నుంచి పనిచేయడం ప్రారంభించింది.  ఇందు కోసం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని రూపొందించి, 2021 మే, 2వ తేదీ నుంచి అమలు చేస్తోంది.

 

ఫోటో - 1 : కువైట్ నుంచి ఐ.ఎన్.ఎస్ కొచ్చి నౌకలో వచ్చిన, 60 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తో నింపిన 3 ఐ.ఎస్.ఓ. ఆక్సిజన్ ట్యాంకులతో పాటు, 800 ఆక్సిజన్ సిలిండర్లు, 2 హై-ఫ్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వైద్య ఉపశమన సామాగ్రిని, నిన్న న్యూ మంగుళూరు ఓడరేవు వద్ద దించారు. ఈ సామగ్రిని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయవలసి ఉంది. 

ఫోటో - 2 : కువైట్ నుంచి ఐ.ఎన్.ఎస్. టాబర్ నౌకలో వచ్చిన, 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తో నింపిన 2 ఐ.ఎస్.ఓ. ఆక్సిజన్ ట్యాంకులతో పాటు, 600 ఆక్సిజన్ సిలిండర్ల వంటి వైద్య ఉపశమన సామాగ్రిని, నిన్న న్యూ మంగుళూరు ఓడరేవు వద్ద దించారు. ఈ సామగ్రిని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయవలసి ఉంది. 

ఫోటో - 3 : అమెరికాకు నుంచి 78,595 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, నిన్న రాత్రి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నాయి.  వీటిని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారు.

*****


(Release ID: 1718170) Visitor Counter : 212