ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

14 ఆక్సిజెన్ ప్లాంట్లు, 3 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు సహా అంతర్జాతీయ సాయం రాష్ట్రాలకు పంపిణీ


దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసులు దాదాపు 17 కోట్లు

18-44 వయోవర్గంలో 17.8 లక్షలకు పైగా టీకా లబ్ధిదారులు

గత 24 గంటలలో 3.8 లక్షలకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు

Posted On: 09 MAY 2021 12:01PM by PIB Hyderabad

భారత్ లో అనూహ్యంగా కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తూ ఉండటంతో ప్రపంచదేశాలు ఈ కోవిడ్ మహమ్మారిమీద పొరాడుతున్న భారత ప్రభుత్వానికి సహాయ హస్తం అందిస్తూ వస్తున్నాయి. ఇది నిరవధికంగా కొనసాగే ప్రక్రియ. ఈ క్లిష్ట సమయంలో ఈ విధంగా అందిన  సహాయాన్ని వివిధ మార్గాల ద్వారా అవసరమున్న అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది.  ఆ విధంగా ఈ క్లిష్ట సమయంలో రాష్టాలు చేస్తున్న కృషికి అండగా నిలబడుతోంది. 

ఇప్పటివరకూ 6,608  ఆక్సిజెన్ కాన్సంట్రేటర్ల్లు, 3,856  ఆక్సిజెన్ సిలిండర్లు, 14 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు, 4,330 వెంటిలేటర్లు, 3 లక్షలకు పైగా రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు అందజేశారు.

 

మూడో దశ టీకాల కార్యక్రమం మరింత విస్తరించటంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 16.94 కోట్లు దాటింది.

 

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

95,41,654

2వ డోస్

64,63,620

కోవిడ్ యోధులు

1వ డోస్

1,39,43,558

2వ డోస్

77,32,072

18-44 వయోవర్గం

1వ డోస్

17,84,869

45 - 60 వయోవర్గం

1వ డోస్

5,50,75,720

2వ డోస్

64,09,465

 60 పైబడ్డవారు

1వ డోస్

5,36,34,743

2వ డోస్

1,48,53,962

 

మొత్తం

16,94,39,663

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 66.78% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం. 

 

18-44 వయోవర్గానికి చెందిన 2,94,912 మంది లబ్ధిదారులు శనివారం నాడు మొదటి డోస్ టీకా తీసుకున్నారు. దీంతో ఈ వయోవర్గం మొత్తం 17,84,869 మంది 30 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో టీకాలు తీసుకున్నట్టయింది. ఈ వివరాలు దిగువ పట్టికలో ఉన్నాయి. 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్-నికోబార్ దీవులు

823

2

ఆంధ్రప్రదేశ్

519

3

అస్సాం

70,853

4

బీహార్

295

5

చండీగఢ్

2

6

చత్తీస్ గఢ్

1,026

7

ఢిల్లీ

3,01,483

8

గోవా

1,126

9

గుజరాత్

2,70,225

10

హర్యానా

2,30,831

11

హిమాచల్ ప్రదేశ్

14

12

జమ్మూ-కశ్మీర్

28,650

13

జార్ఖండ్

81

14

కర్నాటక

10,368

15

కేరళ

209

16

లద్దాఖ్

86

17

మధ్యప్రదేశ్

29,320

18

మహారాష్ట్ర

3,84,904

19

మేఘాలయ

2

20

నాగాలాండ్

2

21

ఒడిశా

41,929

22

పుదుచ్చేరి

1

23

పంజాబ్

3,529

24

రాజస్థాన్

2,71,964

25

తమిళనాడు

12,904

26

తెలంగాణ

500

27

త్రిపుర

2

28

ఉత్తరప్రదేశ్

1,17,821

29

ఉత్తరాఖండ్

19

30

పశ్చిమ బెంగాల్

5,381

మొత్తం

17,84,869

 

గత 24 గంటలలో 20 లక్షలకు పైగా టీ కా డోసులిచ్చారు. దేసవ్యాప్త తీకాల కార్యక్రమం మొదలైన 113వ రోజైన మే 8న 20,23,532 టీకాలివ్వగా అందులో  16,722 శిబిరాలద్వారా 8,37,695 మంది మొదటి డోస్,  11,85,837 మంది రెండో డోస్ తీసుకున్నారు. 

తేదీ : మే 8, 2021 (113వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

18,043

2వ డోస్

32,260

కోవిడ్ యోధులు

1వ డోస్

75,052

2వ డోస్

82,798

18-44 వయోవర్గం

1వ డోస్

2,94,912

45 -60 వయోవర్గం

1వ డోస్

3,25,811

2వ డోస్

5,23,299

60 పైబడ్డవారు

1వ డోస్

1,23,877

2వ డోస్

5,47,480

మొత్తం

1వ డోస్

8,37,695

2వ డోస్

11,85,837

 

 దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కొలుకున్నవారు 1,83,17,404 మంది కాగా కోలుకున్నవారి శాతం 82.15%.

గత 24 గంటలలో 3,86,444 కోవిడ్ నుంచి కొలుకొని బైటపడ్దారు.

వీరిలో  75.75% మంది పది రాష్ట్రాలకు చెందినవారు కావటం గమనార్హం.

గడిచిన 24 గంటలలో 4,03,738 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాల వాటా 71.75%. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో   56,578 కొత్త కేసులు రాగా కర్నాటకలో 47,563, కేరళలో  41,971 వచ్చాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటి దాకా30.22 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు జరిగాయి. ఇందులో పాజిటివిటీ శాతం  21.64% గా నమోదు కావటం ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు.

భారత్ లో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 37,36,648 కి చేరుకోగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 16.76%. గత 24 గంతలలో చికిత్సలో ఉన్న వారి సంఖ్య 13,202 పెరిగింది. చికిత్సలో ఉన్నవారిలో 82.94% వాటా 13 రాష్ట్రాలదే.

 

జాతీయ స్థాయిలో కోవిడ్ కేసులలో మరణాలు 1.09% కాగా గత 24 గంటలలో 4,092 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇందులో 74.93% వాటా పది రాష్ట్రాలదే. మహారాష్టలో అత్యధికమ్గా ఒక్క రోజులో 864 మంది చనిపోగా కర్నాటకలో 482 మంది చనిపోయారు.

ప్రతి పది లక్షల కేసులలో కోవిడ్ మరణాలు జాతీయ స్థాయిలో 176 కాగా 20 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అంతకంటే తక్కువ నమోదయ్యాయి.

 

ప్రతి 10 లక్షల కేసుల్లో కోవిడ్ మరణాలు జాతీయ స్థాయికి మించి 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి.

గత 24 గంటలలో ఒక కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు: డామన్-డయ్యూ, దాద్రా, నాగర్ హవేలి, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, లక్షదీవులు.

***


(Release ID: 1717289) Visitor Counter : 266