ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యలో పెరుగుదల;
గత 24 గంటల్లో 3 లక్షలకు పైగా కోలుకున్న బాధితులు
దేశవ్యాప్తంగా 29.16 కోట్లకు పైగా కోవిడ్ పరీక్షలు
Posted On:
03 MAY 2021 11:08AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటిఒదాకా జరిపిన కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షలు 29 కోట్లు దాటి నేడు 29,16,47,037 కి చేరాయి. ఇప్పటిదాకా
కోలుకున్నవారి సంఖ్య 1,62,93,003 కి చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 81.77% గా నమోదైంది.
గత 24 గంటలలో 3,00,732 మంది కోవిడ్ నుంచి కోలుకొని బైటపడ్దారు. అందు పది రాష్ట్రాలవాటా 73.49% ఉంది..
దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులకంటే చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుదలబాట పట్టింది. ప్రస్తుతం పాజిటివిటీ శాతం 21.19%
గత 24 గంటలలో 3,68,147 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్టాలు – మహారాష్ట్ర, కర్నాటక, కేరళ,
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు., పశ్చిమ బెంగాల్ , ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ల లో 73.78% కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో
అత్యధికం<గా ఒక్క రోజులో 56,647 కేసులు, కర్నాటకలో 37,733, కేరళలో 31,959 కొత్తకేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసుల సంఖ్య 34,13,642 కు చేరుకోగా ఇది మొత్తం పాజిటివ్ కేసులలో .17.13%. గత
24 గంటలలో నికరంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో 63,998 కేసుల పెరుగుదల నమోదైంది. ఇందులో పన్నెండు రాష్ట్రాల
( మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్,
బీహార్, హర్యానా) వాటా దేశవ్యాప్త కేసుల్లో 81.46% ఉంది.
కోవిడ్ సోకినవారిలో మరణాల శాతం తగ్గుతూ ప్రస్తుతం 1.10% కి చేరింది.
గత 24 గంటలలో 3,417 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో 10 రాష్ట్రాల వాటా 74.54% కాగా మహారాష్ట్రలో
అత్యధికంగా 669 మంది, ఆ తర్యువాత ఢిల్లీలో 407 మంది, ఉత్తరప్రదేశ్ లో 288 మంది చనిపోయారు.
మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి:
డామన్-దయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లక్షదీవులు, అరుణాచల్ ప్రదేశ్
*****
(Release ID: 1715625)
Visitor Counter : 213
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam