ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 పట్ల ప్రజారోగ్య విభాగం తాలూకు ప్రతిస్పందన ను సమీక్షించిన ప్రధాన మంత్రి
రాష్ట్రం వారీ కోవిడ్ స్థితి ని, జిల్లా వారీ కోవిడ్ స్థితి ని సమీక్షించిన ప్రధాన మంత్రి
ఆరోగ్య సంరక్షణ రంగ మౌలిక సదుపాయాల ను పెంచడానికి గాను తోడ్పడే ప్రముఖ సూచిక ల విషయం లో రాష్ట్రాల కు సాయపడాలని, మార్గదర్శనం చేయాలని ఆదేశించిన ప్రధాన మంత్రి
మందుల అందుబాటు పై సమీక్ష ను నిర్వహించిన ప్రధాన మంత్రి
భారతదేశం లో ప్రజల కు టీకా మందు ను ఇప్పిస్తున్న కార్యక్రమాన్ని సమీక్షించిన ప్రధాన మంత్రి
టీకా మందు ను ఇప్పించే కార్యక్రమం వేగం తగ్గిపోకుండా చూడాలంటూ రాష్ట్రాల కు సర్దిచెప్పవలసిన అవసరం ఉంది: ప్రధాన మంత్రి
Posted On:
06 MAY 2021 2:51PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశం లో కోవిడ్-19 కి సంబంధించిన స్థితి ని గురువారం సమగ్రం గా సమీక్షించారు. వివిధ రాష్ట్రాల లో, వివిధ జిల్లాల లో కోవిడ్ వ్యాప్తి ని గురించి ఆయన కు విస్తృతం గా తెలియజేయడమైంది. ఒక లక్ష కు పైబడిన యాక్టివ్ కేసు లు ఉన్న 12 రాష్ట్రాల ను గురించి ఆయన దృష్టి కి తీసుకు రావడం జరిగింది. వ్యాధి తాకిడి బాగా అధికం గా ఉన్న జిల్లాలేవేవన్న సమాచారాన్ని కూడా ఆయన కు ఇవ్వడమైంది.
ఆరోగ్య సంరక్షణ రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను రాష్ట్రాలు ఏ విధంగా పెంచుతోందీ ప్రధాన మంత్రి కి వివరించడం జరిగింది. ఈ విషయం లో ప్రధాన సంకేతాల విషయం లో రాష్ట్రాల కు సహాయం చేయాలని, మార్గదర్శనాన్ని అందించాలని ప్రధాన మంత్రి ఆదేశించారు.
వ్యాధి ని త్వరగాను, సంపూర్ణం గాను అదుపు లో ఉంచడానికి తగ్గ చర్యల ను తీసుకోవలసిన అవసరాన్ని గురించి కూడా చర్చించడం జరిగింది. పాజిటివ్ కేసు లు 10 శాతం గా గాని, లేదా అంతకంటే ఎక్కువ గా గాని ఉన్న జిల్లాల ను గుర్తించడం కోసం, ప్రాణవాయువు సహాయక వ్యవస్థ ను జత చేసిన పడకలు గాని, లేదా ఐసియు పడకలు గాని నిండిపోవడం అనేది 60 శాతం కంటే మించిపోయిన సమస్య అధికం గా గల జిల్లాల ను గుర్తించడం కోసం రాష్ట్రాల కు ఒక అడ్వయిజరీ ని పంపించడం జరిగిందన్న సంగతి ని ప్రధాన మంత్రి తెలుసుకొన్నారు.
మందులు ఏ మేరకు అందుబాటు లో ఉంటున్నదీ కూడా ప్రధాన మంత్రి సమీక్ష జరిపారు. రెమ్ డెసివిర్ సహా ఔషధాల ఉత్పత్తి ని శరవేగం గా పెంచుతున్న విషయాన్ని ఆయన కు తెలియజేయడమైంది.
టీకా మందు ను ఇప్పిస్తున్న కార్యక్రమం లో పురోగతి ని, రాబోయే నెలల్లో టీకా మందుల ఉత్పత్తి ని పెంచేందుకు సిద్ధం చేసిన మార్గ సూచీ ని ప్రధాన మంత్రి సమీక్షించారు. సుమారు 17.7 కోట్ల టీకా మందుల ను రాష్ట్రాల కు సరఫరా చేయడమైందని ఆయన కు తెలియజేయడమైంది. వ్యాక్సీన్ వృథా అంశం లో రాష్ట్రం వారీ స్థితిగతుల ను కూడా ప్రధాన మంత్రి సమీక్షించారు. 45 ఏళ్ల పైబడిన వయస్సు కలిగిన అర్హులైన జనాభా లో దాదాపు గా 31 శాతం మంది కి కనీసం ఒక డోసు ను ఇచ్చినట్లు ప్రధాన మంత్రి కి వివరించడమైంది. ప్రజల కు టీకా మందు ను వేయించే కార్యక్రమం లో జోరు తగ్గిపోకుండా చూడవలసిందంటూ రాష్ట్రాల కు సర్దిచెప్పవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. లాక్ డౌన్ లు ఉన్నప్పటికీ టీకా మందు ను తీసుకొనేటట్టుగా పౌరుల కు మార్గాన్ని సుగమం చేయాలని, వ్యాక్సీనేశన్ విధుల ను నిర్వహిస్తున్న ఆరోగ్య సంరక్షణ శ్రమికులను ఇతర విధుల కు మళ్లించనే కూడదని ఆయన సూచించారు.
ఈ సమావేశం లో శ్రీయుతులు రాజ్ నాథ్ సింహ్, అమిత్ శాహ్, నిర్మల సీతారమణ్, డాక్టర్ హర్ష్ వర్ధన్, పీయూష్ గోయల్, మన్ సుఖ్ మాండవియాల తో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1716543)
Visitor Counter : 216
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam