వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పిఎమ్‌జికెఎ -3 కింద పంపిణీ కోసం భారత ఆహార సంస్థ డిపోల నుంచి ఆహార ధాన్యాలు తీసుకుంటున్న 28 రాష్ట్రాలు/ యుటిలు
80 కోట్లకు పైగా లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి 5.88 ఎల్‌ఎమ్‌టి ల ఆహార ధాన్యాలు సిద్ధం
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కార్యక్రమం కింద పోర్టబిలిటీ సౌకర్యాన్ని ఉపయోగించు కోవాలని వలస ఎన్ఎఫ్ఎస్ఏ లబ్ధిదారులను ప్రోత్సహించాలని రాష్ట్రాలు / యుటిలకు సూచన
రాష్ట్రాలు / యుటిలకు పిఎమ్‌జికెఎ -3 కింద 26,000 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆహార ధాన్యాల కేటాయింపు
మే-జూన్ కేటాయింపులను తీసుకున్న లక్షదీవులు
మే కేటాయింపులను 100% తీసుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Posted On:
04 MAY 2021 5:26PM by PIB Hyderabad
కోవిడ్-19 తిరిగి వ్యాపించడం వల్ల వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎంజికె) పథకం కింద సరఫరా అవుతున్న ఆహారధాన్యాలను అర్హులకు పంపిణీ చేయడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తమతమ ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఎన్ఎఫ్ఎస్ఏ కింద ప్రయోజనం పొందుతున్న పేదలు, ఇతర లబ్ధిదారులను ఆదుకోవడానికి 2021 మే, జూన్ నెలల్లో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర అఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయించింది.
పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి భారత ఆహార సంస్థ ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసింది. లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి 2021 మే మూడవ తేదీనాటికి 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 5.88 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలను భారత ఆహార సంస్థ గిడ్డంగుల నుంచి తరలించాయి. తమకు కేటాయించిన మే, జూన్ కేటాయింపులను లక్షదీవులు పూర్తిగా తరలించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు మే నెల కేటాయింపులను పూర్తిగా తరలించాయి.
పథకం కింద తమకు కేటాయించిన ఆహార ధాన్యాలను వేగంగా తరలించడానికి చర్యలు తీసుకోవాలని మిగిలిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ( పంజాబ్,చండీఘర్, గోవా, మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్,ఒడిశా, పుదుచ్చేరి) సూచనలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమం త్వరలో వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ప్రణాళిక కింద పోర్టబిలిటీ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు వలస వచ్చిన ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులను ప్రోత్సహించాలని రాష్ట్రాలు / యుటిలకు సూచించడం జరిగింది.
రాష్ట్రాలు / యుటిలపై భారం మోపకుండా ఎటువంటి భాగస్వామ్యం లేకుండా ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (మే-జూన్ 2021) పథకం మొత్తం ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తుంది.
ఈ ప్రత్యేక పథకం కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి వచ్చే రెండు తరగతులు- అంత్యోదయ అన్న యోజన, ప్రాధాన్యత కలిగిన గృహాల కింద సుమారు 80 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుంది. నెలవారీ కోటాపై మించి మనిషికి అయిదు కిలోల చొప్పున ఉచితంగా ఆహార ధాన్యాలు (బియ్యం / గోధుమలు)పంపిణీ చేస్తున్నారు.
***
(Release ID: 1715974)
Visitor Counter : 231