సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
01.06.202 నుండి తప్పనిసరిగా యుడీఐడీ పోర్టల్ ద్వారానే దివ్యాంగుల ఆన్‌లైన్ ధ్రువీకరణ
Posted On:
06 MAY 2021 2:50PM by PIB Hyderabad
భారత ప్రభుత్వపు దివ్యాంగుల సాధికారత శాఖ (డీఈపీడబ్ల్యుడీ), 05.05.2021 తేదీన గెజిట్ నోటిఫికేషన్ ఎస్ఓ 1736 (ఈ) ని జారీ చేసింది. దీని ప్రకారం అన్ని రాష్ట్రాలు / యుటీలు యుడీఐడీ పోర్టల్ ఉపయోగించి మాత్రమే ఆన్‌లైన్ విధానం ద్వారా దివ్యాంగ ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేయలని పేర్కొంది. దీనిని 01.06.2021 నుండి తప్పనిసరి చేసింది. దివ్యాంగుల
హక్కులకు సంబంధించి ఆర్‌పీడబ్ల్యుడీ చట్టం- 2016 కింద డిజేబులిటీ రూల్స్-2017ను కేంద్ర ప్రభుత్వం 15.06.2017న నోటిఫై చేసింది. ఇందులోని రూల్ 18(5) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం / యుటీ అధికారులు ఆన్‌లైన్ విధానంలో వైకల్యం యొక్క ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడం తప్పనిసరి చేసేందుకు.. సంబంధించి ఒక నిర్ధష్టమైన తేదీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రుత్వ శాఖ నేతృత్వంలోని దివ్యాంగుల
కేంద్ర సలహా బోర్డు 26.11.2020న జరిపిన చివరి సమావేశం ఈ అంశాన్ని చర్చించింది. 01.04.2021 నుండి ఆన్‌లైన్ దివ్యాంగత అంశం ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ సిఫారసు చేసింది. అయితే మార్చి-ఏప్రిల్,2021 మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాలు / యుటీలలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆన్‌లైన్ ధ్రువీకరణ ఇప్పుడు 01.06.2021 నుండి తప్పనిసరి చేయబడింది. ఆయా రాష్ట్రాలు / యుటీలలో దివ్యాంగుల విషయాలను పర్యవేక్షించి ఆరోగ్య శాఖ, ఇతర డిపార్ట్‌మెంట్ల వారు ఈ నోటిఫికేషన్ యొక్క సమ్మతిని నిర్ధారించడానికి తక్షణ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. యుడీఐడీ ప్రాజెక్ట్ 2016 నుండి అమలులో ఉంది. యుడీఐడీ పోర్టల్ (www.swavlambancard.gov.in) లో పనిచేసేందుకు వీలుగా అన్ని రాష్ట్రాలు / యుటీలకు చెందిన సంబంధిత డీఈపీడబ్ల్యుడీ అధికారులకు శిక్షణ ఇచ్చింది. ఆన్‌లైన్ మోడ్‌కు మార్చడానికి రాష్ట్రాలు/ యుటీలకు తగిన సమయం ఇవ్వబడింది. ఇది 01.06.2021 నుండి దివ్యాంగత యొక్క ధ్రువీకరణ యొక్క పూర్తి డిజిటలైజేషన్‌ను నిర్ధారిస్తుంది, దేశ వ్యాప్తంగా ప్రామాణికతను సాధించడానికి సర్టిఫికేట్ యొక్క వాస్తవికతలను సరిపోల్చుకోవడానికి ఆచరణీయమైన యంత్రాంగాన్ని అందించడంతో పాటు, దివ్యంగనుల ప్రయోజనం కోసం ప్రక్రియను సరళీకృతం చేస్తుంది.
******
(Release ID: 1716560)
Visitor Counter : 252