ఆర్థిక మంత్రిత్వ శాఖ

25 రాష్ట్రాల్లో పంచాయతీలకు 8923.8 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్రం


కోవిడ్-19 నేపథ్యంలో ముందుగానే గ్రాంటుల విడుదల

Posted On: 09 MAY 2021 10:35AM by PIB Hyderabad

గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంటులను అందించడానికి నిన్న 25 రాష్ట్రాలకు ఆర్ధిక మంత్రిత్వశాఖ ఖర్చుల విభాగం 8,923.8 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామబ్లాకుజిల్లా స్థాయిల్లో పనిచేస్తున్న పంచాయతీ రాజ్ సంస్థలకు ఈ నిధులను కేటాయించడం జరుగుతుంది. 

'ఆన్ టైడ్ గ్రాంటులు'గా 2021-22లో విడుదల చేయనున్న నిధుల్లో శనివారం తొలి విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులను కోవిడ్-19 నివారణకట్టడికి అమలు చేసే కార్యక్రమాలు ఇతర అవసరాల కోసం గ్రామీణ స్థానిక సంస్థలు వినియోగించవలసి ఉంటుంది. సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైన నిధులను అందుబాటులో ఉంచడానికి ఈ గ్రాంటులను విడుదల చేశారు. రాష్ట్రాలవారీగా విడుదల అయిన నిధుల వివరాలు కింద పొందుపరచబడ్డాయి. 

15 ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 'ఆన్ టైడ్ ' గ్రాంటులను 2021 జూన్ నెలలో విడుదల చేయవలసి వుంది. అయితేదేశంలో నెలకొన్న కోవిడ్-19 పరిస్థితిపంచాయతీరాజ్ శాఖ సిఫార్సుల మేరకు నిర్ణీత కాలం కంటే ముందుగానే నిధులను విడుదల చేయాలని ఆర్ధిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది. 

  'ఆన్ టైడ్ ' గ్రాంటుల విడుదల కోసం 15వ ఆర్ధిక సంఘం విధించిన నిబంధనలను కూడా కేంద్రం సడలించింది. 15వ ఆర్ధిక సంఘం నిబంధనల మేరకు గ్రామీణ స్థానిక సంస్థల నిధుల్లో కొంత శాతాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఆన్ లైన్ లో అందుబాటులోవుంచవలసి ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తొలి విడత నిధుల విడుదల కోసం కేంద్ర ఈ నిబంధనను సడలించింది.   

 

 

రాష్ట్రాలవారీగా 2021-22 సంవత్సరానికి గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల అయిన మొదటి విడత గ్రాంటులు 

ఎస్.

రాష్ట్రం పేరు

మొత్తం (కోట్ల రూ.లలో)

1

ఆంధ్రప్రదేశ్

387.8

2

అరుణాచల్ ప్రదేశ్

34

3

అస్సాం

237.2

4

బీహార్

741.8

5

ఛత్తీస్ ఘర్

215

6

గుజరాత్

472.4

7

హర్యానా

187

8

హిమాచల్ ప్రదేశ్

63.4

9

జార్ఖండ్

249.8

10

కర్ణాటక

475.4

11

కేరళ

240.6

12

మధ్యప్రదేశ్

588.8

13

మహారాష్ట్ర

861.4

14

మణిపూర్

26.2

15

మిజోరం

13.8

16

ఒడిశా

333.8

17

పంజాబ్

205.2

18

రాజస్థాన్

570.8

19

సిక్కిం

6.2

20

తమిళనాడు

533.2

21

తెలంగాణ

273

22

త్రిపుర

28.2

23

ఉత్తర ప్రదేశ్

1441.6

24

ఉత్తరాఖండ్

85

25

పశ్చిమ బెంగాల్

652.2

 

మొత్తం

8923.8

 

***(Release ID: 1717316) Visitor Counter : 220