ప్రధాన మంత్రి కార్యాలయం

భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే త్శెరింగ్ కు, ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ

प्रविष्टि तिथि: 11 MAY 2021 12:53PM by PIB Hyderabad

భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే త్శెరింగ్ తో ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగళవారం నాడు టెలిఫోన్ లో మాట్లాడారు.

కోవిడ్-19 మహమ్మారి తాలూకు ఇటీవలి వేవ్ కు వ్యతిరేకం గా భారతదేశం  ప్రజలు, భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కు భూటాన్ ప్రధాని సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.  భూటాన్ ప్రజలు, భూటాన్ ప్రభుత్వం తెలిపిన సమర్థన కు, వ్యక్తం చేసిన శుభాకాంక్షల కు ప్రధాన మంత్రి తన హృద‌యపూర్వక ధన్యవాదాలను తెలిపారు.
 
ప్రపంచవ్యాప్త వ్యాధి కి వ్యతిరేకంగా భూటాన్ సాగిస్తున్న పోరాటాన్ని సంబాళించడం లో మాన్య శ్రీ రాజు గారి నాయకత్వాన్ని కూడా ఆయన అభినందిస్తూ, ఆ కృషి అలాగే కొనసాగాలంటూ లాయిన్ ఛిన్ కు తన శుభాకాంక్షలను తెలిపారు.
 
పరస్పర అవగాహన, పరస్పర ఆదరణ, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, ప్రజల కు ప్రజలకు మధ్య దృఢమైన సంబంధాల ఆధారం గా భారతదేశానికి, భూటాన్ కు మధ్య ఏర్పడ్డ ప్రత్యేకమైనటువంటి మైత్రి ని ప్రస్తుత సంకట స్థితి లో మరింత బలపర్చుకోవచ్చని నేత లు గుర్తించారు.

 


 

***


(रिलीज़ आईडी: 1717658) आगंतुक पटल : 344
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam