ప్రధాన మంత్రి కార్యాలయం

యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ గారి తో ఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 03 MAY 2021 2:09PM by PIB Hyderabad

యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న, అంటే సోమ‌వారం నాడు, టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.  
 
భార‌త‌దేశం లో, యూరోపియ‌న్ యూనియ‌న్ (ఇయు) లో ప్ర‌స్తుతం నెల‌కొన్న కోవిడ్‌-19 స్థితి తో పాటు, కోవిడ్-19 తాలూకు రెండో వేవ్ ను అదుపు లోకి తీసుకు రావ‌డం కోసం భార‌త‌దేశం చేస్తున్న ప్ర‌యత్నాల‌ ను గురించి నేత‌ లు ఇరువురు ఒక‌రి ఆలోచ‌న‌ల‌ ను మ‌రొక‌రికి తెలియజెప్పుకొన్నారు.  కోవిడ్‌-19 తాలూకు రెండో వేవ్ కు వ్య‌తిరేకం గా భార‌త‌దేశం చేస్తున్న యుద్ధానికి త‌క్ష‌ణ మ‌ద్ధ‌తు ను కూడ‌గ‌ట్టినందుకు ఇయు ను, ఇయు స‌భ్య‌త్వ దేశాల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు.  

జులై  లో జ‌రిగిన కడపటి శిఖర స‌మ్మేళ‌నం జరిగిన త‌రువాత నుంచి భార‌త‌దేశం-ఇయు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఒక స‌రి కొత్త వేగ‌ గ‌తి ని అందుకొంద‌ని వారు గుర్తించారు.  ఈ నెల 8 న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తి లో జ‌రుగ‌నున్న ఇండియా-ఇయు నేత‌ ల స‌మావేశం ఇప్ప‌టికే బ‌హు ముఖాలుగా విస్త‌రించిన‌టువంటి ఇండియా-ఇయు సంబంధాల కు ఒక స‌రి కొత్త జోరు ను అందించేందుకు ల‌భించిన ఒక ముఖ్య‌మైన అవ‌కాశ‌మే అంటూ నేత‌లిద్దరూ వారి స‌మ్మ‌తి ని వ్య‌క్తం చేశారు.

ఇండియా-ఇయు నేత‌ ల స‌మావేశం ఇయు+27 న‌మూనా లో జ‌రిగే ఒక‌టో స‌మావేశం కానుంది.  అంతేకాదు, ఇండియా-ఇయు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత‌ గా బ‌ల‌ప‌ర‌చుకోవాలంటూ ఇరు ప‌క్షాలు వ్య‌క్తపరుస్తున్న ఆకాంక్ష‌ ను ఇది ప్రతిబింబిస్తోంది.




 

***



(Release ID: 1715788) Visitor Counter : 146