రైల్వే మంత్రిత్వ శాఖ

ఈ రోజు, ఢిల్లీకి, చేరనున్న మరో 244 టన్నుల - ఆక్సిజన్; ఈ రోజు తెల్లవారుజామున బట్వాడా చేసిన వీటితో కలిసి, గత 24 గంటల్లోనే, ఢిల్లీకి దాదాపు 450 మెట్రిక్ టన్నుల ఎల్‌.ఎం.ఓ. ను రవాణా చేసిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

103 ట్యాంకర్ల లో 1,585 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఎల్.ఎం.ఓ. పంపిణీ చేస్తూ తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న - 27 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

తెలంగాణకు - మరో 60 మెట్రిక్ టన్నులు

హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు, 33 ట్యాంకర్ల లో, 463 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. ను తీసుకువెళ్తూ దారిలో ఉన్న - 6 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రైళ్ళు

లక్నోకు సుమారు 117 టన్నులతో; ఫరీదాబాద్ కు 79 టన్నులతో; జబల్పూర్ కు 23 టన్నులతో బయలుదేరి మార్గ మధ్యలో ఉన్న - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు


శతాబ్దానికి ఒకసారి వచ్చే సవాలుతో దేశం పోరాటం చేస్తున్న నేపథ్యంలో, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ అవసరాలను తీర్చడంలో నిమగ్నమైన - రైల్వే శాఖ

Posted On: 04 MAY 2021 4:53PM by PIB Hyderabad

అన్ని అడ్డంకులను అధిగమించి, నూతన పరిష్కారాలను అన్వేషిస్తూ, భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) ను పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు, భారత రైల్వే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు, 103 ట్యాంకర్ల లో సుమారు 1,585 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. ను రవాణా చేసింది.  27 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు, ఇప్పటికే తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని, గమ్యస్థానాలకు చేరుకున్నాయి.  సుమారు 463 మెట్రిక్ టన్నుల ఎల్‌.ఎం.ఓ. తో నిండిన 33 ట్యాంకర్లతో, మరో 6 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు మార్గ మధ్యలో ఉన్నాయి. 

ఎల్.ఎం.ఓ. ను అభ్యర్థించే రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ సమయంలో, వీలైనంత ఎక్కువ పరిమాణంలో అందించాలన్న లక్ష్యంతో, భారత రైల్వే శాఖ కృషి చేస్తోంది. 

244 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ తో హపా మరియు ముంద్రా నుండి మరో రెండు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు మార్గ మధ్యలో ఉన్నాయి. ఇవి ఈ రోజే ఢిల్లీ కి చేరుకోనున్నాయి.   ఈ రోజు మరో రెండు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ లు ఢిల్లీ కి చేరుకోవడంతో, మే నెల 4వ తేదీ తెల్లవారుజాము నుండి 24 గంటల సమయంలో ఢిల్లీకి దాదాపు 450 మెట్రిక్ టన్నుల ఎల్‌.ఎం.ఓ. పంపిణీ జరిగినట్లు అవుతుంది. 

ఈ రోజు రైల్వేలు రవాణా చేస్తున్న మొత్తం 382 మెట్రిక్ టన్నుల ఎల్‌.ఎం.ఓ. లో, దాదాపు 244 మెట్రిక్ టన్నులు, అంటే,  ఈ రోజు పంపిణీ చేస్తున్న మొత్తం పరిమాణంలో దాదాపు 64 శాతం, ఢిల్లీ కి ఉద్దేశించబడింది. 

అంగల్ నుండి 60.23 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. తో రెండవ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణా కు చేరుకుంది.

బొకారో నుండి 70 టన్నులతో బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్, ఈరోజు లక్నో చేరనుంది. 

ఇప్పటివరకు, భారతీయ రైల్వే, మహారాష్ట్రకు 174 మెట్రిక్ టన్నులు;   ఉత్తరప్రదేశ్ కు 492 మెట్రిక్ టన్నులు; మధ్యప్రదేశ్ కు 179 మెట్రిక్ టన్నులు; ఢిల్లీ కి 464 మెట్రిక్ టన్నులు; హర్యానా కి 150 మెట్రిక్ టన్నులు; తెలంగాణా కి 127 మెట్రిక్ టన్నులు చొప్పున మొత్తం 1,555 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) ను రవాణా చేసింది. 

*****(Release ID: 1716040) Visitor Counter : 222