పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ జంతు ప్రదర్శన శాలలో సార్స్ -సిఒవి2 కు గురై కోలుకుంటున్న ఏసియాటిక్ సింహాలు.
వీటి నమూనాలను పరిశీలించినపుడు ఇన్‌ఫెక్షన్ ఆందోళనకు గురి చేసే మరే ఇతర వేరియంట్ వల్ల కాదని వెల్లడి.
జంతువులు ఈ వ్యాధిని మనుషులకు వ్యాప్తి చేస్తాయనడానికి ఎలాంటి వాస్తవిక ఆధారాలు లేవు.
Posted On:
04 MAY 2021 3:28PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో తమ వద్ద ఉన్న 8 ఏసియాటిక్ సింహాలకు శ్వాస సంబంధ ఇబ్బంది ఉన్నట్టు గమనించి వాటి ముక్కు గొంతు, శ్వాస నాళం నుంచి శాంపిళ్లను అత్యంత జాగ్రత్తగా సేకరించి సిసిఎంబి- లా కోన్స్‌కు పరీక్షల నిమిత్తం పంపారు. ఇందుకు సంబంధించి సవివరమైన పరీక్షలు నిర్వహించి సిసిఎంబి- లాకోన్స్ సంస్థ తమ నివేదికను 2021 మే 4 వ తేదీన సమర్పించింది. ఈ నివేదిక హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లోని 8 ఏసియాటిక్ సింహాలకు సార్స్ -సిఒవి 2 వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.
ఈ శాంపిళ్లను మరింతగా పరిశీలించిన అనంతరం వీటికి ఇన్‌ఫెక్షన్ మరే ఇతర వేరియంట్ ద్వారా రాలేదని తేలింది. ఎనిమిది సింహాలను ఐసొలేషన్ లో ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటికి అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. ఎనిమిది సింహాలూ చికిత్సకు బాగా స్పందిస్తూ కోలుకుంటున్నాయి. అవి సాధారణంగానే ప్రవర్తిస్తున్నాయి. ఆహారం తీసుకుంటున్నాయి.
జూ సిబ్బంది మొత్తానికి ముందస్తు సంరక్షణ చర్యలు చేపట్టారు. సందర్శకులను జంతు ప్రదర్శన శాలలోకి అనుమతించడం లేదు.
సెంట్రల్ జూ అథారిటీ ఇప్పటికే పలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు, సూచనలు జంతు ప్రదర్శనశాలలకు పంపింది. సార్స్ సిఒవి -2 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను జంతు ప్రదర్శన శాలలకు సూచించింది.
అనుమానిత కేసులకు సంబంధించి నియంత్రణ, నమూనాల సేకరణ, అనుమానిత కేసులలో వ్యాధి నిర్ధారణ, జంతు సంరక్షకులకు రక్షణ ప్రొటోకాల్స్ విషయమై శాస్త్రీయ ఏజెన్సీలు, నిపుణులు, భారత వెటరినరీ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ (ఐవిఆర్ఐ) ఉత్తరప్రదేశ్, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ లేబరెటరీ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ (సిసిఎంబి- లా కోన్స్ ) హైదరాబాద్ వారితో సంప్రదించి తగిన సూచనలు చేయడం జరిగింది.
ఇందుకు సంబంధించిన సూచనలు పబ్లిక్ డోమైన్‌లో అందుబాటులో ఉన్నాయి. http://cza.nic.in/news/en .
తదుపరి చర్యలలో భాగంగా కోవిడ్ ముందుజాగ్రత్త చర్యలకు సంబంధించి కొత్త చర్యలను నిపుణులతో చర్చించి తెలియజేయనున్నారు. అదనపు సమాచారాన్ని అవసరమైనపుడు జారీ చేస్తారు.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో జంతుప్రదర్శన శాల జంతువులకు గత ఏడాది సార్స్ -సిఒవి2 పాజిటివ్ సోకిన అనుభవాన్ని పరిగణన లోకి తీసుకున్నప్పుడు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాధి ఏంతమాత్రం సంక్రమించదని తేలింది. అందువల్ల మీడియా ఇలాంటి అంశాలను రిపోర్టు చేసే సమయంలో, అత్యంత సంయమనం పాటించి బాధ్యతాయుత కవరేజ్ ఇవ్వాలి.
***
(Release ID: 1715945)
Visitor Counter : 286