ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
ఆర్థిక వ్యవహారాల పై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సిసిఇఎ)
ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ లో పెట్టుబడి వ్యూహాత్మక ఉపసంహరణ కు, నిర్వహణపరమైన నియంత్రణ బదలాయింపునకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
05 MAY 2021 4:02PM by PIB Hyderabad
ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ లో పెట్టుబడి వ్యూహాత్మక ఉపసంహరణ తో పాటు నిర్వహణపరమైన నియంత్రణ బదలాయింపునకు కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన పనిచేస్తున్న ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) సైద్ధాంతిక ఆమోదాన్ని ఇచ్చింది. భారత ప్రభుత్వం (జిఒఐ), జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) ల ద్వారా విక్రయించే వాటి వాటి వంతు వాటాల పరిమితి ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బిఐ) తో సంప్రదించిన మీదట ఈ లావాదేవీ కి తగిన స్వరూపాన్ని ఖరారు చేసే వేళ లో నిర్ణయించడం జరుగుతుంది.
ఐడిబిఐ బ్యాంకు ఎక్విటి లో భారత ప్రభుత్వం, ఎల్ఐసి లు కలిసికట్టుగా 94 శాతానికి పైగా (ప్రభుత్వం చేతి లో 45.48 శాతం, ఎల్ఐసి చేతిలో 49.24 శాతం) కలిగి ఉన్నాయి. ఎల్ఐసి యే ప్రస్తుతం ఐడిబిఐ బ్యాంకు లో నిర్వహణ పరమైన నియంత్రణ ను కలిగివున్న ప్రమోటరు గా ఉండగా, భారత ప్రభుత్వం కో- ప్రమోటరు గా ఉంది.
ఐడిబిఐ బ్యాంకు లిమిటెడ్ లో ప్రభుత్వం తో కలసి వ్యూహాత్మక వాటా విక్రయం పద్ధతి లో ఎల్ఐసి తన వాటా ను తగ్గించుకోవచ్చంటూ ఒక తీర్మానాన్ని ఎల్ఐసి బోర్డు ఆమోదించింది. ఈ క్రమం లో బ్యాంకు తాలూకు నిర్వహణ పరమైన నియంత్రణ ను విడిచిపెట్టుకోవాలనేది ఈ సంస్థ భావన గా ఉంది. ఈ ప్రక్రియ లో ధర, మార్కెట్ అవుట్ లుక్, చట్టపరమైన షరతులు వంటి వాటితో పాటు పాలిసిదారుల హితాల ను కూడా ఎల్ఐసి పరిశీలన లోకి తీసుకోవలసి ఉంటుంది.
ఎల్ఐసి బోర్డు తీసుకొన్నటువంటి ఈ నిర్ణయం బ్యాంకు లో ఎల్ఐసి తన భాగస్వామ్యాన్ని తగ్గించుకోవాలన్న రెగ్యులేటరీ మేండేటు కు అనుగుణం గా కూడా ఉంది.
ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ లో వ్యూహాత్మక కొనుగోలుదారు సంస్థ నిధుల ను అందించడంతో పాటు, బ్యాంకు తాలూకు వ్యాపార అవకాశాల ను తగినంత మేర కు పెంచి, బ్యాంకు వృద్ధి కి గాను అవసరమైన కొత్త సాంకేతికత ను, ఉత్తమ నిర్వహణ అభ్యాసాల ను తోడు తీసుకు వస్తుందన్న అంచనా ఉంది. అది మాత్రమే కాక, ఎల్ఐసి పైన గాని, ప్రభుత్వ ఆర్థిక సహాయం/నిధుల పైన గాని ఆధారపడకుండానే అధికతమ వ్యాపారాన్ని సాధించాలన్న అంచనా కూడా ఉంది. ప్రభుత్వ ఎక్విటి ని వ్యూహాత్మక రీతి లో ఉపసంహరించుకొనేందుకు సంబంధించిన లావాదేవీ ద్వారా వచ్చే నిధుల ను పౌరుల కు లాభదాయకం గా ఉండేటట్టు అభివృద్ధియుత కార్యక్రమాల కు ఆర్థికసాయాన్ని అందించడానికి వినియోగించడం జరుగుతుంది.
***
(Release ID: 1716541)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam